Rahul Gandhi: రాహుల్‌ అంటే బీజేపీకి ఇంత భయమా..?

సూరత్ కోర్టు తీర్పు చెప్తూ రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీలుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని కాంగ్రెస్ (Congress) చెప్తోంది. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువున్నా కూడా 24 గంటలు కూడా గడవక ముందే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటరీ (Loksabha Secretary) వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 04:53 PM IST

రాహుల్ గాంధీపై (Rahul Gandhi) అనర్హత వేటు పడింది. ఇటీవలికాలంలో ఒక ఎంపీపై వేటు పడడం (Disqualification) బహుశా ఇదేనేమో.! రాహుల్ గాంధీని సభలో లేకుండా చూడాలని బీజేపీ (BJP) కంకణం కట్టుకున్నట్టుంది. అందుకే ఆగమేఘాలపై రాహుల్ గాంధీని బయటకు పంపించేసింది. సూరత్ కోర్టు (Surat Court) రాహుల్ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించి 24 గంటలు కూడా గడవక ముందే ఆయనపై అనర్హత వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రాహుల్ గాంధీ ఇటీవల బీజేపీని ముప్పతిప్పలు పెడుతున్నారు. ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ముఖ్యంగా అదానీ – మోదీ (Adani – Modi) రిలేషన్ షిప్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మోదానిపై జాయిట్ పార్లమెంటరీ కమిటీ (JPC) వేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. అంతవరకూ ఈ అంశాన్ని వదిలిపెట్టేది లేదని చెప్తున్నారు. అయితే లండన్లో (London) రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ కు క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. దీంతో సభాకార్యక్రమాలు జరగకుండానే పార్లమెంటు సమయం వృధా అవుతోంది.

ఇదే సమయంలో రాహుల్ గాంధీ గతంలో చేసిన కామెంట్స్ పై సూరత్ కోర్టు తీర్పు చెప్పింది. గతంలో మోదీ ఇంటిపేరు కలిగినవాళ్లంతా దొంగలే అని ఒక ర్యాలీలో ప్రసంగించారు రాహుల్. దానిపై కాంగ్రెస్ నేత ఒకరు పరువునష్టం దావా వేశారు. దానిపై ఇప్పుడు సూరత్ కోర్టు తీర్పు చెప్తూ రాహుల్ కు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అప్పీలుకు 30 రోజుల గడువు కూడా ఇచ్చింది. దీనిపై కోర్టులోనే తేల్చుకుంటామని కాంగ్రెస్ (Congress) చెప్తోంది. పైకోర్టులో అప్పీలు చేసుకునేందుకు 30 రోజుల గడువున్నా కూడా 24 గంటలు కూడా గడవక ముందే రాహుల్ గాంధీపై లోక్ సభ సెక్రటరీ (Loksabha Secretary) వేటు వేయడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

రాహుల్ గాంధీ అంటే బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ పార్టీ నేతలు ఈ మధ్య చెప్తున్నారు. ఇప్పుడు రాహుల్ ను సభ నుంచి బయటకు పంపడం ఈ కామెంట్స్ కు బలం చేకూర్చేలా ఉంది. బీజేపీ కూడా రాహుల్ ను పదేపదే టార్గెట్ చేస్తోంది. భారత్ జోడో యాత్ర (Bharat Jodo Yatra) తర్వాత రాహుల్ గాంధీ రాటుదేలారు. గతంలో లాగా ఇప్పుడు పప్పు కాదని బీజేపీ నేతలే అంగీకరిస్తున్నారు. రాహుల్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక తలలు పట్టుకుంటున్నారు. అందుకే రాహుల్ ను ఎలాగైనా వదిలించుకోవాలని బావించినట్లుంది బీజేపీ. కోర్టు తీర్పు రాగానే వేటు వేసేసింది. ఇది కాంగ్రెస్ కు కలిసొస్తుందా.. లేకుంటే బీజేపీకి మేలు చేస్తుందా.. అనేది చూడాలి.