JaiBheem Bharath Party: జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలోకి.. దీని వెనక బాబు స్కెచ్ ఉందా..?

వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారి, ఆ త‌ర్వాత జ‌గ‌న్‌పైనా, వైసీపీపైనా నిత్యం ఆరోప‌ణలు చేసే ద‌స్తగిరి.. జై భీమ్ భార‌త్ పార్టీలో చేరారు. పులివెందుల‌ను నుంచి జ‌గ‌న్‌పై పోటీ చేస్తాన‌ని ప్రక‌టించేశారు.

  • Written By:
  • Publish Date - March 12, 2024 / 04:34 PM IST

JaiBheem Bharath Party: ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్. పాలిటిక్స్ ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో.. ఏది వివాదం అయి కూర్చుంటుందో అర్థం కాని పరిస్థితి. టీడీపీ, వైసీపీ యుద్ధం ఎలా ఉన్నా.. కొన్ని చిన్న చిన్న పరిణామాలు.. రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు కారణం అవుతున్నాయ్. మాజీ న్యాయ‌మూర్తి జ‌డ శ్రావ‌ణ్‌కుమార్.. జై భీమ్ భారత్ పేరుతో ఓ పార్టీ స్థాపించారు.

geethanjali: నేనున్నా.. గీతాంజలి కూతుర్ని చూసి జగన్‌ ఎమోషనల్‌.. ఏం చేశాడంటే

జగన్ వ్యతిరేకులంతా ఆ పార్టీలో చేరుతుండటం.. కొత్త చర్చకు కారణం అవుతోంది. వివేకా హ‌త్య కేసులో అప్రూవ‌ర్‌గా మారి, ఆ త‌ర్వాత జ‌గ‌న్‌పైనా, వైసీపీపైనా నిత్యం ఆరోప‌ణలు చేసే ద‌స్తగిరి.. జై భీమ్ భార‌త్ పార్టీలో చేరారు. పులివెందుల‌ను నుంచి జ‌గ‌న్‌పై పోటీ చేస్తాన‌ని ప్రక‌టించేశారు. ఇక గత ఎన్నికల ముందు విశాఖ ఎయిర్‌పోర్టులో కోడిక‌త్తితో దాడి చేసిన శ్రీ‌నుకు కూడా బెయిల్ మంజూర‌యింది. ఆయ‌న కూడా జై భీమ్ భార‌త్ పార్టీలో చేరారు. అమ‌లాపురం నుంచి పోటీ చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. ఐతే జైభీమ్ పార్టీకి సంబంధించి వైసీపీ శ్రేణులు కొత్త ప్రచారం మొదలుపెట్టాయ్. ఆ పార్టీ వెనక చంద్రబాబు ఉండి నడిపిస్తున్నారని.. జగన్ వ్యతిరేకులందరినీ ఒక్క చోటికి చేరుస్తున్నారనంటూ ప్రచారం మొదలైంది.

టీడీపీలో చేర్చుకునే చాన్స్ ఉన్నా.. అదే జరిగితే వారు చేసే విమర్శలకు విలువ ఉండదని.. అందుకే తటస్థ వేదికలాంటి వేరే పార్టీ నుంచి జగన్‌ను టార్గెట్‌ చేయొచ్చు అన్నది చంద్రబాబు వ్యూహం అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికిప్పుడు ఈ పార్టీ.. వైసీపీ మీద ఎఫెక్ట్ చూపిస్తుందా.. జగన్‌ను దెబ్బతీసే సీన్ ఉందా అంటే.. ఎన్నికల వేళ ఏదైనా జరగొచ్చు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు.