YS JAGAN: వైసీపీకి దూరమవుతున్న రెడ్లు.. బీసీ ఓట్ బ్యాంక్‌పై జగన్ నజర్..

ఈసారి కొందరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తప్పించి.. బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎప్పటి నుంచో జగన్‌ను నమ్ముకొని ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ వైసీపీకి దూరమవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 02:50 PM IST

YS JAGAN: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీ అధినేత, సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీ మంత్రం జపిస్తున్నారా..? అందుకే ఇప్పుడున్న రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి బీసీలకి సీట్లు ఇస్తారా..? టీడీపీ వైపున్న వెనుకబడిన వర్గాల వారిని వైసీపీకి టర్న్ చేయడానికే జగన్ ఈ కొత్త ఎత్తు వేస్తున్నట్టు చెబుతున్నారు. నాలుగు నెలల్లో ఏపీకి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ టైమ్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మార్పులు, చేర్పులపై జగన్ దృష్టిపెట్టారు. నియోజకవర్గాల్లో ఇంఛార్జులను మారుస్తున్నారు.

MLC Shaik Sabjee: రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్సీ మృతి.. షాక్‌లో సీఎం..

ఈసారి కొందరు రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలను తప్పించి.. బీసీ వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. దాంతో ఎప్పటి నుంచో జగన్‌ను నమ్ముకొని ఉన్న రెడ్డి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ వైసీపీకి దూరమవుతున్నారు. తాను బీసీలకు ప్రాధాన్యం ఇస్తున్నానని చెప్పడానికే మంగళగిరిలో తనకు ఎంతో దగ్గరైన ఆర్కేని తప్పించి.. పద్మశాలి వర్గానికి చెందిన గంజి చిరంజీవికి ఇంఛార్జ్ పదవి అప్పగించారు. అంతకుముందే నెల్లూరులో ముగ్గురు రెడ్లు వైసీపీకి దూరమయ్యారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. జగన్‌కి అభిమాని. జగన్ కోసం ఏదైనా చేస్తా అన్న శ్రీధర్ రెడ్డికి మంత్రి పదవి కూడా ఇవ్వలేదు జగన్. నెల్లూరులో కోటంరెడ్డితో పాటు ఆనం రాంనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కూడా వైసీపికి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరారు. అయితే ఈ జిల్లాలో రెడ్లకే పట్టు ఉండటంతో అదే వర్గానికి చెందిన మరో ముగ్గురు కొత్త రెడ్లను ప్రోత్సహించారు జగన్.

BANDI SANJAY: బండి సంజయ్‌కు ఊహించని షాక్‌.. కరీంనగర్‌లో సొంత పార్టీ నేతల తిరుగుబాటు

టీడీసీ హయాంలో కమ్మ కులస్థుల హవా కొనసాగినట్టు.. జగన్ అధికారంలో తమకు తిరుగు ఉండదని కొందరు రెడ్డి లీడర్లు అనుకున్నారు. కానీ జగన్ మాత్రం.. బీసీలు, ఎస్సీలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రస్తుతం జగన్ కోటరీలో విజయసాయిరెడ్డి, సజ్జల, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డికి మాత్రమే ప్రాధాన్యత ఉంది. వీళ్ళంటే మిగతా రెడ్లలో చాలామందికి పడటం లేదు. ఒకవేళ షర్మిల తెలంగాణ పాలిటిక్స్ వదిలేసి.. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌లో జాయిన్ అయితే.. రెడ్డి వర్గమంతా ఆమెతో వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయానికి కుల సమీకరణాలే జగన్‌కు టార్గెట్‌గా కనిపిస్తోంది. అందుకే మంగళగిరిలో బీసీల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆళ్ళ రామక్రిష్ణా రెడ్డిని కాదని.. బీసీలకు చెందిన చిరంజీవిని తీసుకొచ్చారు. ఇదే ఫార్ములా ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని నియోజకవర్గాల్లో ఫాలో అయ్యే అవకాశాలున్నాయి. అయితే ఉమ్మడి ఏపీ నుంచి సాంప్రదాయంగా బీసీల ఓట్లు టీడీపీకి పడుతున్నాయి. అందుకే బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అటు టీడీపీని దెబ్బకొట్టవచ్చు. ఇటు రెండోసారి అధికారంలోకి రావొచ్చు అన్నది జగన్ ప్లాన్.

తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్.కృష్ణయ్యను ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం వెనుక కూడా ఇదే ఉద్దేశం ఉంది. బీసీలకు చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా మండలికి ఎంపిక చేయించి కేబినెట్‌లోకి తీసుకున్నారు జగన్. మండలి రద్దయ్యే టైమ్‌లో రాజ్యసభకు పంపారు. వైసీపీకి యాదవ, మత్స్యకార లాంటి కులాల్లో మద్దతు పెరిగిందని అంటున్నారు. టీడీపీకి సపోర్ట్‌గా ఉండే చేనేత కులాల వారిని కూడా తమ వైపు టర్న్ చేసుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నారు. జగన్ చేపట్టిన ఈ కొత్త బీసీ వ్యూహం వల్ల కొంతమంది రెడ్లు వైసీపీకి దూరమయ్యే అవకాశాలున్నాయి. కానీ బీసీ వర్గాలతో అంతకంటే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని వైసీసీ భావిస్తోంది. 2019లో జగన్‌కి ఉన్నంత రెడ్ల బలం 2024లో ఉండకపోవచ్చని అంటున్నారు. రాయలసీమలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ఇదే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. బీసీ జపంతో ముందుకెళ్తున్న జగన్.. రెండోసారి అధికారంలోకి వస్తారా అన్నది చూడాలి.