Top story ట్రంప్ గెలుపుతో ఇమ్మిగ్రేషన్ చట్టాలను మరింత కఠినంగా మారుస్తారా .

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రచారంలో అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని హామీ ఇచ్చారు.

  • Written By:
  • Publish Date - November 9, 2024 / 10:00 PM IST

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ విజయం సాధించారు. జనవరిలో రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. డోనాల్డ్ ట్రంప్ గెలుపుతో భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ప్రచారంలో అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించి వేస్తామని హామీ ఇచ్చారు. సహజసిద్ధంగా వచ్చే అమెరికా పౌరసత్వాన్ని అడ్డుకుంటామని డోనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్ ఎన్నికల ప్రచారంలో స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ రెడీ అవుతున్నారు. బాధ్యతలు చేపట్టిన తొలి రోజే…ఇమ్మిగ్రేషన్ చట్టాలను కఠినతరం చేయనున్నారు. సహజంగా అమెరికాలో జన్మించిన వారు…జీవతంలో ఎపుడైనా అమెరికా పౌరుడిగా మారడానికి అవకాశం ఉంటుంది. సహజసిద్ధంగా వచ్చే అమెరికా పౌరసత్వాన్ని అడ్డుకుంటామని డొనాల్డ్ ట్రంప్ ప్రతిజ్ఞ చేశారు.

తొలి రోజు నుంచే యుఎస్ ఇమ్మిగ్రేషన్ పాలసీలో పెద్ద మార్పులకు శ్రీకారం చుట్టేందుకు కసరత్తు ప్రారంభించనున్నారు. అక్రమ వలసదారుల ఏరివేత లక్ష్యంగా పటిష్టమైన చట్టాలను తయారు చేయాలని నిర్ణయించారు. అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించగానే…ఇమ్మిగ్రేషన్ చట్టాల్లో మార్పులకు సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేయనున్నారు. వలసదారుల పిల్లలు ఆటోమేటిక్ గా అమెరికా పౌరులుగా మారడానికి…తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు యుఎస్ పౌరుడై ఉండాలి. లేదంటే చట్టబద్దంగా అమెరికా పౌరసత్వం పొంది…అమెరికాలో నివసిస్తున్న వ్యక్తిగా ఉండాల్సిందేనని ఫెడరల్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ అవుతాయి. అంటే అమెరికాలో జన్మించిన పిల్లలు కానీ, తల్లిదండ్రులు ఇద్దరు అమెరికాలోనే జన్మించినా…లేదంటే శాశ్వత పౌరుడిగా మారిన వ్యక్తి కూడా అమెరికా పౌరసత్వానికి అర్హుల్ కాకపోవచ్చు.

2023 మొదటి త్రైమాసికంలో ఇండియా నుంచి పది లక్షల మందికిపైగా ఉపాధి కోసం గ్రీన్ కార్డ్ బ్యాక్‌లాగ్ 1 కింద అమెరికా వెళ్లారు. గ్రీన్ కార్డ్ తో వచ్చే అమెరికా పౌరసత్వం కోసం 50 సంవత్సరాలు నిరీక్షించాల్సి వస్తోంది. స్టూడెంట్ వీసా లేదా ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన 5 లక్షల మందికిపైగా భారతీయులు ఉన్నారు. వీరందరికి అమెరికా పౌరసత్వం వచ్చే లోపు…సగం మంది చనిపోయే అవకాశం ఉంది. దాదాపు మూడు లక్షల మంది పిల్లలు అమెరికా పౌరసత్వం కోసం వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. చట్టపరమైన, అనుమతించదగిన 21 ఏళ్ల వయస్సును దాటిపోతారు. అంతకు మించి వారికి ప్రత్యామ్నాయ వీసా లేకుండా…స్టూడెంట్ వీసా వంటి వాటి మీద ఉంటే వారంతా అక్రమ వలసదారులు అవుతారు. డోనాల్డ్ ట్రంప్ తీసుకోబోయే ఇమ్మిగ్రేషన్ చట్టం రాజ్యాంగ విరుద్దమని అమెరికా నిపుణులు చెబుతున్నారు. సహజ సిద్ధమైన పౌరసత్వాన్ని అడ్డుకునేందుకు ట్రంప్ తీసుకునే నిర్ణయంపై కోర్టులకు వెళ్లే అవకాశం ఉంది.

అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణలోని సెక్షన్ 1 ప్రకారం…యునైటెడ్ స్టేట్స్‌లో జన్మించిన లేదా సహజసిద్ధమైన వ్యక్తులందరూ, దాని అధికార పరిధికి లోబడి నివసించేవారే అమెరికా పౌరులు అవుతారు. యునైటెడ్ స్టేట్స్ పౌరుల హక్కులు లేదా రోగనిరోధక శక్తిని తగ్గించే ఏ చట్టం అడ్డుకోదు. అంతేకాకుండా చట్టబద్ధమైన ప్రక్రియ లేకుండా ఏ వ్యక్తికయినా సమాన రక్షణను నిరాకరించడానికి వీలు లేదు. 2022 అమెరికా జనాభా లెక్కల ప్రకారం…యుఎస్ను తమ నివాసంగా మార్చుకున్న 4.8 మిలియన్ల భారతీయ-అమెరికన్లు ఉన్నట్లు అంచనా. వీరిలో 1.6 మిలియన్ల భారతీయ-అమెరికన్లు అమెరికాలో పుట్టి పెరిగారు, వారంతా ఆటోమేటిక్ గా అమెరికా సహజ పౌరులుగా మారిపోయారు.