YS JAGAN: ఏపీలో వైసీపీ.. సిద్ధం పేరుతో సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇటీవలే సిద్ధం ముగింపు సభ జరిగింది. ఈ నేపథ్యంలో వైసీపీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు జగన్ సిద్ధమవుతున్నారు. త్వరలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర నిర్వహించబోతున్నారు. ఏపీలో ఎన్నికలకు జగన్ ఇప్పటికే శంకం పూరించారు. తాజాగా ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది. దీంతో మరింతగా జనంలోకి వెళ్లాలని జగన్ డిసైడయ్యారు.
VIVEKAM BIOPIC TRAILER: వైఎస్ వివేకా బయోపిక్ ట్రైలర్ రిలీజ్.. ఇది చూస్తే ఆయన నిద్రపోతాడా..?
దీనిలో భాగంగా బస్సు యాత్రకు రెడీ అవుతున్నారు. మేమంతా సిద్ధం పేరుతో జరగనున్న ఈ బస్సు యాత్ర ఈ నెల 27న ఉత్తరాంధ్రలోని ఇచ్ఛాపురం నుంచి ప్రారంభం కానుంది. 20 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఇడుపులపాయలో ముగుస్తుంది. ఇటీవల రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 24 ఎంపీ స్థానాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించింది. ఒక్క అనకాపల్లి స్థానాన్ని మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తి కావడంతో ఇక ప్రచారానికి సిద్ధమయ్యారు సీఎం జగన్. ‘మేమంతా సిద్ధం’ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా బస్సు యాత్ర కొనసాగనుందని వైసీపీ వర్గాలు తెలిపాయి. ఇచ్ఛాపురం నుంచి ఇడుపులపాయ వరకు సుమారు 20 రోజుల పాటు బస్సు యాత్ర కొనసాగనుంది. బస్సు యాత్ర జరిగినన్ని రోజులు.. ప్రతీ రోజూ ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. బస్సు యాత్రలో దాదాపు 25 సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు.
తొలి విడతలో బస్సు యాత్ర, అనంతరం ఎన్నికల ప్రచార సభలు నిర్వహించనున్నట్లు వైసీపీ ప్రకటించింది. జగన్ బస్సు యాత్ర, ప్రచార సభల వివరాలను వైసీపీ రేపు విడుదల చేయనుంది. బస్సు యాత్ర పూర్తి కాగానే.. ఏప్రిల్ రెండో వారంలో నుంచి ఎన్నికల బహిరంగ సభల్లో సీఎం జగన్ పాల్గొంటారు. వైసీపీ ఎన్నికల ప్రచార కార్యాచరణపై పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లతో సోమవారం మధ్యాహ్నం సీఎం జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల ప్రచార పర్యటన రూట్ మ్యాప్, సభల నిర్వహణపై చర్చించనున్నారు.