YS SHARMILA: పెద్ద ప్లానే.. ఏపీలో కాంగ్రెస్ ప్లాన్ తెలిస్తే షాక్.. షర్మిలతో మాములు గేమ్ కాదుగా..

ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు. షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం.. రాజకీయవర్గాలను షాక్‌కు గురి చేస్తోంది.

  • Written By:
  • Publish Date - January 17, 2024 / 04:33 PM IST

YS SHARMILA: ఏపీలో ఇంకొన్ని నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయ్. ఇలాంటి తరుణంలో ఏపీ పగ్గాలు షర్మిలకు అప్పగిస్తూ కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. ముందు స్టార్ క్యాంపెయినర్ చేస్తారనే ప్రచారం జరిగినా.. చివరికి పీసీసీ చీఫ్‌ కట్టబెట్టింది హస్తం పార్టీ అధిష్టానం. రాష్ట్ర విభజన తర్వాత.. ఏపీలో కాంగ్రెస్‌ దాదాపు క్లీన్‌స్వీప్‌ అయింది. ఐతే విభజన జరిగి పదేళ్లు కావొస్తోంది. ఆ గాయాలను జనాలను మర్చిపోయారా.. లేక.. మర్చిపోయారని కాంగ్రెస్ అనుకుంటుందా అన్న సంగతి ఎలా ఉన్నా.. ఏపీ కోసం ఏఐసీసీ పెద్దలు భారీ స్కెచ్ సిద్ధం చేస్తున్నారు.

BJP CHANDRASEKHAR: చంద్రశేఖర్ మ్యాజిక్‌తో.. బీజేపీ లీడర్లు సెట్ అవుతారా..?

షర్మిలకు కాంగ్రెస్ పగ్గాలు అప్పగించడంతో పాటు.. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెడతామంటూ ప్రకటన చేయడం.. రాజకీయవర్గాలను షాక్‌కు గురి చేస్తోంది. 2014 తర్వాత జరిగిన ప్రతీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు కనీసం డిపాజిట్లు రాలేదు. అలాంటిది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అన్ని చోట్లా అభ్యర్థులను నిలబెడతామన్న ప్రకటన వెనక హస్తం పార్టీ వ్యూహం ఏంటా అనే చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ గెలవడం తర్వాత సంగతి.. బౌన్స్‌బ్యాక్ అయ్యే పరిస్థితులు కూడా లేవు. అసలు అలాంటి అవకాశాలు కూడా లేవు. హస్తం పార్టీ పెద్దలకు కూడా ఆ విషయం తెలుసు. ఐనా సరే ఇంత హడావుడి ఎందుకు అనే ప్రశ్నలు ఇప్పుడు ప్రతీ చోటా వినిపిస్తున్నాయ్. ఐతే కాంగ్రెస్ అసలు టార్గెట్‌.. వచ్చే ఎన్నికలు కాదట. అటుపై వచ్చే ఎన్నికలట. 2029 ఎన్నికలే టార్గెట్‌గా కాంగ్రెస్‌ పావులు కదుపుతోందనే ప్రచారం జరుగుతోంది.

ప్రస్తుతం వైసీపీ, టీడీపీలోని అసంతృప్త నాయకులను తమ పార్టీలో చేర్చుకుని.. క్షేత్రస్థాయిలో బలోపేతం అవ్వాలని కాంగ్రెస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వైసీపీ అభ్యర్థులను ప్రకటిస్తుండగా.. త్వరలో టీడీపీ కూడా అనౌన్స్ చేయబోతోంది. రెండు పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తే.. ఆ పార్టీల్లో టిక్కెట్లు దక్కని వారు ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరి పోటీ చేస్తారని.. అలా అయినా తమ బలం పెరుగుతుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. వైసీపీ, టీడీపీ నుంచి వలసల మీదే కాంగ్రెస్ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికిప్పుడు అద్భుతం జరగుతుందని కాంగ్రెస్ కూడా హోప్స్ పెట్టుకోవడం లేదని.. వాళ్ల టార్గెట్ అంతా 2029 కోసమే అని.. వైఎస్‌ వారసురాలు షర్మిలను పార్టీలోకి తీసుకున్నది కూడా అందుకే అనే చర్చ జరుగుతోంది.