Brs నాయకురాలు కవిత ప్రతికూల పరిస్థితుల్లో…అనుకూల అవకాశాలను వెతుక్కుంటున్నారు. ఈడీ నోటీసులపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఆమె.ఒక మహిళను సింగిల్ గాఈడీ కార్యాలయంలో విచారణకు పిలవడంపై సుప్రీంకోర్టు పిటిషన్ లో కవిత అభ్యన్తరం వ్యక్తం చేసారు. తనకు ఇచ్చిన నోటీసులో ఇతరులతో కలిపి ప్రశ్నిస్తామన్న ఈడీ అలా చేయలేదని తన పిటిషన్ లో పేర్కొన్నారు
ముందస్తు సమాచారం ఇవ్వకుండానే… మొబైల్ ఫోన్లు సీజ్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచారు కవిత.సీఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం.. ఒక మహిళను ఆమె ఇంటికి వెళ్లి మాత్రమే విచారించాల్సి ఉన్నా… ఈడీ కార్యాలయానికి పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు కవిత. అయితే ఈడీ విచారణ పై స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్ట్ నిరాకరించింది.
ఇదంతా బాగానే ఉంది. కానీ ఈడీ విచారణ కి ముందు కవిత అనుసరిస్తున్న వ్యూహాలు….చాలా చౌకబారుగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అకస్మాత్తుగా ఆమె చట్ట సభల్లో మహిళ రిజర్వేషన్ల కోసం ఉద్యమించడం అందరికి నవ్వు తెప్పిస్తోంది.తెలంగాణ అసెంబ్లీ లో 33 శాతం మహిళలు కు మీరు ఎందుకు సీట్లు ఇవ్వలేదు..? Brs లో ఎంతమంది మహిళలకు సీట్లు ఇస్తున్నారు? కెసీర్ కాబినెట్ లో 2014 లో మహిళలే లేరు కదా….ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నారు? అయినా నువు ఎంపీ గా ఉన్నప్పుడు అడగని డిమాండ్ ఇప్పుడు ఎందుకు లెవనేతవ్ అంటే ఆ ఒక్క ప్రశ్న కు సమాధానం లేదు. ఆ ప్రశ్న కె కాదు జనం అడిగే ఏ ప్రశ్న కు కవిత నుంచి సమాధానం లేదు. మహిళలను ఈడీ ఆఫీస్ కి పిలిచి ప్రశ్నించకూడదని చెప్తున్న ఆమె మహిళలకేం తక్కువ అని నినాదాలు చేస్తున్నారు. జెనం ఇప్పుడు ఇదే ప్రశ్నిస్తున్నారు.మీ వరకు వస్తే రూల్స్ …బిల్స్ గుర్తొస్తాయా అని అడుగుతున్నారు. నేరం చేసిన వ్యక్తిని విచారణ కి పిలిస్తే నేను నేరం చేయలేదని చెప్పాలి కానీ విచారణ కె రాను అంటే ఎలా?ఇదొక్కటే కాదు….ఈడీ ,సీబీఐ నోటీసులు వచ్చిన దగ్గర నుంచి తనను టార్గెట్ చేయడం తెలంగాణ ని టార్గెట్ సీబీయాడమేనంటూ రియాక్షన్స్ ఇచ్చారు. డీనికి చాలదన్నట్లు తెలంగాణ తలవంచదు అని నినాదాలు చేసారు. దీనిపై కూడా చాలా అభ్యన్తరం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ కి నీకు ఏమిటి సంబంధం..? మహిళ వైయుండి సారా అమ్ముకోడానికి సిగ్గులేదా ఇలా ఎన్నో రకాలుగా విమర్శించారు. ఇలా మొదటి నుంచి ఈ ఎపిసోడ్ లో కవిత తప్పటడుగులు వేస్తూనే ఉన్నారు. ఒకసారి తెలంగాణ నినాదం ఎత్తారు…మరోసారి మహిళ రిజర్వేషన్ బిల్ అంటూ గోల చేస్తున్నారు…మరోసారి అసలు నన్ను విచారణ ఎలా చేస్తారంటూ కోర్ట్ కి ఎక్కారు. ఈ వ్యహాలన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. చేసిన తప్పులని కవర్ చేసుకోడానికి ఇన్ని డొంక తిరుగుడు వ్యవహారాలు అవసరమా అని విసుక్కుంటున్నారు. కవిత ఒక్క మాట మాట్లాడకుండా విచారణ ఎదుర్కుని ఉంటే సానుభూతి వచ్చేది. అది వదిలేసి ఈ పిల్లి మొగ్గలు వేయడం చూసి…అసలు నిజంగానే కవిత ఏదో చేసి ఉంటుంది లేక పోతే కేస్ ఎందుకు పెడతారు అని జనం మాట్లాడు కుంటున్నారు. అంటే కాదు నాకు లిక్కర్ స్కాం కి ఏమి సంబంధం లేదు…అని కవిత ఒక్కసారి కూడా ధైర్యంగా చెప్పలేదు. ఈడీ విచారణ కుట్ర అని కోర్ట్ లో సవాలు చేయలేదు. అది మ్యాటర్.