ఏం చేసైనా సిచ్యువేషన్‌ను సెట్ చేస్తారు. నిజానికి యూపీ సీఎం అంటే ఆటోమేటిక్‌గా ఆ వ్యక్తి ఇండియాలో పవర్‌ఫుల్ మ్యాన్. ఎందుకంటే దేశంలో అత్యధిక పార్లమెంట్‌లు ఉన్న స్టేట్ ఉత్తర్ ప్రదేశ్. ఇక్కడ ఎవరి పార్టీ అధికారంలో ఉంటుందో.. దాదాపు కేంద్రంలో కూడా అదే పార్టీ పవర్‌లోకి వస్తుంది. అలా కాకపోయినా.. సెంట్రల్ గవర్నమెంట్ మీద యూపీ గవర్నమెంట్‌కు మంచి పట్టు ఉంటుంది. అలాంటిది ఇప్పుడు యూపీలో, సెంట్రల్‌లో బీజేపీనే ఉంది. దానికి తోడు ఇక్కడ గ్యాంగ్‌స్టర్‌లకు బాప్ ఉన్నాడు. ఇంకేముంది. యూపీ రూపు రేఖలు మారిపోయాయి.
డెవలప్‌మెంట్ సంగతి పక్కన పెడితే మాఫియా ఎఫెక్ట్ మాత్రం బాగా తగ్గింది. యూపీని ఇప్పుడు షాసిస్తున్న యోగీ ఆధిత్యానాథ్ ఓ సామాన్య వ్యక్తిగా జీవితాన్ని ప్రారంభించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోరక్‌పూర్‌కు చెందిన యోగి అసలు పేరు అజయ్ మోహన్ బిష్త్. ఓ సామాన్య హిందూ అతివాది. 22 ఏళ్లకే కుటుంబం, బంధాలకు గుడ్‌బై చెప్పి సన్యాసం తీసుకున్నారు. ఈస్ట్ ఉత్తర్‌ప్రదేశ్‌లో జన జాగరణ్ అభియాన్‌ను ప్రారంభించారు. అక్కడే ఆయన రాజకీయాలవైపు వెళ్లారు. అంటరానితనంపై పోరాటం చేశారు. హిందుతత్వం, సామాజికసేవతో పాటు చదువులోనూ యోగి నెంబర్ వన్.
హేమావతి బహుగుణ గర్వాల్ యూనివర్సిటీ నుంచి మేథమేటిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు యోగి. అప్పుడు ఆయన యూనివర్సిటీ టాపర్. పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్‌తో బీజేపీలో చేరారు. 1998లో తొలిసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. అప్పటికి ఆయన ఏజ్.. జస్ట్ 26 ఇయర్స్. అప్పటి నుంచి వరుసగా ఐదు సార్లు ఎంపీగా గెలిచారు యోగి. కానీ ఆ రోజుల్లో యూపీని మాఫియా శాసించేది. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వమే మాఫియాను పెంచి పోషించేది. తమను ప్రశ్నించినవాళ్ల మీదకు మాఫియాను ఉసిగొల్పేది. అప్పటికే ప్రభుత్వాని వ్యతిరేకంగా ఉన్న యోగిని మాఫియా టార్గెట్ చేసింది. అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది. చంపేస్తామంటూ బెదరింపులు, ప్రతీ చోటా అవమానం. వీటన్నికీ వ్యతిరేకంగా యోగి శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దాన్ని రీజన్‌గా చూపుతూ సమాజ్‌వాదీ ప్రభుత్వం యోగిని అరెస్ట్ చేసింది. 14 రోజులు జైలులో చిత్రహింసలు పెట్టింది. రిలీజ్ అయ్యాక 2007లో పార్లమెంట్ సెషన్‌కు వెళ్లిన యోగి అందరి ముందూ కన్నీళ్లు పెట్టుకున్నారు. తనను చంపేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఏడ్చారు. తనకు ఒక రోజు వస్తుందని.. వచ్చిన రోజు ప్రతీ ఒక్కరికీ సమాధానం చెప్తానని సవాల్ చేశారు. ఆ తరువాత 2017లో యూపీలో బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఎంపీ పదవికి రాజీనామా చేసి యూపీ సీఎం బాధ్యత చేపట్టారు యోగి. అంతే సీన్ మారిపోయింది. బుల్డోజర్లు రంగంలోకి దిగాయి. గ్యాంగ్‌స్టర్‌ల హిట్‌లిస్ట్ రెడీ అయ్యింది. పోలీసుల గన్స్ ఎన్‌కౌంటర్లకు రెడీ అయ్యాయి. మ్యాజగెన్స్ బుల్లెట్స్‌తో నిండిపోయాయి. అప్పటి వరకూ యూపీ మాది అని కాలర్ ఎగరేసిన ప్రతీ గ్యాంగ్‌స్టర్స్ ప్రాణాలు కాపాడుకునేందుకు దారి వెతుక్కోవడం ప్రారంభించారు.
ఏ మాఫియా అయితే తనను కన్నీళ్లు పెట్టేలా చేసిందో అదే మాఫియాను షేక్ చేశాడు యోగి. ముక్తార్ అన్సారీ, వికాస్ దుబే, అతీక్ అహ్మద్, మున్నా బజ్‌రంగీ, రాకేష్ పాండే, ధనంజయ్ సింగ్, బబ్లూ శ్రీవాస్తవ ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంటుంది. ప్రతీ గ్యాంగ్‌స్టర్ గుండెల్లో బుల్లెట్ దింపింది యోగీ సర్కార్. గ్యాంగ్‌స్టర్ అవ్వాలనే ఆలోచన కూడా ఎవరికీ రాకుండా చేసింది. యోగీ హయాంలో ఇప్పటి వరకూ ఏకంగా 10 వేల 713 ఎన్‌కౌంటర్లు జరిగాయి. ఇంకా జరిగే చాన్స్ కూడా ఉంది. యూపీలో గ్యాంగ్‌స్టర్ల వేట ఇంకా కొనసాగుతూనే ఉంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీ గెలిస్తే యోగి ప్రధాని అయ్యే చాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదే జరిగితే యూపీ సీన్ ఇండియా మొత్తం రిపీట్ అవ్వడం గ్యారెంటీ.