హీరోయిన్ కేసుపై వైసీపీ క్లారిటీ.. ఆధారాలతో సహా బట్టబయలు..

ముంబై హీరోయిన్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని.. 15రోజులు నరకం చూపించారంటూ.. ముంబై హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది.

  • Written By:
  • Publish Date - August 29, 2024 / 01:03 PM IST

ముంబై హీరోయిన్ వ్యవహారం.. ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తోంది. పోలీసులు, వైసీపీ నేతలు కలిసి తనను హింసించారని.. 15రోజులు నరకం చూపించారంటూ.. ముంబై హీరోయిన్ కన్నీళ్లు పెట్టుకుంది. ముంబై నుంచి హీరోయిన్‌ను విజయవాడకు తీసుకొచ్చిన వ్యవహారం కాస్త ఇప్పుడు కిడ్నాప్ కేసుగా మారబోతుందనే టాక్ నడుస్తోంది. ఈ వివాదం ఇప్పుడు రాజకీయ నేతలకు, పోలీస్ అధికారులకు చుట్టుకొనే ప్రమాదం కనిపిస్తోంది. హిందీ హీరోయిన్‌తో వైసీపీ నేత కుమారుడు ప్రేమ వ్యవహారం నడిపారు.

అయితే పెళ్లి వరకు వచ్చే సరికి కుటుంబం వ్యతిరేకించడంతో.. ప్రేమికుడు ప్లేట్ ఫిరాయించాడు. అయితే ఆ అమ్మాయి వినకపోవడం, బెదిరింపులకు పాల్పడటంతో రాజకీయ నేత తన పార్టీ కీలక నేతలకు తన కుమారుడి వ్యవహరాన్ని వివరించారు. దాంతో అప్పటి ప్రభుత్వంలో అత్యంత శక్తివంతమైన నేత నిర్ణయంతో పోలీసులు రంగంలోకి దిగారు. వైసీపీ నేత కొడుకుతో విజయవాడలో కేసు పెట్టింది.. ముంబై నుంచి హీరోయిన్‌ను లాక్కొచ్చారు. ఆ తర్వాత నరకం చూపించారు. ఐతే ఇదంతా వైసీపీ నేత కొడుకు కోసం మాత్రమే కాదు.. జేఎస్‌డబ్య్యూ ఎండీ సజ్జన్‌ జిందాల్‌ కోసం అని.. సజ్జల అందుకే ఇంత కష్టపడ్డారని మరో ప్రచారం మొదలైంది.

ఇక అటు ఓ టీవీ చానెల్‌ డిబేట్‌లో పాల్గొన్న హీరోయిన్.. వైసీపీ నేత కొడుకు తనకు న్యూడ్ కాల్స్ చేసి వేధించేవాడంటూ.. ఫొటోలు బయటపెట్టింది. దీంతో హీరోయిన్ వ్యవహారం వైసీపీ పరువును బజారులోకి లాగినట్లు అవుతోంది. ఇక బాలీవుడ్‌ హీరోయిన్‌ కేసుపై… వైసీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ముంబై నటి కేస్ చూస్తుంటే… హనీ ట్రాపింగ్‌గా కనిపిస్తుందని వైసీపీ నేతలు కొందరు… సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

ఆ ముంబై మోడల్ మొదట ఏషియన్ పేయింట్స్ మాలవ్ ధానిపై కూడా 2021లో కేస్ పెట్టిందని.. వాళ్ళ మధ్య ఏదో ఎఫైర్ ఉందని నాడే సోషల్ మీడియా కోడై కూసిందని వైసీపీ శ్రేణులు పోస్టులు పెడుతున్నాయ్. ఆ తర్వాత సజ్జన్ జిందాల్‌పై రెండేళ్ల తర్వాత రేప్ కేస్ పెట్టిందని.. ఆ కేస్ ఫాల్స్ అని పోలీసులే తెల్చేశారని అంటున్నారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న విద్యాసాగర్‌ను టార్గెట్ చేస్తోందని.. ఇదంతా చూస్తుంటే ఈమె పద్దతి హనీ ట్రాప్‌లా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. పారిశ్రామికవేత్తలే టార్గెట్‌గా ఇలా చేస్తోందంటూ వైసీపీ శ్రేణులు చేస్తున్న ప్రచారం… సోషల్‌ మీడియాలో మరో యుద్ధానికి కారణం అవుతోంది.