YSRCP: ఇప్పటికైనా మేలుకో జగన్.. అది పట్టించుకోకుంటే 2024లో ఫినిషేనా?

గెలుపు ఇచ్చే కిక్‌ కంటే.. ఓటమి చేసే మేలే ఎక్కువ ఉంటుంది. అధికారం, అంగబలం ఉండి.. కళ్లకు పొర కమ్ముకుపోయిన వారికి అయితే.. ఓటమి చేసే హెల్ప్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఓటమి రాజకీయాల్లో తీసుకువచ్చే మార్పు అంతా ఇంతా కాదు. అధికార మత్తు పోగొట్టాలన్నా.. కళ్లు తెరిపించాలన్నా.. ఓటమి తప్ప మరో మార్గం ఉండదు. ఆ ఓటమి నుంచి ఏం నేర్చుకున్నాం.. పద్దతులు ఎలా మార్చుకున్నాం అన్న దాని మీదే.. తర్వాత అడుగులు ఆధారపడి ఉంటాయ్.

  • Written By:
  • Publish Date - April 3, 2023 / 04:30 PM IST

వైసీపీ ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన విషయాలు ఇవే ! మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీలు, ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ.. తిరుగుబాటు బావుటా ఎగురవేసిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. అసంతృప్తితో రగిలిపోతున్న మరికొందరు ఎమ్మెల్యేలు.. గాయ్‌ గత్తర్ తయారైంది వైసీపీ పరిస్థితి ! తెలియడం లేదు కానీ.. ఏ సమయంలోనైనా అగ్నిపర్వతం పేలొచ్చు పార్టీలో ! ఇప్పటికైనా జగన్, వైసీపీ శ్రేణులు అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా.. మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అనుకుంటే.. అంతకుమించిన అమాయకత్వం ఉండదు మరి ! పార్టీ శ్రేణుల్లో, వైసీపీ నేతల్లో.. చాలామంది అసంతృప్తితో ఉన్నారు. రాష్ట్ర స్థాయి నేతలకే క్షణం పొసగని పరిస్థితి ఉంది.

దాదాపు అన్ని జిల్లాల్లోనూ వైసీపీలో అంతర్గత పోరు పీక్స్‌కు చేరింది. దీనికితోడు జనాల్లోనూ వ్యతిరేకత మొదలైంది. గడపగడపకు కార్యక్రమంలోనూ నిలదీతలు చెప్పింది కూడా అదే ! ఇప్పటికైనా జగన్ మేల్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ అధికార మత్తులోనే ఉంటే.. జరగాల్సిన దారుణాలు జరిగిపోవడం ఖాయం. ఇవన్నీ లెక్కే కాదు.. మా లెక్కలు మాకున్నాయ్.. సంక్షేమమే గెలిపిస్తుందనే మాయలో ఉండడం కరెక్ట్ కాదు. సంక్షేమం గెలిపిస్తుందేమో.. సంక్షేమం మాత్రమే గెలిపించదు. జగన్ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఇదే ! పార్టీలో లుకలుకలకు అడ్డుకట్ట వేయాలి.. అసంతృప్తులను బుజ్జగించాలి. దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టాలి. లేదంటే.. 2024లో మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంటుంది.

ఓ వైపు చంద్రబాబు దూసుకుపోతున్నారు. బాదుడే బాదుడు, ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ.. జనాలను కలుసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీలో అసంతృప్తులకు గాలం వేస్తున్నారు. ఒకరకంగా విపక్షంలో ఉండి ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. ఇలాంటి సమయంలో పార్టీని, యంత్రాంగాన్ని రిపేర్ చేయకపోతే.. వచ్చే ఎన్నికల్లే వైసీపీకి ఓటమి తప్పదు. తాడేపల్లిలో ఉండి.. మీటింగ్‌లు పెట్టి.. అంతా సర్దుకుందని భుజాలు ఎగరేయడం కాదు.. ఇప్పటికైనా జనాల్లోకి వెళ్లాలి. క్షేత్రస్థాయిలో పార్టీ మీద దృష్టి పెట్టి అంతా సెట్‌రైట్ చేయాలి..లేదంటే వైసీపీ చెల్లించక తప్పదు భారీ మూల్యం.