సుబ్బారెడ్డి గారు నా గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ? అంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేసారు. ఆయన ఎవరు ? అని నిలదీశారు. సుబ్బారెడ్డి జగన్ మోచేతి నీళ్ళు తాగేవాడు అని మండిపడ్డారు. జగన్ పదవులు ఇస్తే అనుభవిస్తున్నారన్న ఆమె ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారు ? అంటూ అసహనం వ్యక్తం చేసారు. రేపు సాయి రెడ్డి గారు కూడా మాట్లాడుతారు… సాయి రెడ్డి గారు కూడా ఆయన చేతిలోనే ఉన్నాడు అంటూ ఫైర్ అయ్యారు షర్మిల. జగన్ మోహన్ రెడ్డి పక్షాన ఉన్నారు అని తెలిసి కూడా నిన్న రాసిన లేఖలో రాశానన్నారు.
వాళ్ళ దగ్గర ఇంకా నిజాయితీ ఏమైనా ఉందా చూద్దాం అనుకున్నాను అంటూ షర్మిల నేడు మీడియాతో మాట్లాడుతూ ఘాటు వ్యాఖ్యలు చేసారు. వీళ్ళందరికీ వైఎస్ఆర్ తెలుసు. ఆయన మనోభావాలు కూడా తెలుసు అన్నారు. అమ్మకు అర్థం కావాలి అన్నారు. నా వరకు నేను చెప్తున్నది నిజమని నేను ప్రమాణం చేయగలను, సుబ్బారెడ్డి కూడా ప్రమాణం చేయాలి అని డిమాండ్ చేసారు. వైఎస్ఆర్ బిడ్డ తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తుందని వైఎస్ఆర్ ఉన్నప్పుడు భారతి,సాక్షి సిమెంట్స్ లో నలుగురు చిన్న బిడ్డలకు సమాన వాట ఉండాలన్నారు అని తెలిపారు.
ఇది ప్రమాణంగా చెప్తున్న అన్నారు షర్మిల. ఇచ్చిన మాట ఏమయ్యింది అని జగన్ అన్న ను అడిగాను అన్న ఆమె… జగన్ నాన్నకు మాట ఇచ్చారని ఈ లోకంలో నీ తరువాత పాప మేలుకోరేది నేనే అని జగన్ చెప్పాడని డోంట్ వర్రీ డాడ్ అన్నాడు అంటూ ఆమె గుర్తు చేసుకున్నారు. ఇది నిజం అని నా బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్తా, వైవీ సుబ్బారెడ్డి తన బిడ్డల మీద ప్రమాణం చేసి చెప్పాలి అంటూ డిమాండ్ చేసారు. లేదా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణం చేసి చెప్పాలి అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేసారు. సుబ్బారెడ్డి అంటున్నాడు…సాక్షి కి, భారతి సిమెంట్స్ కి వాళ్ల పేర్లు పెట్టుకున్నారట… అందుకే ఆ ఆస్తులు వాళ్లవే నట అంటూ ఆమె ఫైర్ అయ్యారు.
అందులో నాకు హక్కు లేదట… జగన్ సొంతగా సంపాదించాడట, ఆరోజు వాళ్ళ పేర్లు పెట్టుకుంటే నేను అభ్యంతరం చెప్పలేదు, పేర్లతో ఏముంది అనుకున్నాను, అన్న ముచ్చట పడ్డాడు అనుకున్నాను, వాళ్ళ పేర్లతో ఆస్తులు ఉంటే…నిజంగా వాళ్లవి అవుతాయా ? అని మండిపడ్డారు. నా పేరు మీద ఆస్తులు రాసి ఉంటే నేను ఎందుకు జైలుకి వెళ్ళలేదు అంటున్నారు, ఏ అన్న అయినా…చెల్లెలు గిఫ్ట్ అంటే…ఏ బంగారమో… చీరనో… గిఫ్ట్ ఇస్తారు అంతేకాని ఆస్తుల్లో 40 శాతం వాట ఇస్తారా ? అని నిలదీశారు. ఇవ్వాలని అనుకున్నది గిఫ్ట్ కాదు… నా హక్కు అంటూ స్పష్టం చేసారు. నా హక్కు కాబట్టే నాకు ఇస్తామని అన్నారు అని తెలిపారు.
ఇవ్వాల్సిన భాధ్యత వాళ్లకు ఉంది కాబట్టి MOU రాశారు అని MOU రాయమని నేను అడగలేదు అన్నారు. సరస్వతి సిమెంట్స్ ED అటాచ్ లో లేదు అని తెలిపారు. అందుకే సరస్వతి సిమెంట్స్ వెంటనే ట్రాన్స్ ఫర్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన హామీ ఎందుకు నిలబెట్టుకోలేదు అని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి అంటున్నాడు…ప్రతి ఇంట్లో ఉండే కహాని అంట… ఇంత సునాయాసంగా ఎలా మాట్లాడుతున్నారు అని ఆమె ప్రశ్నించారు. మీకు సెంటిమెంట్ లేదా ? ఎమోషన్ లేదా ? ఈ మాటలు ఎవరో అంటే పట్టించుకొనే దాన్ని కాదు అన్నారు. నా సొంత చిన్నాన్నా అంటే నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి అని ఆవేదన వ్యక్తం చేసారు. చిన్నాన్న…నా బిడ్డలు నీ ముందు పెరగలేదా ? అని ప్రశ్నించారు. నా బిడ్డలను మీరు తాకలేదా ? దేవుడు అంతా చూస్తున్నాడు, అంతా గమనిస్తున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.