టాలీవుడ్ లో ఇప్పుడు నాగ చైతన్య వివాహం సంచలనం అవుతోంది. సమంతాతో బ్రేకప్ అయిన తర్వాత శోభిత ధూళిపాళ్ళను వివాహం చేసుకుంటున్నాడు. వచ్చే నెల 4 న ఈ వివాహం జరగనుంది. సరిగా నెల రోజులు ఉంది ఈ వివాహానికి. ముందు విదేశాల్లోనే చేయాలని భావించినా వద్దని అన్నపూర్ణా స్టూడియోస్ లోనే వివాహం చేస్తున్నారు నాగార్జున. ఇప్పటికే పెళ్లి పనులు కూడా మొదలయ్యాయి. ఇటీవల రెండు ఫ్యామిలీలు ఓ వీడియో పోస్ట్ చేసి దీనిపై క్లారిటీ ఇచ్చాయి. ఇక డెకరేషన్ పనులు కూడా స్టార్ట్ చేసారు.
త్వరలోనే భారీ సెట్ కూడా వేసే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఈ వివాహానికి అటెండ్ అయ్యే అతిధులు ఎవరు అనే దానిపై టాలీవుడ్ తో పాటుగా పొలిటికల్ సర్కిల్స్ లో కూడా పెద్ద చర్చే జరుగుతోంది. నాగార్జునకు అందరితో మంచి సంబంధాలే ఉన్నాయి. కొందరితో అంతకు మించిన దూరమే ఉంది. దేశ వ్యాప్తంగా సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులను పిలవాలని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఓ ఇద్దరి పేర్లు ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. వైఎస్ షర్మిల, వైఎస్ జగన్. ఈ ఇద్దరినీ ఆహ్వానిస్తారా లేదా అనేది క్లారిటీ రావడం లేదు.
ఈ ఇద్దరి మధ్య ఆస్తుల తగాదాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. జగన్ ను కాదని షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ లో జాయిన్ అయి అక్కడి నుంచి వర్క్ స్టార్ట్ చేసారు. ఈ మధ్య బయటకు వచ్చిన లేఖలు కూడా పెద్ద దుమారమే రేపాయి. ఇక ఇద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు కూడా ఈ మధ్య కాలంలో లేవనే చెప్పాలి. తమ తండ్రి వైఎస్… వర్ధంతి, జయంతి వేడుకల్లో కూడా వారు కలిసి పాల్గొనడం లేదు. అటు వైఎస్ విజయమ్మ కూడా ఇప్పుడు జగన్ కు దూరంగానే ఉన్నాయి. ఈ తరుణంలో ఆహ్వానిస్తారా లేదా అనేది క్లారిటీ రావడం లేదు.
షర్మిలతో కూడా నాగార్జునకు మంచి సంబంధాలే ఉన్నాయి. ఇద్దరూ వ్యాపారంలో భాగస్వాములు అనే టాక్ కూడా ఉంది. అటు జగన్ తో కూడా నాగార్జునకు మంచి స్నేహమే ఉంది. అక్కినేని ఫ్యామిలీతో ముందు నుంచి జగన్ సన్నిహితంగానే ఉన్నారు. మరి ఆహ్వానిస్తారా లేదా అనేది చూడాలి. ఒకవేళ ఆహ్వానిస్తే అటెండ్ అవుతారా లేదా అనేది కూడా క్లారిటీ లేదు. షర్మిల కుమారుడి వివాహానికి జగన్ అలా వచ్చి ఇలా వెళ్ళారు. మరి ఇద్దరూ ఎదురుపడితే మాట్లాడుకుంటారా లేదా అనేది కుడా చూడాలి.