YS JAGAN: ఏపీలోని వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా నిధులు విడుదలయ్యాయి. గురువారం సీఎం జగన్ (YS Jagan)తన క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. వైఎస్సార్ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద పేద ఆడపిల్ల పెళ్లిళ్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పథకం కింద అర్హులైన 10,511 లబ్ధిదారులకు రూ.81.64 కోట్ల నిధుల్ని వారి ఖాతాల్లో వేశారు. గత జూలై నుంచి సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఈ నిధుల కేటాయింపు జరిగింది.
cheating case, cricketer S Sreesanth : మరో వివాదంలో చిక్కుకున్న భారత మాజీ క్రికెటర్ ఎస్ శ్రీశాంత్..
ఈ పథకం కింద.. ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష, కులాంతర వివాహం చేసుకున్న ఎస్సీలకు రూ.1.20 లక్షలు, బీసీలకు రూ.50 వేలు, కులాంతర వివాహం చేసుకున్న బీసీలకు రూ.75 వేలు, మైనార్టీ, దూదేకుల, నూర్ భాషా కులస్థులకు రూ.1లక్ష, భవన, ఇతర నిర్మాణ కార్మికుల కుటుంబాలకు రూ.40 వేల చొప్పున అందజేస్తారు. పేద వారి పెళ్లిళ్లకు ఆర్థిక భారం పడకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారి కుటుంబాలకు అమ్మఒడి, వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన వంటి పథకాలు కూడా అందుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. సాధారణంగా ప్రతి మూడు నెలలకు ఒకసారి ఈ పథకం కింద సాయం అందిస్తారు. ఒక త్రైమాసికంలో దరఖాస్తు చేసుకున్న వారికి ఆ తర్వాత నిధులు జమ అవుతాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి నాలుగు విడతల్లో 46,062 జంటలకు రూ.349 కోట్లు వధువుల తల్లుల ఖాతాల్లోకి జమ చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నిధుల విడుదల సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. “గత ప్రభుత్వ హయాంలో పేదవాళ్లకు మంచి జరగాలనే చిత్తశుద్ధి లేదు.
ప్రజలకు ఉపయోగపడేలా ఒక్క పథకమూ తీసుకురాలేదు. ఆ దిశగా అడుగులే పడలేదు. కానీ, మా ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయం ద్వారా తల్లిదండ్రులు పిల్లల్ని చదివించేలా ప్రోత్సహిస్తున్నాం. అమ్మఒడి పథకం వల్ల తమ పిల్లలను బడికి పంపేలా తల్లులు మోటివేట్ అవుతున్నారు. వైఎస్ఆర్ కల్యాణ మస్తు నిబంధనల వల్ల ఇంటర్ వరకూ తమ పిల్లలను చదివిస్తారు. ఆ తర్వాత విద్యా దీవెన, వసతి దీవెన వంటి పథకాల వల్ల పిల్లలను గ్రాడ్యుయేట్ వరకూ చదివించేందుకు వెనుకాడరు” అని పేర్కొన్నారు.