YCP-JANASENA: ఏ మీటింగ్‌లో చూసినా జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగత విమర్శలతో టార్గెట్ చేస్తున్నారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. కానీ అదే పవన్‌తో ఒకప్పుడు ఆయన పొత్తు కోసం ప్రయత్నించారన్న షాకింగ్ న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది. ఈ సంచలన విషయాన్ని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బయటపెట్టారు. దానికి సంబంధించిన వీడియోను జనసేన తమ సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. టీడీపీ-జనసేన, బీజేపీ పొత్తులపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
BJP Operation Akarsh: బీఆర్ఎస్ నుంచి వలసలు.. మరో ఇద్దరికి బీజేపీ ఆఫర్ !
పొత్తుల్లేకుండా ఆ రెండు పార్టీలు పోటీ చేసే పరిస్థితి లేదనీ.. వైసీపీకి భయపడి కూటమిగా జత కట్టారని ఆరోపిస్తున్నారు. ఈ విమర్శలకు కౌంటర్‌గా వైసీపీ కూడా తమతో పొత్తుకు ప్రయత్నించిందంటూ జనసేన సోషల్ మీడియా విభాగం ఓ వీడియోను బయటపెట్టింది. గతంలో పొత్తు కోసం మమ్మల్ని వైసీపీయే ప్రాధేయపడింది అంటూ జనసేన ఈపోస్ట్ చేసింది. పవన్ కల్యాణ్‌తో పొత్తు పెట్టుకోడానికి 2017లో ఏపీ సీఎం జగన్ తహతహలాడారట. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ఈ సంచలన విషయాలు బయటపెట్టారు. 2017లో నంద్యాల ఉపఎన్నికలో వైసీపీ ఓడిన తర్వాత.. పవన్ కల్యాణ్‌తో పొత్తు కోసం వైసీపీ ప్రయత్నించినట్టు పీకే చెప్పారు. 2017లో నంద్యాలలో ఓటమి తర్వాత వైసీపీ తిరిగి పుంజుకునే ప్రయత్నంలో జనసేనతో పొత్తును పరిశీలించినట్టు పీకే తెలిపారు. అప్పట్లో వైసీపీకి పొలిటికల్ స్ట్రాటజిస్ట్‌గా ప్రశాంత్ కిశోర్ వ్యవహరించారు. దాంతో ఈ పొత్తులకు ట్రై చేయాలని వైసీపీ నేతలు, సానుభూతి పరులు పీకేకు చెప్పారట.
ఈ వీడియో ఎప్పుడు.. ఏ ఇంటర్వ్యూ సందర్భంగా పీకే వెల్లడించారో తెలియనప్పటికీ.. జనసేన మాత్రం షేర్ చేసింది. టీడీపీ, బీజేపీతో పొత్తుల విషయంలో వైసీపీ లీడర్లు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టేందుకే ఈ వీడియోని రిలీజ్ చేసినట్టు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయం అని పీకే ఈమధ్యే ఓ ఇంటర్వ్యూలో చెప్పడం కలకలం రేపింది. ఆయన్ని వైసీపీ నేతలంతా తిట్టిపోశారు. మరి జనసేన పొత్తుకు వైసీపీ ప్రయత్నించిందన్న పీకే మాటలపై మంత్రులు, ఆ పార్టీ లీడర్లు ఎలా స్పందిస్తారో చూడాలి.
2017 నంద్యాల ఉప ఎన్నికల ఓటమి తర్వాత జనసేనతో పొత్తు కోసం వైసీపీ ప్రాధేయపడింది#HelloAP_ByeByeYCP pic.twitter.com/kQK5onGPIU
— JanaSena Party (@JanaSenaParty) March 8, 2024