YS SHARMILA: షర్మిల కోసం విజయమ్మ వస్తారా.. అదే జరిగితే జగన్ పరిస్థితేంటి ?

షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా.. అదే జరిగితే జగన్‌ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం కూడా ఉంది.

  • Written By:
  • Publish Date - February 22, 2024 / 06:29 PM IST

YS SHARMILA: పీసీసీ చీఫ్‌గా పగ్గాలు అందుకున్న షర్మిల.. ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. అన్న, ఏపీ సీఎం అయిన జగన్ మీద.. వైఎస్‌ బిడ్డగా షర్మిల చేస్తున్న ఆరోపణలు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో భారీ రీసౌండ్ ఇస్తున్నాయ్. ఇదంతా ఎలా ఉన్నా.. అసలు ఏపీలో ఉలుకు లేదు, ఉనికి లేదు అనుకున్న కాంగ్రెస్‌లో కొత్త జోష్‌ నింపారు. కాంగ్రెస్‌ నేతల అరెస్ట్ అనే మాట.. చాలారోజుల తర్వాత ఏపీలో వినిపించింది అంటే అది షర్మిల వల్లే ! షర్మిల రాకతో కాంగ్రెస్‌ పుంజుకుంటుందా.. బౌన్స్‌బ్యాక్ అవుతుందా అనే సంగతి ఎలా ఉన్నా.. ఇప్పుడు ఆమె రాక మాత్రం కచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయనే చర్చ నడుస్తోంది.

INDIA TRAVEL: రైలు ప్రయాణాలంటే ఇష్టమా.. ఇండియాలో బెస్ట్ ట్రైన్ జర్నీస్ ఇవే..

జగన్ సర్కార్ మీద విమర్శనాస్త్రాలు సంధిస్తున్న షర్మిల.. ప్రజా పోరాటం చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తున్న ఆమె.. అందులో భాగంగా మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ భారీ నిరసనకు వచ్చారు. చలో సెక్రటేరియట్‌కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. అడ్డగించిన పోలీసులు.. షర్మిలను అదుపులోకి తీసుకున్నారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. షర్మిల అరెస్ట్ వ్యవహారంతో.. ఇప్పుడు విజయమ్మ ఆమె తరఫున రంగంలోకి దిగుతారా.. అదే జరిగితే జగన్‌ పరిస్థితి ఏంటి అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఇలాంటి అనుమానాలు రావడానికి కారణం కూడా ఉంది. వైటీపీ పేరుతో తెలంగాణలో పార్టీ పెట్టిన షర్మిల.. నిరుద్యోగుల సమస్య మీద పాదయాత్ర చేసినప్పుడు ఆ తర్వాత జరిగిన పరిణామాలతో.. తెలంగాణలో షర్మిలను అరెస్ట్ చేశారు. ఆ సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు.

పోలీసుల మీద షర్మిల చేయి చేసుకోవడం.. ఆ తర్వాత అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం.. వెంటనే తల్లి విజయమ్మ రంగంలోకి దిగి షర్మిల తరఫున పోరాటం చేయడం జరిగింది. ఇప్పుడు షర్మిల పరిస్థితి, తీరు కూడా దాదాపు అలానే కనిపిస్తోంది. పైగా తనను అరెస్ట్ చేయడంతో వైఎస్ ఆత్మ క్షోభించిందని.. అమ్మ మనసు బాధపడుతుందని సింపథీ ట్రిక్‌ కూడా ప్లే చేశారు షర్మిల. దీంతో షర్మిలకు మద్దతుగా విజయమ్మ రంగంలోకి దిగుతారా అనే డిస్కషన్ నడుస్తోంది. అదే జరిగి షర్మిల తరఫున విజయమ్మ రంగంలోకి దిగితే.. జగన్ మరింత ఇరుకున పడడం ఖాయం. ఐతే అలాంటి పరిస్థితి వచ్చే అవకాశాలు లేవని.. విజయమ్మ మౌనంగానే ఉండే చాన్స్ ఎక్కువగా ఉందనే వారు కూడా చాలామందే !