CM. Ex-wife : నీ న్యూడ్‌ ఫొటోలు లీక్‌ చేస్తా.. సీఎంకు మాజీ భార్య బెదిరింపు..

పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులు ఉగ్రవాదుల నుంచో శతృవుల నుంచో కాదు. కట్టుకున్న భార్య నుంచి. అవును.. ఎక్కువ చేస్తే నగ్న ఫొటోలు లీక్‌ చేస్తానంటూ పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ మాజీ భార్య ఇంద్రప్రీత్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు.

పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌కు బెదిరింపులు వస్తున్నాయి. ఈ బెదిరింపులు ఉగ్రవాదుల నుంచో శతృవుల నుంచో కాదు. కట్టుకున్న భార్య నుంచి. అవును.. ఎక్కువ చేస్తే నగ్న ఫొటోలు లీక్‌ చేస్తానంటూ పంజాబ్‌ సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ మాజీ భార్య ఇంద్రప్రీత్‌ కౌర్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. సీఎం మీరు అనుకునేంత మంచోడు కాదంటూ చెప్పారు. ప్రతీ రోజు పిల్లలను టార్చర్‌ చేస్తున్నాడంటూ ఎవరూ ఊహించని కామెంట్లు చేశారు. ఇదే పద్ధతి కంటిన్యూ చేస్తే.. సీఎం నగ్న ఫొటోలు సోషల్‌ మీడియాలో పెడతానంటూ వార్నింగ్‌ ఇచ్చారు. పంజాబ్‌లో ఇదే ఇప్పుడు హాట్‌ టాపిక్‌. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గానే భవగంత్‌ సింగ్‌ మాన్‌ మాజీ భార్య కూతురూ సీరత్‌ కౌర్‌ కూడా ఆయన మీద సంచలన కామెంట్స్‌ చేసింది.

తన తండ్రి ఇంటికి తాగి వచ్చిన ఇంట్లో గొడవ చేస్తున్నాడంటూ చెప్పింది. చాలా ప్రభుత్వ కార్యక్రమాలకు కూడా తాగే వెళ్తున్నాడంటూ ఆరోపించింది. చాలా సార్లు గురుద్వారా కూడా మందు తాగి వెళ్లాడని బాంబు పేల్చింది. పిల్లల్ని సరిగ్గా చూసుకోలేని వాడు రాష్ట్రాన్ని ఎలా బాగుచేస్తాడు అంటూ ప్రశ్నించింది. సిక్కులు ఎంతో పవిత్రంగా భావించే గురుద్వారకు మందుతాగి వెళ్తున్నాడు అనే ఆరోపణ రావడం.. అది కూడా కన్న కూతురే మాన్‌ మీద ఆరోపణలు చేస్తూ వీడియో రిలీజ్‌ చేయడం సంచలనంగా మారింది. ఈ వీడియోను పంజాబ్‌ ప్రతిపక్ష నేతలు ట్విటర్‌లో షేర్‌ చేశారు. సీరత్‌ మాటనే ప్రతిపక్ష నేతలు కూడా అంటున్నారు. కుటుంబాన్నే సరిగ్గా చూసుకోలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా చూసుకుంటాడంటూ విమర్శిస్తున్నారు. మరి ఈ విమర్శలు భార్యా,బిడ్డల ఆరోపణలకు సీఎం భగవంత్‌ సింగ్‌ మాన్‌ ఏం సమాధానం చెప్తారో చూడాలి.