తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం మంచి ఊపు మీద ఉంది. వరుసగా రెండు సార్లు బీఆర్ఎస్ అధికారం చేపట్టింది. ఈ టైమ్ లో రియల్ ఎస్టేట్ రంగం ఉరకలెత్తింది. గులాబీ పార్టీ లీడర్లు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టారు. ఆ పార్టీకి ఎన్నికల పెట్టుబడులు కూడా ఈ రంగం నుంచే ఎక్కువగా వచ్చాయి. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఏంటి అని రియల్టర్ల గుండెల్లో రైళ్ళు పరుగులు పెడుతున్నాయి. కారు పార్టీతో సత్సంబంధాలు పెట్టుకున్న వాళ్ళంతా బెంబేలెత్తున్నారు.
Telangana CM : తెలంగాణ కాంగ్రెస్ లో కుర్చీలాట.. రేవంత్ కి అడ్డుపడుతోంది ఎవరు ?
రాష్ట్రంలో చాలామంది బీఆర్ఎస్ నాయకులకు రియల్ ఎస్టేట్ వ్యాపారులతో బలమైన సంబంధాలు ఉన్నాయి. అసలు గులాబీ పార్టీలో ఉన్న వాళ్ళల్లో సగం మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే. అందకే భూ వివాదాలు పరిష్కరించడంలో, పర్మిషన్లు ఇవ్వడంలో కేసీఆర్ ప్రభుత్వం జోరుగా ఉండేది. ధరణిని అడ్డం పెట్టుకొని కొన్ని ప్రభుత్వ భూములు మాయం చేసి.. కొందరు బీఆర్ఎస్ లీడర్లు అమ్ముకున్నట్టు కూడా కాంగ్రెస్ లీడర్లు తరుచుగా ఆరోపిస్తూ ఉంటారు. కేటీఆర్, కవిత, సంతోష్ రావు మిగిలిన బీఆర్ఎస్ లీడర్లందరికీ .. రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఉన్నాయని చెబుతారు. దాంతో ఈ పదేళ్ళలో రియల్టర్లు ఆడిందట పాడింది పాటగా సాగింది.
ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వం పోయి.. కాంగ్రెస్ వస్తోందంటే… రియల్ ఎస్టేట్ వ్యాపారులు భయపడుతున్నారు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి రియల్ ఎస్టేట్ రంగంపై పూర్తి అవగాహన ఉంది. గతంలో చాలామందిని రేవంత్ బెదిరించాడనీ.. RTI సమాచారంతో బిల్డర్లను ఇరుకున పెట్టాడని ఆరోపణలు ఉన్నాయి. ఆక్రమణలు, అవకతవకలు, బిల్డింగ్ పర్మిషన్లు లేకుండా కట్టినవి.. ఇలా హైదరాబాద్ సహా రాష్ట్రంలో ఎక్కడ ఫ్రాడ్ జరిగినా ఆ సమాచారం మొత్తం రేవంత్ రెడ్డికి సాక్ష్యాధారాలతో సహా చేరిపోతుంది. దాంతో ముందు జాగ్రత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు కాంగ్రెస్ అధిష్టానంతోనే నేరుగా సంబంధాలు పెట్టుకున్నారు. పార్టీకి విరాళాలు కూడా భారీగానే ఇచ్చారు. ఎన్ని చేసినా రేవంత్ రేపు అధికారంలోకి వచ్చాక తమతో ఎలా ఆడుకుంటాడని భయపడుతున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. అయితే ఇందులో మరో వర్గం.. ముఖ్యంగా రెడ్లు మాత్రం రేవంత్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. రేవంత్ తో సన్నిహిత సంబంధాలు ఉన్న రియల్ వ్యాపారులు ఇక తమ పంట పండుతుందని ఆశపడుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఒక ఆట ఆడుకోవచ్చని ప్లాన్ లో ఉన్నారు.
ఇరిగేషన్ కాంట్రాక్టర్లు, ఇన్ఫ్రా కాంట్రాక్టర్లకు కూడా బీఆర్ఎస్ హయాంలో స్వర్గంలా నడిచింది. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ కి వాళ్ళు పూర్తి సహకారం అందించారు. ఫండింగ్ భారీగానే ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మారితే.. ఈ కాంట్రాక్టర్ల భవిష్యత్తు ఏంటన్నది కూడా ఆలోచించాల్సిందే. రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ తీసుకుంటాడా.. తన సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకుంటాడా? లేక పార్టీ లైన్స్ లోనే వీళ్ళతో మంచి సంబంధాలు నడుపుతాడా అన్నదానిపై రియల్ ఎస్టేట్, పారిశ్రామిక వర్గాల్లో టాక్ నడుస్తోంది.