AP Politics : జగన్, షర్మిల మళ్లీ కలుస్తారా.. తల్లిడిల్లుతోన్న విజయమ్మ హృదయం..

షర్మిల కొడుకు రాజారెడ్డి (Raja Reddy) నిశ్చితార్థ (Engagement) వేడుక.. ఇప్పుడు రాజకీయ రంగు పులుకుంటోంది. సొంత చెల్లి కూడా పట్టించుకోలేదని జగన్‌ను ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటే.. పిలిచి మరీ అవమానించిన షర్మిల (YS Sharmila) గురించి సమాజం ఏమనుకుంటుందో వినండి అంటూ.. వైసీపీ బ్యాచ్‌ వాదన మొదలుపెట్టింది. ఇద్దరి పంచాయితీ ఎలా ఉన్నా.. ఈ రెండింటి మధ్యలో ఓ తల్లి హృదయం చాలా వేదన పడుతోంది.

షర్మిల కొడుకు రాజారెడ్డి (Raja Reddy) నిశ్చితార్థ (Engagement) వేడుక.. ఇప్పుడు రాజకీయ రంగు పులుకుంటోంది. సొంత చెల్లి కూడా పట్టించుకోలేదని జగన్‌ను ప్రత్యర్థి పార్టీలు విమర్శిస్తుంటే.. పిలిచి మరీ అవమానించిన షర్మిల (YS Sharmila) గురించి సమాజం ఏమనుకుంటుందో వినండి అంటూ.. వైసీపీ బ్యాచ్‌ వాదన మొదలుపెట్టింది. ఇద్దరి పంచాయితీ ఎలా ఉన్నా.. ఈ రెండింటి మధ్యలో ఓ తల్లి హృదయం చాలా వేదన పడుతోంది. రెండు కళ్లలాంటి ఇద్దరు బిడ్డలు.. ఒకరి మీద ఒకరు పంతంతో ఉండడంతో.. విజయమ్మ హృదయాన్ని మరింత కోత పెడుతుందని.. సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. షర్మిలతో ఎలాంటి విభేదాలు ఉన్నా.. మేనల్లుడి ఎంగేజ్‌మెంట్‌కు సతీసమేతంగా వచ్చారు ఏపీ సీఎం జగన్‌. ఆయన రాకను అసలు పట్టించుకున్నట్లు కూడా కనిపించని షర్మిల.. మిగతా అతిధులకు మాత్రం ఎదురెళ్లి స్వాగతం చెప్పింది.

ఇక గ్రూప్ ఫొటో దిగేప్పుడు జరిగిన సంఘటన అయితే.. ప్రతీ ఒక్కరి కళ్ల ముందు కదులుతూనే ఉంది ఇంకా ! ఫొటో దిగుదామని పక్కనే ఉన్న కుటుంబసభ్యులను జగన్ పిలిచారు. చెల్లి ష‌ర్మిల‌తో పాటు బావ అనిల్‌ను కూడా ఆహ్వానించారు. ఐతే షర్మిల, అనిల్‌ వాటిని పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించలేదు సరికదా.. మొహం మీద తిరస్కరిచినట్లు అనిపించింది. ఆ సమయంలో విజయమ్మ కలుగజేసుకున్నారు. కూతురిని దగ్గరికి పిలిచారు. దీంతో ఏదో ఫొటో దిగాం అంటే దిగాం అన్నట్లుగా.. జగన్‌కు దూరంగానే ఉండి ఫొటో దిగారు షర్మిల, అనిల్ దంపతులు. అన్నాచెల్లెళ్ల మధ్య ఎన్నైనా ఉండొచ్చు.. వారి మధ్య తీర్చేలని విభేదాలు కూడా రావొచ్చు.. రాజకీయంగా ఎన్ని మాటలు అయినా వినిపించి ఉండొచ్చు కానీ.. ఆ తల్లి బాధ మాత్రం స్పష్టంగా కనిపించింది.

ఫొటో దిగి వెళ్లేప్పుడు విజయమ్మను (Vijayamma) ఆప్యాయంగా కౌగిలించుకున్నారు జగన్‌. సరిగ్గా కనిపించలేదు కానీ.. విజయమ్మ కళ్లలో నీళ్లు తిరిగాయ్ అంటున్నారు అక్కడే ఉన్నవాళ్లు! కడుపున పుట్టిన ఇద్దరు బిడ్డలు కలిసి ఉండాలని ఏ తల్లికి ఉండదు. ఐతే విజయమ్మకు మాత్రం.. జరుగుతున్న పరిణామాలను మనసుకు రంపపు కోతగా మారాయనే చర్చ జరుగుతోంది. షర్మిల, జగన్ ఇకపై అయినా కలుస్తారా.. ఆ దూరం దగ్గరవుతుందా.. ఆ తల్లి వేదన తీరుతుందా అంటూ.. బరువెక్కిన గుండెలతో కామెంట్లు పెడుతున్నారు చాలామంది.