YS JAGAN-YS SHARMILA: ఏపీ సీఎం జగన్ ఆయన చెల్లెలు షర్మిల మధ్య ఉన్న విభేదాల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత ఎన్నికల్లో జగన్‌ను గెలిపించాలంటూ పాదయాత్ర చేసిన షర్మిల తరువాత మాత్రం అన్నకు అపోజిట్‌గా మారిపోయింది. వీళ్లద్దరి మధ్య గ్యాప్ రావడానికి రాజకీయ కారణాలతో పాటు ఆస్తి తగాదాలు కూడా ఉన్నాయనేది చాలా మంది చెప్పిన మాట. షర్మిలకు చిల్లిగవ్వ ఆస్తి ఇవ్వకుండా జగనే మొత్తం నొక్కేశారు అనేది చాలా మంది చేసిన ఆరోపణ.
ఈ క్రమంతో అసలు జగన్ షర్మిల ఆస్తులు ఎన్ని అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. గత ఎన్నికల్లో జగన్ ఎలక్షన్ కమిషన్‌కు ఇచ్చిన ఆస్తుల అఫిడివిట్తో ఆయన ఆస్తులు ఎన్ని అనే విషయం చాలా మందికి తెలుసు. కానీ షర్మిల ఆస్తుల వివరాలు ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ ఇప్పుడు కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల ఎలక్షన్ నామినేషన్ ప్రక్రియలో భాగంగా తన ఆస్తుల అఫిడవిట్‌ను ఈసీకి సబ్మిట్ చేశారు. దీంతో ఆమె ఆస్తుల వివరాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. షర్మిల సబ్మిట్ చేసిన అఫిడవిట్ ప్రకారం ఆమె మొత్తం ఆస్తి 123 కోట్ల 26 లక్షల 65 వేల 163 రూపాయలు. ఇక షర్మిల భర్త అనిల్ పేరుతో ఉన్న మొత్తం ఆస్తి 45 కోట్ల 19 లక్షల 72 వేల 529 రూపాయలు. ఇవే కాకుండా తన దగ్గర 3 కోట్ల 69 లక్షల 36 వేలు విలువ చేసే గోల్డ్ ఉన్నట్టు చెప్పారు షర్మిల. 4 కోట్ల 61 లక్షల 90 వేల 688 రూపాయల విలువ చేసే జెమ్స్టోట్ జ్యువెల్లరీ కూడా ఉన్నట్టు చెప్పారు. ఇక అనిల్ దగ్గర 81 లక్షల 60 వేలు విలువ చేసే గోల్డ్, 42 లక్షల 60 వేల 461 రూపాయలు విలువ చేసే జెమ్‌స్టోన్ జ్యువెల్లరీ ఉన్నాయట. షర్మిల పేరు మీద 1 కోటీ 53 లక్షల 69 వేల 900 విలువ చేసే 39.41 ఎకరాల వ్యవసాయ భూమి ఉందట.
దాంతో పాటు 5 కోట్ల 55 లక్షల 43 వేల 860 విలువ చేసే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కూడా ఉందని చెప్పారు షర్మిల. కడపలో 16 వేల 938 స్వ్కేర్ ఫీట్స్‌లో 2 కోట్ల 20 లక్షల 44 వేల 4150 విలువ చేసే ఇల్లు కూడా షర్మిలకు ఉందట. అనిల్ పేరు మీద 5 వేల 235 స్క్వేర్ఫీట్లతో ఉన్న 4 కోట్ల 05 లక్షల 92 వేల 365 విలువ చేసే ఇల్లు హైదరాబాద్‌లో ఉందట. ఇక్కడ అన్నిటికంటే ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే షర్మిల అప్పులు. తన అన్న జగన్‌కు షర్మిల 82 కోట్ల 77 లక్షల 71 వేల 682 రూపాయల అప్పు ఉందట. వదిన భారతికి కూడా 19 లక్షల 56 వేల 682 రూపాయల అప్పు ఉందట. దీంతో పాటే తన మీద ఉన్న కేసల వివరాలు కూడా చెప్పారు షర్మిల. ఇప్పటి వరకూ తనపై నాలుగు పెండింగ్ కేసులు ఉన్నట్టు అఫిడవిట్లో మెన్షన్ చేశారు. ఇక ప్రస్తుతం తన దగ్గర 22 లక్షల 09 వేల 618 రూపాయల నగదు, భర్త అనిల్ దగ్గర 62 వేల 484 రూపాయల నగదు ఉన్నట్టు చెప్పారు. ఆస్తి కోసమే అన్నాచెల్లెల్లు దూరమయ్యారు అనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో షర్మిల తన ఆస్తుల వివరాలు బయపెట్టడం.. జగన్‌కు ఆమె దాదాపు 100 కోట్ల వరకూ అప్పు ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.