YS JAGAN: ఏపీ అసెంబ్లీకి ముందే ఎన్నికలు.. కేబినెట్ భేటీలో జగన్ హింట్..!

గతంలో మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఏప్రిల్, మే నెల దాకా 8 దఫాలుగా.. రెండు నెలల పాటు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంతో చాలా సుదీర్ఘంగా ఎన్నికలు కొనసాగాయి. అందుకే ఈసారి నాలుగు దఫాలుగా తొందరగానే సార్వత్రిక ఎన్నికలు ముగించాలని కేంద్రం భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - December 15, 2023 / 05:12 PM IST

YS JAGAN: ఈసారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముందే జరిగే అవకాశాలున్నాయి. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే ఛాన్సుందని సీఎం జగన్ కేబినెట్ సమావేశంలో ప్రస్తావించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు హింట్ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్, మేలో జరగాల్సి ఉంది. వాటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. కానీ జనరల్ ఎలక్షన్స్ గతం కంటే ముందే నిర్వహించే ఛాన్స్ ఉండటంతో వాటితో పాటే అసెంబ్లీకీ జరిగే అవకాశముంది. ఈమధ్య జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని బీజేపీ దక్కించుకుంది. హిందీ బెల్ట్‌లో ఈ మూడు రాష్ట్రాలు కీలకం కావడంతో.. కేంద్రంలోని NDA సర్కార్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తోంది.

YS JAGAN: వైసీపీకి దూరమవుతున్న రెడ్లు.. బీసీ ఓట్ బ్యాంక్‌పై జగన్ నజర్..

గతంలో మార్చిలో ఎన్నికల షెడ్యూల్ వస్తే.. ఏప్రిల్, మే నెల దాకా 8 దఫాలుగా.. రెండు నెలల పాటు సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. దాంతో చాలా సుదీర్ఘంగా ఎన్నికలు కొనసాగాయి. అందుకే ఈసారి నాలుగు దఫాలుగా తొందరగానే సార్వత్రిక ఎన్నికలు ముగించాలని కేంద్రం భావిస్తోంది. అందుకే ఎన్నికల సంఘం కూడా ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేసి.. మార్చి, ఏప్రిల్ నెలల్లోగా ఎలక్షన్స్ పూర్తి చేయాలని నిర్ణయించింది. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ముందస్తు ఎన్నికలకు సిద్ధమైతే ఆంధ్రప్రదేశ్‌లోనూ ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని కొన్ని రోజుల క్రితమే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తమ నేతల దగ్గర ప్రస్తావించారు. ఇప్పుడు ఏపీ కేబినెట్ మీట్‌లో సీఎం జగన్ కూడా ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే ఛాన్సుందని అలెర్ట్ చేశారు. మంత్రులంతా తమ నియోజకవర్గాల్లో అన్ని పనులనూ ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లోగా కంప్లీట్ చేసుకోవాలని సూచించారు.

SAMSUNG PHONE: మీరు శాంసంగ్ ఫోన్ వాడుతున్నారా..? బిగ్ అలెర్ట్.. కేంద్రం ఏం చెప్పిందంటే..!

ఈ సందర్భంగా జగన్ ఇంకో సూచన కూడా చేశారు. మార్చి, ఏప్రిల్‌లో విద్యుత్ కోతలు ఉంటాయి. దాంతో అంతకుముందే ఫిబ్రవరిలోనే షెడ్యూల్ వచ్చే అకాశం ఉందనీ.. ఆ నెల ఫస్ట్ వీక్‌లోనే అన్ని పనులు పూర్తి చేసుకోవాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే ఆలోచనలో ఉంది. గతంలో ఏప్రిల్, మేలో ఎన్నికలు జరిగాయి. ఆ రెండు నెలలూ ఎండాకాలం కావడంతో ఎండలు మండిపోతాయి. పవర్ కట్స్, ఉక్కపోతలతో జనానికి ఇబ్బందులు తప్పవు. ఆ పరిస్థితుల్లో జనానికి చిర్రెత్తుకొచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓట్లేసే అవకాశం ఉంటుంది. దేశవ్యాప్తంగా ఆ ఎఫెక్ట్ బీజేపీపై ఉంటే ఏపీలో వైసీపీపైనా పడుతుంది. పొరుగున ఉన్న తెలంగాణలో 24 గంటల కరెంట్ అందుబాటులో ఉంటోంది. గత పదేళ్ళుగా అదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 24 గంటలు కరెంట్ ఇస్తామంటోంది. కానీ, ఏపీలో అలా కాదు. ఇప్పటికే కరెంట్ సరఫరాకి ఇబ్బందులు పడుతోంది.

వేసవిలోనూ ఇవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చుచేయాలి. అందుకే ఆ రెండు నెలలు కరెంట్ కోతలు మాత్రం తప్పవు. పవర్ కట్స్‌తో జనంలో ప్రభుత్వంపై వ్యతిరేకత రాకుండా ఉండాలంటే ముందుగా ఎన్నికలు రావడమే బెటర్ అన్న నిర్ణయానికి వచ్చారు జగన్. ఫిబ్రవరిలోనే ఎన్నికల షెడ్యూల్ వస్తుందన్న సంకేతాలు ఉండటం వల్లే జగన్ వైసీపీలో ప్రక్షాళన మొదలుపెట్టారు. నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించి ఎమ్మెల్యే అభ్యర్థులను మారుస్తున్నారు. జనవరిలోగా అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వస్తే.. ప్రచారానికి ఇతర ఎన్నికల కార్యక్రమాలకీ టైమ్ ఉంటుందని జగన్ భావిస్తున్నారు. అందుకే తమ పార్టీ శ్రేణులను ముందుగా అలెర్ట్ చేసి.. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్‌కు సిద్దం చేస్తున్నారు.