జగన్ కు పొలిటికల్ స్టీమ్ బాత్, వాట్ నెక్స్ట్

గత పదేళ్ళ వైసీపీ ప్రయాణం చూస్తే... వైఎస్ జగన్ అనుకున్నదే జరిగింది, ఆయన చేయాలనుకున్నది చాలా పక్కా లెక్కతో చేసి... తనను తక్కువ అంచనా వేసిన వాళ్లకు చాలా విషయాల్లో స్ట్రాంగ్ పంచ్ లు ఇచ్చారు. కాని కానీ ఇప్పుడు సీన్ చేంజ్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - November 4, 2024 / 05:57 PM IST

గత పదేళ్ళ వైసీపీ ప్రయాణం చూస్తే… వైఎస్ జగన్ అనుకున్నదే జరిగింది, ఆయన చేయాలనుకున్నది చాలా పక్కా లెక్కతో చేసి… తనను తక్కువ అంచనా వేసిన వాళ్లకు చాలా విషయాల్లో స్ట్రాంగ్ పంచ్ లు ఇచ్చారు. కాని కానీ ఇప్పుడు సీన్ చేంజ్ అవుతోంది. అన్న లెక్క తప్పుతోంది… అనుకున్నదే తడవుగా చేయగలిగే జగన్ ఇప్పుడు ఆలోచనలో పడుతున్నారు… ఆలోచనలో భయం కూడా తోడవుతుంది. ఏదో తెలియని ఆందోళన జగన్ ను కమ్మేస్తుంది. కాన్ఫిడెంట్ గా రాజకీయం చేసే జగన్ కు ఫ్యూచర్ భయం భయంగా కనపడుతోంది.

2014 లో జగన్ ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఎక్కువగా గడిపారు. ఏదోక ఉద్యమం చేసేవారు, తానే రంగంలోకి దిగేవారు… పాదయాత్ర చేసి సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఏ ముహూర్తంలో కూర్చున్నారో గాని అక్కడి నుంచే జగన్ కు బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పాలనలో జగన్ పట్టు కోల్పోయారు… పార్టీపై క్రమంగా పట్టు కోల్పోయారు. చివరికి అధికారం కోల్పోయారు. అనాలోచిత నిర్ణయాలు, కక్ష రాజకీయాలు, అరెస్ట్ లు, లెక్క తప్పిన వ్యూహాలు ఇలా ఎన్నో జగన్ ను ఇప్పుడు 11 సీట్లకు పరిమితం చేసాయి.

30 ఏళ్ళ సిఎం కుర్చీ కల కేవలం 5 ఏళ్ళకు మాత్రమే పరిమితం అయింది. జగన్ పాలన బాగుందా అంటే… సమాధానం 11 సీట్లతో వచ్చింది. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేగా, మాజీ సీఎంగా, పార్టీ అధినేతగా మాత్రమే జగన్ ఉన్నారు. కనీసం విపక్ష హోదా కూడా జగన్ కు దక్కకపోవడం ఘోర అవమానమే. విపక్ష హోదా కోసం జగన్ కోర్ట్ కు వెళ్ళడం కూడా కామెడి అయింది. టీడీపీ భయపడి ఇవ్వడం లేదని జగన్ చేసిన కామెంట్స్ ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు జగన్ పోరాటం ఎటు వైపు అనేది కూడా క్లారిటీ లేదు ఆ పార్టీ నేతలకు.

వాతావరణం చూస్తుంటే జగన్ కు కచ్చితంగా పొలిటికల్ స్టీమ్ బాత్ అన్నట్టే ఉంది సీన్. ఎస్ ఏ వైపు చూసినా జగన్ కు కంఫర్ట్ గా పరిస్థితి 100 పర్సంట్ లేదు. షర్మిల ఈ స్థాయిలో ఎదురు తిరుగుతారని… ఎవరూ ఊహించలేదు. విజయమ్మ ఆ లేఖ రాయడం జగన్ కు మానసికంగా ఒక దెబ్బే. ఘర్ ఘర్ కి కహాని అంటూ ఆస్తులపై పోరాటం విషయంలో జగన్ ఎంత తేలికగా కామెంట్ చేసినా… సీన్ అలా లేదు. ఒకరకంగా వైఎస్ కుటుంబంలో జగన్ ఒకరు అయితే… మిగిలిన వారు అందరూ ఒక వర్గం అయ్యారు.

వైఎస్ అవినాష్ రెడ్డి దగ్గర మొదలైన కుటుంబ ముసలం ఇప్పుడు ఆస్తుల తగాదాతో పీక్స్ లో ఉంది. టీడీపీ బ్లాస్ట్ అంటే ముందు అందరూ సిల్లీ అనుకున్నా… టీడీపీ బహిర్గతం చేసిన లేఖలు అంత చిన్నవి కాదు. ఆ తర్వాత షర్మిల లేఖ ఎల్లో అలెర్ట్ అయితే… విజయమ్మ రాసిన లేఖ జగన్ కు రెడ్ అలెర్ట్. ఇక్కడ జగన్ జాగ్రత్త పడి రాజీ పడకపోతే పార్టీ భవిష్యత్తు లేనట్టే. ముందు తన పార్టీ నేతలతో,, సోషల్ మీడియా టీంతో కుటుంబ సభ్యులను బూతులు తిట్టించడం ఆపకపోతే సీన్ ఇంకా వరస్ట్ గా ఉండే ఛాన్స్ ఉంది.

ఇక పార్టీ నేతలు చాలా వరకు పార్టీకి గుడ్ బై చెప్పే సిగ్నల్స్ కనపడుతున్నాయి. బాలినేని బయటకు వెళ్ళడం అంత సిల్లీ విషయం కాదు. జగన్ కోసం మంత్రి పదవి వదులుకుని పార్టీలో చేరిన… మోపిదేవి గుడ్ బై చెప్పారు. ఇక అన్ననే వ్యతిరేకించి జగన్ వెంట నడిచిన ధర్మాన కృష్ణదాస్ కూడా జగన్ కు గుడ్ బై చెప్పి జనసేనలో జాయిన్ అయ్యే ఆలోచనలో ఉన్నారు. కడప జిల్లాలో ఓ కీలక నేత కూడా పార్టీ సంకేతాలు కనపడుతున్నాయి. ముందు నుంచి జగన్ వెంట నడిచిన వాసిరెడ్డి పద్మ పార్టీ మారుతూ చేసిన కామెంట్స్ చిన్నవెం కాదు.

ఇక కేంద్రంలో కూడా జగన్ అనుకూల పరిస్థితి ఏ వైపు నుంచి కనపడటం లేదు. కాంగ్రెస్ కు దగ్గర కావాలని చూసినా… చెల్లెలు షర్మిల, తెలంగాణా సిఎం రేవంత్ రెడ్డి అడ్డు పడుతున్నారు. రెడ్ బుక్ చాప్టర్ 3 అంటూ లోకేష్ ఓ ప్రకటన చేసిన తర్వాత… అసలు అరెస్ట్ చేయబోయేది జగన్ నే అంటూ ఓ వార్త కూడా వచ్చింది. అదే జరిగితే జగన్ వెంట నిలబడే నాయకులు ఎందరు అనేది చెప్పలేం. ఇక మాజీ మంత్రులపై వరుసగా ఫిర్యాదులు నమోదు అవుతున్నాయి. ముందు నుంచి జగన్ కు అండగా నిలబడిన కొడాలి నానీ వంటి నాయకులు మీడియా ముందు కనపడటం లేదు. ఇవన్నీ చూస్తుంటే జగన్ కు పొలిటికల్ గా ఫ్యూచర్ గడ్డు కాలమే అంటున్నాయి రాజకీయ వర్గాలు.