ఒకప్పుడు పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నేతలకు చిన్న చూపు… రెండు చోట్ల ఓడిపోయాడు… రాజకీయాలకు పనికి రాడు… మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు… ఇలా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు విమర్శలు చేసారు. వైసీపీ నేతల్లో ప్రతీ ఒక్కరు దాదాపుగా పవన్ పై విమర్శలు చేసారు.
“ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్. కథ మారింది, మాట మారింది, రాజకీయం మారింది, చూసే చూపు మారింది. ఇప్పుడు పవన్ అపాయింట్మెంట్ దొరికితే అదే పదివేలని వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు బెజవాడ వీధుల్లో తిరుగుతున్నారు. వైసీపీ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి జనసేనలో పవన్ ఆదేశిస్తే జాయిన్ అవ్వడానికి దాదాపుగా నెల రోజుల నుంచి ఇద్దరు నేతలు ఎదురు చూస్తున్నారు. పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు.
ఇప్పుడు మరో ఇద్దరు నేతలు… జనసేన తీర్ధం పుచ్చుకోవడానికి నానా కష్టాలూ పడుతున్నారు. బుధవారం వైసీపీకి రాజీనామా చేసిన సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి రాత్రికి రాత్రే విజయవాడ చేరుకున్నారు. ఉదయం నుంచి నోవాటేల్ హోటల్ లో ఆయన వెయిట్ చేస్తూనే ఉన్నారు. ముందు మధ్యాహ్నం 3 గంటలకు పవన్ తో భేటీ అనుకున్నారు. కాని అపాయింట్మెంట్ దొరకలేదు. ఆయన కలిసి వస్తే నేను వెళ్తా అని డీవీ మేనార్ హోటల్ లో సామినేని ఉదయ భాను వెయిట్ చేస్తున్నారు.
వీళ్ళు ఇద్దరూ వెళ్లి కలిసి వస్తే నేను వెళ్తా అంటూ కిలారి వెంకట రోశయ్య సిద్దంగా ఉన్నారు. దర్శి మాజీ ఎమ్మెల్యే మద్దిసేట్టి వేణుగోపాల్ కూడా విజయవాడ వచ్చేశారు. రేపో మాపో కేతిరెడ్డి కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతోంది. ఇంకో ఆరుగురు కూడా ఇప్పుడు పవన్ కోసం వెయిటింగ్ లిస్టు లో ఉన్నారు. వీళ్ళల్లో చాలా మంది అధికారం చూసుకుని అప్పుడు చెలరేగిన బ్యాచ్ ఏ. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారి పవన్ హవా నడుస్తోంది. ఇంకెంత మంది బెజవాడ వచ్చి పవన్ కోసం ఎదురు చూస్తారో చూడాలి. వైసీపీ నేతల పరిస్థితి చూసి జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు మీమ్స్ వైరల్ చేస్తున్నారు. ఈ ఫీలింగ్ ఎంట్రా చారి ఇలా ఉంది అంటూ మీమ్స్ పోస్ట్ చేస్తున్నారు.