YS SHARMILA: షర్మిలకు భద్రత పెంపు.. ఇప్పటికైనా పిచ్చి లాజిక్‌లు ఆపేస్తారా ?

ఈ మధ్య తన భద్రత గురించి షర్మిల మాట్లాడిన మాటలపై సోషల్‌ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇవేం మాటలు షర్మిలక్క.. ఇదెక్కడి పిచ్చి లాజిక్‌.. ఏమైనా అర్థం ఉందా అంటూ.. వైసీపీ మద్దతుదారులు కొత్త చర్చ మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - February 8, 2024 / 06:23 PM IST

YS SHARMILA: షర్మిల.. ఏపీ రాజకీయాలను షేక్‌ చేస్తున్నారు. కాంగ్రెస్‌ చీఫ్‌గా కాదు.. సీఎం చెల్లలు కావడంతో ఆమె మాటలు మరింత స్ట్రాంగ్‌గా వినిపిస్తున్నాయ్. వైఎస్‌కు, జగన్‌కు పొంతన లేదని.. జగన్ అవినీతి సీఎం అయిపోయారంటూ అన్నను ఓ ఆట ఆడుకుంటుంది షర్మిల. ఇదంతా ఎలా ఉన్నా ఈ మధ్య తన భద్రత గురించి షర్మిల మాట్లాడిన మాటలపై సోషల్‌ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. ఇవేం మాటలు షర్మిలక్క.. ఇదెక్కడి పిచ్చి లాజిక్‌.. ఏమైనా అర్థం ఉందా అంటూ.. వైసీపీ మద్దతుదారులు కొత్త చర్చ మొదలుపెట్టారు.

KCR: అసెంబ్లీకి కేసీఆర్ వస్తారా.. రారా.. కారణమేంటి..?

భద్రతను తగ్గించారని.. తన విషయంలో జగన్‌ ఏం చేయాలనుకుంటున్నారో అంటూ షర్మిల మాట్లాడిన మాటలు.. రెండ్రోజులుగా వైరల్ అవుతున్నాయ్. తనకు సరైన భద్రత కల్పించలేదంటే.. తన చెడు కోరుకున్నట్లే అనే అర్థం వచ్చేలా షర్మిల రెండు మాటలు వదిలారు. ప్రతిపక్షాల నేతలకు రక్షణ, భ‌ద్రత‌ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని షర్మిల గుర్తుచేశారు. పీసీసీ అధ్యక్షురాలి హోదాలో తాను రాష్ట్రమంతా పర్యటిస్తుంటే ప్రభుత్వం సరైన భ‌ద్రత‌ కల్పించటం లేదని జగన్‌పై రెచ్చిపోయారు. తనకు సరైన భ‌ద్రత‌ కల్పించటం లేదంటే అర్థం.. తన చెడు కోరుకుంటున్నట్లే అని ఆమె నిర్ణయించేసుకుని, అదే విషయాన్ని ప్రకటించేశారనే చర్చ జరుగుతోంది. ఇందులో లాజిక్‌ లేదు అంటూ వైసీపీ సపోర్టర్లు సోషల్‌ మీడియాలో షర్మిలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇక అటు షర్మిల మాటలపై ప్రభుత్వ వర్గాల నుంచి కూడా రియాక్షన్ కనిపించింది.

భద్రత పెంపు కోరుతూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవాలని ఆమెకు సూచించినట్లు తెలుస్తోంది. ఆమె అధికారికంగా కోరడంతో కడప జిల్లా పోలీసులు ఆమెకు భద్రత పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. షర్మిల అభ్యర్థన మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ నుంచి టూ ప్లస్ టూగా భద్రత పెంచారు. మరి ఇప్పటికైనా షర్మిల.. తనకు భద్రత ఇవ్వడం లేదనే కామెంట్లు ఆపుతారా అంటూ చర్చ జరుగుతోంది.