YSRCP CANDIDATES: మార్పు తప్పదా..? వైసీపీ అభ్యర్థులు మారేది ఎవరంటే..?

టీడీపీ, జనసేన నుంచి కొందరు వైసీపీలోకి చేరుతున్నారు. దీనికితోడు ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరు అనుకున్న స్థాయిలో బలంగా లేకపోవడంతో వాళ్ళని మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది.

  • Written By:
  • Publish Date - April 11, 2024 / 03:47 PM IST

YSRCP CANDIDATES: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న వైసీపీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. వాళ్ళు ప్రచారాలు కూడా చేస్తున్నారు. కానీ కొన్ని అసెంబ్లీ, పార్లమెంటు సీట్లల్లో అభ్యర్థులను మార్చాలని వైసీపీ హైకమాండ్ డిసైడ్ అయింది. అనుకున్న స్థాయిలో కొందరు ప్రచారం చేయకపోవడం, కొత్త వాళ్ళ చేరిక లాంటి అనేక అంశాలను పరిశీలిస్తోంది. ఈనెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతోంది. అప్పటి నుంచి ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలవుతుంది.

Undi TDP: ఉండిలో రాజుల మధ్య రసవత్తర పోరు.. రఘురామ త్యాగం చేయాల్సిందేనా !

టీడీపీ, జనసేన నుంచి కొందరు వైసీపీలోకి చేరుతున్నారు. దీనికితోడు ఆయా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాలకు ప్రకటించిన అభ్యర్థుల్లో కొందరు అనుకున్న స్థాయిలో బలంగా లేకపోవడంతో వాళ్ళని మార్చాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. మైలవరం వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్‌ని నిలబెట్టే అవకాశముంది. అలాగే జనసేన నుంచి వైసీపీలో చేరిన పోతిన మహేష్‌కు విజయవాడ వెస్ట్ టిక్కెట్ ఇస్తారని తెలుస్తోంది. అక్కడ ఆయనకు కొంత కేడర్ ఉండటంతో.. బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి గట్టి పోటీ ఇస్తారని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది. ఇక గుంటూరు ఎంపీగా విడుదల రజనీకి ఛాన్స్ ఉంది. ఇంకా గుంటూరు-2 ఎమ్మెల్యే అభ్యర్థిగా కిలారు రోశయ్యను మారుస్తారని అంటున్నారు. భీమిలీ అసెంబ్లీ స్థానం నుంచి తనను తప్పించాలని అవంతి శ్రీనివాస్ కోరుతున్నారు. ఆయన అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోరుతున్నారు. అది కుదరకపోతే.. భీమిలీ సీటు తన కూతురుకి ఇవ్వాలని అవంతి కోరుతున్నారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని మారుస్తారని టాక్ నడుస్తోంది. ఆయనకు బదులు అభిషేక్ రెడ్డిని నిలబెట్టే ఛాన్సుంది. అవినాష్‌కి పోటీగా బరిలోకి దిగిన షర్మిల.. వివేకానంద రెడ్డి హత్య కేసును హైలెట్ చేస్తున్నారు.

హంతకులకు ఎలా టిక్కెట్ ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ఇక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మొదటికే మోసం వస్తుందని భావించిన జగన్.. కడప ఎంపీ సీటును అభిషేక్ రెడ్డికి ఇస్తే బెటర్ అనుకుంటున్నారు. ఈయన వైఎస్ ప్రకాశ్ రెడ్డికి మనుమడు. డాక్టర్‌గా అభిషేక్ రెడ్డికి కడపలో మంచి పేరుంది. 2019లో పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ తరపున విస్తృతంగా ప్రచారం కూడా చేశారు. తన తండ్రి వైఎస్ ప్రకాశ్ రెడ్డికి ఉన్న గౌరవం అభిషేక్ రెడ్డికి కలిసొస్తుందని అనుకుంటున్నారు. అభ్యర్థుల మార్పులపై ఇంకా వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సంకేతాలు రాలేదు. కానీ మేనిఫెస్టో రిలీజ్ రోజు అభ్యర్థుల మార్పును జగన్ స్వయంగా ప్రకటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.