Dastagiri: జగన్‌పై పులివెందులలో దస్తగిరి పోటీ.. ఆ పార్టీ నుంచే టికెట్‌..

వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన మారిన దస్తగిరి పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పి జగన్ ఎన్నికలకు వెళ్లాలని పదేపదే అంటున్న దస్తగిరి.. ఇప్పుడు ఏకంగా జగన్ మీద పోటీకి సిద్ధం కావడం కొత్త చర్చకు కారణం అవుతోంది.

  • Written By:
  • Updated On - March 1, 2024 / 05:54 PM IST

Dastagiri: మాజీ మంత్రి, జగన్‌ బాబాయ్‌.. వైఎస్ వివేకా హత్య కేసులో కీలక నిందితుడిగా ఉన్న దస్తగిరి.. బెయిల్ మీద బయటకు వచ్చి సరికొత్త సంచలనాలకు తెరతీస్తున్నాడు. కీలక వ్యక్తుల మీద వరుస కామెంట్లు చేస్తూ.. మరింత రచ్చ క్రియేట్ చేస్తున్నాడు. ఐతే త్వరలో ఏపీలో జరగబోయే ఎన్నికల్లో పులివెందుల నుంచి జగన్‌పై పోటీ చేసేందుకు దస్తగిరి రెడీ అవుతున్నాడు. వివేకా కేసులో అప్రూవర్‌గా మారిన మారిన దస్తగిరి.. జై భీమ్ పార్టీలో జాయిన్ అయ్యాడు.

Viveka Murder Case: అవినాష్ రెడ్డికి శిక్ష పడాలి.. జగన్ పాత్రపైనా విచారణ చేయాలి: వివేక కుమార్తె సునీత

వచ్చే ఎన్నికలలో పులివెందుల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. వివేకాను హత్య చేసింది ఎవరో చెప్పి జగన్ ఎన్నికలకు వెళ్లాలని పదేపదే అంటున్న దస్తగిరి.. ఇప్పుడు ఏకంగా జగన్ మీద పోటీకి సిద్ధం కావడం కొత్త చర్చకు కారణం అవుతోంది. దస్తగిరి వ్యవహారం కడప జిల్లాలో రేపుతున్న అలజడి అంతా ఇంతా కాదు. వైసీపీ నుంచి తనకు ప్రాణహాని ఉందన్న దస్తగిరి.. తెలంగాణ పోలీసులతో భద్రత కావాలని కోర్టును ఆశ్రయించేందుకు సిద్దం అవుతున్నాడు. ఓ అమ్మాయిని కులం పేరుతో దూషించి, కిడ్నాప్ చేయబోయాడనే కంప్లైంట్‌తో.. యర్రగుంట్ల పోలీసులు దస్తగిరి మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో కడప జైళ్లో వందరోజులు రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి.. ఈ మధ్యే బెయిల్ మీద విడుదల అయ్యాడు.

దస్తగిరి నేటివ్ ప్లేస్ కూడా క‌డ‌ప జిల్లా పులివెందులే. కారు డ్రైవ‌ర్‌గా త‌న ప్రస్తానం ప్రారంభించి.. వైఎస్ వివేకా కుటుంబంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. వివేకా లేన‌ప్పుడు.. ఆయ‌న ఇంటి వ్యవ‌హారాలు కూడా ఈయ‌నే చూసుకునేవాడ‌ని గ‌తంలోనే చెప్పాడు. త‌న‌ను రాజ‌కీయంగా ఇబ్బందులు పెడుతున్నార‌ని.. దీంతో తాను కూడా రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. త‌న‌ను ఇబ్బంది పెట్టిన వారికి త‌గిన బుద్ది చెబుతాన‌ని.. పోటీ చేసేది కూడా అందుకే అంటున్నాడు దస్తగిరి.