YSRCP: ఎన్నికల వేళ వైసీపీ.. నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని.. మరికొందరికి అవకాశం ఇస్తోంది. ఇంకొన్ని చోట్ల సిట్టింగుల స్తానాలను వేరే చోటికి బదిలీ చేస్తోంది వైసీపీ అధిష్టానం. వివిధ నియోజకవర్గాలకు ఇంచార్జిలుగా ఇప్పటివరకు నాలుగు జాబితాలు విడుదల చేసిన వైసీపీ.. ఇప్పుడు ఐదో జాబితాపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఐదో జాబితాలో పలువురు సిట్టింగులకు వైసీపీ హ్యాండ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
Mahesh Babu: భారీ వ్యత్యాసం.. ‘గుంటూరు కారం’ కలెక్షన్లు పోస్టర్లకే పరిమితమా!
ఆయా ఎమ్మెల్యేలకు తాడేపల్లిలోని సీఎంవో నుంచి సమాచారం కూడా అందిస్తున్నారు. వరుసగా తమను కలవాల్సిందిగా సలహాదారు సజ్జల సూచిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు తాడేపల్లి పయనమవుతున్నారు. ఇదే సమయంలో ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు జాబితాల్లో మార్పులు చేసే అవకాశం ఉంది. కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించిన కొన్ని పేర్లపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొన్నిచోట్ల తమకు అవకాశం రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు తిరగబడుతున్నారు. మరికొన్ని చోట్ల సరైన వ్యక్తికి ఛాన్స్ రాలేదని భావిస్తున్నారు. అందుకే ఇప్పటికే ప్రకటించిన జాబితాల్లో కొన్ని చోట్ల సమన్వయకర్తల్ని మార్చబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 58 మంది ఎమ్మెల్యేలను మార్చి, నియోజకవర్గాలకు కొత్తవారిని నియమించారు. కొందరు సిట్టింగ్ స్థానం నుంచి కాకుండా.. ఇతర స్థానాల నుంచి పోటీకి దిగబోతున్నారు. ఈ నేపథ్యంలో సిట్టింగ్ స్థానాలు కోల్పోయిన వాళ్లు ప్రత్యామ్నాయాలు వెతుక్కుంటున్నారు. టీడీపీ, జనసేన వైపు చూస్తున్నారు. అధిష్టానంపై తిరగబడుతూ.. బల ప్రదర్శనకు దిగుతున్నారు. దీంతో కొన్ని చోట్ల జగన్ వెనకడుగు వేసి, మళ్లీ మార్పులు చేపట్టబోతున్నారు.
చిలకలూరిపేట, ప్రత్తిపాడు, రేపల్లె, విజయవాడ వెస్ట్ నియోజకవర్గాల్లో తిరిగి మార్పులు చేయబోతున్నారు. చిలకలూరిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి విడదల రజనీని గుంటూరు పశ్చిమ సీటుకు, ప్రత్తిపాడులో ఎమ్మెల్యే సుచరితను తాడికొండకు మార్చగా, రేపల్లెలో ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఎంపీ మోపిదేవి వెంకటరమణ స్ధానంలో ఈపూరి గణేష్‌కు అవకాశం దక్కింది. అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌ను విజయవాడ సెంట్రల్‌కు పంపారు. కానీ, ఈ మార్పుల వల్ల ఇబ్బందులు తలెత్తడంతో.. మళ్లీ ఈ స్థానాల్లో మార్పులు చేయబోతున్నారు. వీటిపై సమీక్ష జరిపి, నిర్ణయం తీసుకుని, ఐదో జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది.