మోడీపై షర్మిల సంచలన కామెంట్స్

భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని మండిపడ్డారు వైఎస్ షర్మిల. బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనన్నారు.

  • Written By:
  • Publish Date - December 18, 2024 / 12:08 PM IST

భారత రాజ్యాంగంపై బీజేపీ దాడి జరుగుతూనే ఉందని మండిపడ్డారు వైఎస్ షర్మిల. బాబాసాహెబ్ డాక్టర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగానికి తూట్లు పొడిచి బీజేపీ రాజ్యాంగం అమల్లోకి తెచ్చేందుకు కుట్రలు జరుగుతున్నాయనన్నారు. ఈ క్రమంలోనే జమిలి ఎన్నికల బిల్లులను బీజేపీ లోక్‌సభలో ప్రవేశపెట్టిందని పూర్తి మెజార్టీ లేకపోయినా రాజ్యాంగ వ్యతిరేకంగా బిల్లులను ప్రవేశపెట్టడం బీజేపీ నిరంకుశ విధానానికి నిదర్శనమని మండిపడ్డారు. ఇది ఫక్తు నియంతృత్వ చర్య అని ఆమె ఆరోపించారు.

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్న ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. రాజ్యాంగ సవరణలకు కావాల్సిన మూడింట రెండొంతుల మెజారిటీ బీజేపీకి లేదని లోక్‌సభలో ఓటింగ్‌తో తేలిందని కేంద్రంలో ప్రభుత్వం పడిపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎందుకు కుప్పకూలాలి..? అని నిలదీశారు. ఇందులో ఏమన్నా అర్థముందా..? సభలో రాజ్యాంగాన్ని ఖూనీ చేసేందుకు మోదీ సర్కారు ప్రయత్నించిందన్నారు.

చివరకు ఓటింగ్‌ వ్యవహారం బీజేపీకే బెడిసికొట్టిందన్నారు. రాజ్యాంగంలోని ఇటువంటి కీలకాంశాలను సవరించే అధికార పరిధి పార్లమెంటుకు లేదని స్పష్టం చేసారు. జమిలి ఎన్నికలు జరపాలంటే కేంద్ర, రాష్ట్రాల చట్టసభలకు నిర్ణీత కాల వ్యవధి కల్పించే ఆర్టికల్ 83, 172లను కూడా సవరించాల్సి ఉంటుందన్నారు. అసెంబ్లీల గడువును లోక్‌సభతో ముడిపెట్టడం ప్రజా తీర్పును అపహాస్యం చేయడమే అన్నారు షర్మిల.