NANDAMURI BALAKRISHNA: మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా వైనాట్ 175 టార్గెట్‌తో దూసుకుపోతున్నారు వైసీపీ అధినేత జగన్. దీనికోసం ఎలాంటి కఠిన నిర్ణయానికైనా సిద్ధం అనేలా నిర్ణయాలు తీసుకుంటున్నారు. జనాల్లో వ్యతిరేకత ఉందని తేలితే.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కూడా పక్కనపెడుతున్నారు. మొహమాటం లేకుండా.. టికెట్ లేదని చెప్పేస్తున్నారు.
Roja VS Peddireddy: రోజాకు టికెట్ ఖాయం.. మరి పెద్దిరెడ్డి ఊరుకుంటారా..? వైసీపీలో వార్..!
నియోజకవర్గాల ఇంచార్జిలను మారుస్తున్న జగన్.. ఇప్పటికే రెండు లిస్ట్‌లు అనౌన్స్ చేశారు. రెండు లోక్‌సభ, 25 అసెంబ్లీ స్థానాలకు ఇంచార్జిలను ఖరారు చేస్తూ.. 27మందితో రెండో జాబితా రిలీజ్ చేసింది వైసీపీ. ఈ లిస్ట్‌లో శాంత అనే పేరు ఆసక్తి రేపుతోంది. వైసీపీ తరపున హిందూపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్‌ను పక్కనపెట్టేశారు జగన్. ఆయన స్థానంలో శాంతను బరిలో దింపుతున్నారు. నిజానికి ఈ పేరు ఏపీ రాజకీయాల్లో ఎప్పుడూ పెద్దగా వినిపించలేదు. రెండో జాబితా విడుదల కావడానికి ఓ మూడు గంటలు ముందే శాంత వైసీపీలో చేరారు. ఐతే హిందూపురం పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీని జగన్ ప్రత్యేకంగా టార్గెట్ చేశారు.
హిందూపురం ఎంపీ అభ్యర్థిని మార్చడంతోనే.. ఆ విషయం అర్థం అవుతోంది. హిందూపూర్ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీకి కూడా మహిళా అభ్యర్థినే ఇంచార్జిగా నియమించారు జగన్. హిందూపురం అసెంబ్లీకి దీపిక వైసీపీ ఇంచార్జిగా ఉన్నారు. హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న బాలయ్యకు.. ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపి చెక్ పెట్టాలన్నది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది. నిజానికి హిందూపురం అసెంబ్లీ.. టీడీపీకి, నందమూరి కుటుంబానికి కంచుకోటలాంటింది. ఇలాంటి స్థానంలో గెలిచి.. ఆ విజయానికి పరిపూర్ణత తీసుకురావాలన్న వ్యూహంతో.. జగన్ ఉన్నట్లు కనిపిస్తున్నారు. 1983 నుంచి ఇప్పటివరకు హిందూపురం అసెంబ్లీలో టీడీపీ ఒక్కసారి కూడా ఓడిపోలేదు.
Governor Tamilisai: నామినేటెడ్ ఎమ్మెల్సీల తిరస్కరణ.. గవర్నర్ నిర్ణయంపై హైకోర్టుకు బీఆర్ఎస్..
ఎన్టీఆర్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. బైపోల్‌లో హరికృష్ణ కూడా ఇక్కడి నుంచే అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించారు. బాలకృష్ణ వరుసగా రెండుసార్లు విజయం సాధించారు. హ్యాట్రిక్ ఖాయం అనే ధీమాలో ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇద్దరు మహిళా నేతలను రంగంలోకి దింపిన జగన్.. తన మార్క్ వ్యూహాలను పరిచయం చేస్తున్నారు. దీంతో బాలయ్యతో పాటు టీడీపీ పెద్దలు అలర్ట్ అయ్యారు. ఇద్దరు మహిళా నేతలను బరిలో దింపడం ద్వారా.. ఒకరకంగా బాలకృష్ణకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి దీన్ని టీడీపీ ఎలా ఎదుర్కొంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది.