పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల రెడ్డి ఏపీ ప్రభుత్వ లక్ష్యంగా తీవ్ర వ్యాఖ్యలు చేసారు. సిఎం చంద్రబాబు 17 వేల కోట్ల రూపాయలు విద్యుత్ చార్జీలు పెంచారని ఆమె ఆరోపించారు. రాత్రి వేల లాంతర్లు పట్టుకొని నిరసన చేసామన్న ఆమె… ప్రజలు అంధకారంలో లో లాంతరులతో తో బతకాలా ? అని నిలదీశారు. వైసీపీ హయాంలో 35 వేల కోట్ల రూపాయలు పెంచి ప్రజలపై భారం మోపారన్నారు. 17 వేల కోట్ల రూపాయల భారాన్ని మోపడానికి సిద్దమయ్యారని మండిపడ్డారు.
వైసీపీ టీడీపీ చేసింది ఒక్కటే కధ అని ప్రశ్నించారు. దొందు దొందే కదా అని నిలదీశారు. తప్పు జగన్ చేస్తే శిక్ష ప్రజలకా అని నిలదీశారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఎక్కువ చెల్లిస్తున్నారన్నారు. అన్నీ రాష్ట్రాల్లో యూనిట్ కి 4 రూపాయల 80 పైసలని మన రాష్ట్రంలో మాత్రం ఆరు రూపాయలు అంటూ మండిపడ్డారు. ఇది భావ్యం కాదు చంద్రబాబు అంటూ హెచ్చరించారు. ప్రజల ఓట్లతో మీరు గెలిచి ప్రజలకు ఏమి మిగులుస్తున్నారు..?? అని నిలదీశారు. ఇక్కడ మీరు అక్కడ బిజెపి పార్టీ అధికారం అనుభవిస్తున్నారన్న ఆమె 17వేల కోట్ల రూపాయలు చిన్న విషయం కాదని మండిపడ్డారు.