YS JAGAN: ఏపీలో ఎన్నికలకు ఇంకా చాలా టైమ్ ఉంది. ఐనా సరే.. అదేదో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చినంత హడావుడి కనిపిస్తోంది. పొత్తులు, ఎత్తులు.. వ్యూహాలు, ప్రతివ్యూహాలు.. సభలు, సమావేశాలు.. మాములుగా లేదు ఏపీ రాజకీయం. వైనాట్ 175 అంటూ దూసుకుపోతున్న జగన్.. గెలుపు కోసం ఎంతవరకైనా వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే 11 మంది నియోజకవర్గాల ఇంచార్జ్‌లను మార్చి.. తన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయో శాంపిల్ చూపించారు. అర్జునుడికి చెట్టు మీద పక్షి, పక్షి కన్ను మాత్రమే కనిపించినట్లు.. జగన్‌కు విజయం మాత్రమే కనిపిస్తోంది.
PAWAN KALYAN: పవన్ తెలిసి తప్పు చేస్తున్నాడా? లోకేష్ పాదయాత్ర ముగింపు సభకు పవన్ వెళ్లడమేంటి..?
దానికి దారి వేసుకునే పనిలో బిజీగా ఉన్నారు. దీనికోసం ఫ్యామిలీని కూడా పట్టించుకోవడం లేదా అంటే అవును అనే సమాధానమే వినిపిస్తోంది. జగన్ చెల్లెలు, వైటీపీ అధ్యక్షురాలు షర్మిల ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగబోతున్నాయ్. షర్మిల కొడుకు రాజారెడ్డి త్వరలో లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాడు. ఐతే మేనల్లుడిని, అతడి పెళ్లిని జగన్ పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన దృష్టి అంతా రాజకీయాల మీదే కనిపిస్తోంది. రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ప్రియా అట్లూరి. ఈమె కూడా రాజారెడ్డిలాగానే అమెరికాలో మాస్టర్స్ పూర్తి చేసింది. ప్రస్తుతం అక్కడ ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఈమె తాత అట్లూరి ప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో పేరొందిన ఛట్నీస్ రెస్టారెంట్ నిర్వాహకుడు. రెండూ కూడా ఉన్నత కుటుంబాలే కావడంతో రాజారెడ్డి, ప్రియ పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. పెళ్లికి అంతా రూట్ క్లియర్ అయినా.. జగన్ వ్యవహారమే ఇప్పుడు హాట్‌టాపిక్ అవుతోంది.
జగన్, షర్మిల మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. ఎన్ని గొడవలు ఉన్నా.. ఎన్ని విభేదాలు ఉన్నా.. రెండు కుటుంబాలకు జగనే పెద్ద. మేనమామగా.. తనకంటూ ప్రత్యేక బాధ్యతలు ఉంటాయ్. ఐతే రాజారెడ్డి పెళ్లి విషయంలో జగన్ నుంచి కానీ, ఆయన కుటుంబం నుంచి కానీ ఎలాంటి రియాక్షన్ కనిపించడం లేదు. రాజారెడ్డి పెళ్లి చేసుకోబోయే అమ్మాయి కుటుంబానికి.. చంద్రబాబుకు దగ్గర సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. నిజంగా అది నిజమా.. అందుకే మేనల్లుడిని జగన్ పట్టించుకోవడం లేదా అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. జగన్ దృష్టి మొత్తం మళ్లీ అధికారం మీదే ఉంది. ఐతే అంతా సెట్ అయ్యాక.. మళ్లీ ముందుండి నడిపించేది జగనే అంటూ.. మరికొందరు అంటున్నారు.