YS SHARMILA: షర్మిల గోబ్యాక్.. ఆంధ్రాకు వెళ్ళిపో.. వైఎస్సార్టీపీ నేతల తిరుగుబాటు!!

అసలు షర్మిలకు వైఎస్సార్టీపీతో సంబంధమే లేదు. ఆమెకు పార్టీ సభ్యత్వమే లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు బహిష్కరిస్తున్నాం అంటున్నారు ఆ పార్టీకి చెందిన లీడర్లు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల.. ఇక ఆంధ్రాకు వెళ్ళిపోవాలని సలహా ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ గట్టు రామచంద్రరావు అండ్ అదర్స్.

  • Written By:
  • Publish Date - November 7, 2023 / 07:09 PM IST

YS SHARMILA: అంతన్నది.. ఇంతన్నది.. కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యం అన్నది వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (YS SHARMILA). తెలంగాణలో 3 వేల కిలోమీటర్లు నడిచింది. ప్రతి మంగళవారం దీక్షలు చేసింది. పుట్టిల్లు ఏపీ అయినా.. అత్తిల్లు తెలంగాణయే అని చెప్పుకుంది. వైఎస్సార్ బిడ్డగా వచ్చా అంటూ ఊరూరూ తిరిగింది. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు.. కాంగ్రెస్‌ (CONGRESS)తో జతకట్టాలని ప్రయత్నించింది. కానీ, ఆమెను అడుగుపెట్టనీయలేదు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. చివరకు తమ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందంటూ అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు తీసుకుంది. నామినేషన్లు ప్రారంభం అయ్యాక ఉన్నట్టుండి కాంగ్రెస్ అడక్కపోయినా ఆ పార్టీకే సపోర్ట్ అంటూ తెలంగాణలో దుకాణం సర్దేసింది షర్మిల.

TELANGANA CONGRESS: నీలం మధుకు టికెట్ ఇవ్వడంపై.. పటాన్‌చెరు కాంగ్రెస్‌లో మంటలు..
వైఎస్సార్టీపీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఆ పార్టీకి ఎండ్ కార్డ్ పడలేదు. అసలు షర్మిలకు వైఎస్సార్టీపీతో సంబంధమే లేదు. ఆమెకు పార్టీ సభ్యత్వమే లేదు. తెలంగాణ ప్రజలను మోసం చేసినందుకు బహిష్కరిస్తున్నాం అంటున్నారు ఆ పార్టీకి చెందిన లీడర్లు. తెలంగాణ ప్రజలను మోసం చేసిన షర్మిల.. ఇక ఆంధ్రాకు వెళ్ళిపోవాలని సలహా ఇస్తున్నారు ఆ పార్టీ సీనియర్ లీడర్ గట్టు రామచంద్రరావు అండ్ అదర్స్. షర్మిల రాజకీయాలకు పనికిరాదు. వైఎస్సార్ అభిమానులను మోసం చేసిందని ఫైర్ అవుతున్నారు. పార్టీలో ఎవరి అభిప్రాయాలను తీసుకోకుండా సొంత ఎజెండాతో వెళ్ళడమే ఇప్పుడీ అసంతృప్తి కారణం. పైగా ఎమ్మెల్యే ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకొని.. హడావిడి చేసిన షర్మిల వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే పార్టీ మూసేసింది.

ASSEMBLY ELECTIONS: నోరు జారింది! జర చూసి మాట్లాడండి! కేసీఆర్, కేటీఆర్ నోట ఓటమి మాట !!

షర్మిల పాదయాత్ర చేసినప్పుడు ఆయా నియోజకవర్గాల్లో వైఎస్సార్టీపీ టిక్కెట్లు ఆశించిన అభ్యర్థులే జనాన్ని మీటింగ్స్‌కి తీసుకొచ్చారు. స్టేజీ ఖర్చులు కూడా భరించారు. జనానికి వైఎస్సార్ మీద అభిమానంతో పాటు తమ కష్టం చూసి ఓట్లు పడితే, ఎమ్మేల్యే కావొచ్చని ఆశపడ్డారు. కానీ, అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని చాప చుట్టేయడంతో టిక్కెట్లు ఆశించిన అభ్యర్థులంతా ఫైర్ అవుతున్నారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో మీటింగ్ పెట్టి మరీ కొందరు షర్మిలను బూతులు తిట్టారు. తెలంగాణ నుంచి వెళ్ళిపోవాలని డిమాండ్ చేశారు.