YCP MLAS: టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో..!

ఇప్పటికే 11 మంది సిట్టింగ్స్ స్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమించగా, మరో జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో సెకండ్‌ లిస్ట్ పై వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల మార్పుతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 02:02 PM IST

YCP MLAS: అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా పార్టీలో భారీ ప్రక్షాళన మొదలుపెట్టారు ఏపీ సీఎం జగన్. ప్రస్తుతం ఉన్న ఇంఛార్జిల మార్పు కసరత్తు వైసిపి సిట్టింగ్ ఎమ్మెల్యేలలో టెన్షన్ పుట్టిస్తోంది. ఇప్పటికే 11 మంది సిట్టింగ్స్ స్థానంలో కొత్త ఇన్చార్జిలను నియమించగా, మరో జాబితా విడుదల చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. దీంతో సెకండ్‌ లిస్ట్ పై వైసీపీ నేతల్లో టెన్షన్ పెరిగిపోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జుల మార్పుతో వైసీపీ నేతల్లో టెన్షన్ నెలకొంది. జాబితా ఎప్పుడొస్తుంది..? వస్తే.. అందులో తమ పేర్లు ఉంటాయో, లేదోనన్న ఉత్కంఠలో ఎమ్మెల్యేలున్నారు. ఎవరికి వారు హైకమాండ్‌ చుట్టూ తిరుగుతూ క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.

CONG FUNDS: కాంగ్రెస్ ఖజానా ఖాళీ…కాంగ్రెస్ దగ్గర డబ్బుల్లేవా ? క్రౌడ్ ఫండింగ్ తో నిధుల వేట

సీటు గ్యారెంటీ అనుకున్న వారు ఊపిరి పీల్చుకుంటుంటే.. స్పష్టత లేని వారు తమ ప్రయత్నాలు తాము చేసుకుంటున్నారు. ఇప్పటివరకూ 11 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జిలను మార్చారు. మొదటి విడత జాబితాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాతో పాటు, రాయలసీమకు చెందిన కొదరు ఎమ్మెల్యేలతో జగన్ ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వీరికి ఎందుకు సీటు ఇవ్వలేకపోతున్నామో వివరించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామంది ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లుగా సర్వేలు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్‌ల ద్వారా అంచనాకు వచ్చారు సీఎం జగన్. అలాంటి వారిని తప్పించి.. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం ఇస్తే విజయానికి తిరుగుండదని లెక్కలు వేసుకుంటున్నారు. ఇందులో భాగంగా సర్వే నివేదికలను అభ్యర్థుల ముందే ఉంచి, తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లుగా వారికి వివరించారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందనీ.. అప్పుడు నామినేటెడ్ పదవులు ఇస్తామనీ.. అన్ని విధాలుగా న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చినట్టు సమాచారం. రెండో విడత జాబితా విడుదల చేసేందుకు తాడేపల్లి కేంద్రంగా నేతలతో వరుస సమావేశాలు నిర్వహించారు ముఖ్యమంత్రి. 40 మంది ఎమ్మెల్యేల వరకూ సీఎం జగన్‌తో తాడేపల్లిలో సమావేశమయ్యారు. మొత్తంమీద ఇన్‌ఛార్జ్‌ల మార్పు కసరత్తు వైసీపీలో కాక రేపుతోంది.

రెండో జాబితాపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు సిట్టింగులు. మరి పార్టీ అధినేత, సీఎం జగన్ మనసులో ఏముందో ? ఎవర్ని ఎక్కడికి మార్చుతారో ? సమీకరణాలు ఎలా మారతాయో ? త్వరలోనే తేలనుంది. మరోవైపు కొన్ని చోట్ల టిక్కెట్ల కోసం నేతల  ఆందోళనలు, విమర్శలు కొనసాగుతున్నాయి. చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా అనుచరులు రీజనల్‌ కోఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి ఇంటిముందు ఆందోళన చేశారు. మరోసారి ఎలీజాకే అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులతో నినాదాలు చేశారు. ఇక అనంతపురంలో ఐదు అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల్లో మార్పులకు అవకాశం ఉంది. హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ CMO చుట్టూ తిరుగుతున్నారు. హిందూపూర్‌ ఎంపీ టికెట్‌ బళ్లారి శ్రీరాములు సోదరి శాంతమ్మకు ఇచ్చే యోచనలో హైకమాండ్ ఉంది. రాయదుర్గం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ను మార్చే అవకాశం ఉంది. సిట్టింగ్‌ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి రెండ్రోజుల నుంచి తాడేప్లలిలోనే మకాం వేశారు. ఎమ్మిగనూరు పంచాయితీ ఇంకా తేలలేదు. వయసు రీత్యా చెన్నకేశవరెడ్డి స్థానంలో వేరేవారికి అవకాశం ఇవ్వాలని హైకమాండ్‌ ఆలోచిస్తోంది.