YSRCP: రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకి దెబ్బ పడుతుందా..?

వైసీపీ రెబల్స్‌తో పాటు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల మాటేంటి..? వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారా.. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే అటు వేస్తారా.. ఇప్పుడు ఏపీలో ఇదే పెద్ద సస్పెన్స్‌గా మారింది.

  • Written By:
  • Publish Date - January 31, 2024 / 12:50 PM IST

YSRCP: ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజ్యసభ సీట్ల భర్తీకి ఎన్నికలు జరగబోతున్నాయి. అసెంబ్లీ ఎలక్షన్స్‌‌కు ముందు.. ఫిబ్రవరి 27న ఎన్నిక జరగనుంది. రాజ్యసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలే ఓటర్లు. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాబలాల ప్రకారం చూస్తే.. మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడిపోతాయి. కానీ వైసీపీ రెబల్స్‌తో పాటు నియోజకవర్గాల్లో మార్పులు, చేర్పులతో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేల మాటేంటి..? వాళ్ళు వైసీపీకి ఓట్లేస్తారా.. టీడీపీ అభ్యర్థిని నిలబెడితే అటు వేస్తారా.. ఇప్పుడు ఏపీలో ఇదే పెద్ద సస్పెన్స్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్‌లో 3 స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు వైసీపీలో టెన్షన్ పుట్టిస్తున్నాయి.లెక్క ప్రకారం మూడూ అధికార వైసీపీకి దక్కుతాయి.

KUMARI AUNTY: కుమారి ఆంటీ హోటల్‌ మూయించింది వాళ్లేనా?

కానీ ఇటీవల జరిగిన పరిణామాలతో ఎవరు ఎటు ఓట్లు వేస్తారో తెలియని పరిస్థితి ఉంది. వైసీపీ జంపింగ్‌ల సంగతి కాసేపు అలా ఉంచి.. సభా రికార్డుల ప్రకారం టెక్నికల్‌గా చూస్తే.. అసెంబ్లీలో వైసీపీకి 151 మంది, టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలుండగా, జనసేన తరపున ఒక ఎమ్మెల్యే గెలిచారు. తాజాగా స్పీకర్‌కు పార్టీలు ఇచ్చిన అనర్హత పిటిషన్లతో నలుగురు వైసీపీ, నలుగురు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలపై వేటు పడే అవకాశం ఉంది. మరో టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ఆ పార్టీ సంఖ్యా బలం 18కి పడిపోతుంది. ఈ లెక్కలు పరిగణనలోకి తీసుకుంటే తెలుగుదేశం పార్టీకి అభ్యర్థిని నిలబెట్టేంత బలం కూడా లేదు. ఒక్క రాజ్యసభ అభ్యర్ధి గెలుపునకు 44 మంది ఎమ్మెల్యేల బలం కావాలి. అంటే టీడీపీకి ఇప్పుడున్న 18 మందికి తోడు ఇంకో 26 మంది శాసనసభ్యుల మద్దతు కావాలి. మామూలుగా అయితే వైసీపీ ఈ మూడు రాజ్యసభ సీట్లలో గెలుపు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ.. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక కసరత్తులో భాగంగా గెలుపు గుర్రాలను వెతుకుతున్న వైసీపీ.. ఇప్పటికి 30 మంది వరకు సిట్టింగ్‌లను పక్కకు తప్పించింది. వీరిలో కొందరు బాహాటంగా పార్టీ తీరును తప్పుబట్టారు.

CONGRESS: వెళ్ళిన వాళ్ళు మళ్ళీ వచ్చేయండి.. పార్టీని వీడిన వాళ్లకు కాంగ్రెస్ ఆహ్వానం

ఆళ్ళ రామకృష్ణా రెడ్డి తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. దీనిపై స్పీకర్ నిర్ణయం పెండింగ్‌లో ఉంది. ఇప్పటికే టీడీపీకి టచ్‌లోకి వెళ్లారు పార్థసారధి. మరో ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ఇలా బయటకు వెళ్లిన నేతల గురించి వైసీపీ ఒక అంచనా వేసుకోవటానికి అవకాశం ఉంటుంది. కానీ టికెట్ రాని సిట్టింగ్‌లు కొందరు గుంభనంగా ఉన్నారు. వారే పార్టీ అధిష్టానాన్ని టెన్షన్ పెడుతున్నారట. టికెట్లు దక్కని 30 మందిలో ఎంత మంది పార్టీ విషయంలో చిత్తశుద్ధితో ఉంటారు.. ప్రలోభాలకు లొంగి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉన్నవాళ్ళు ఎవరంటూ.. లెక్కలు వేసుకునే పనిలో ఉందట పార్టీ అధిష్టానం. ఆర్ధికంగా బలహీనంగా ఉన్న ఎమ్మెల్యేలను మొదటి టార్గెట్ చేసుకుని టీడీపీ పావులు కదుపుతున్నట్టు వైసీపీ అనుమానిస్తోంది. అందుకే తీవ్ర అసంతృప్తిలో ఉండి, ప్రలోభాలకు లొంగే వారిపై కన్నేసి ఉంచాలని అనుకుంటున్నట్టు తెలిసింది.

ఏ ఎమ్మెల్యే ఎవరితో మాట్లాడుతున్నారు? పైకి గుంభనంగా ఉంటూనే తెర వెనుక దెబ్బ తీయాలని ప్రయత్నిస్తున్నది ఎవరు అంటూ నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఒక వైపు ఇలా జాగ్రత్తలు తీసుకుంటూనే మరోవైపు అసంతృప్తులు ప్యాకేజీ ప్రలోభాలకు లొంగకుండా.. భవిష్యత్తులో ఆదుకుంటామని, ప్రభుత్వం రాగానే తగిన ప్రాధాన్యం ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం జరుగుతోంది. మొత్తంగా ఎమ్మెల్సీ ఎన్నికల టైంలో దెబ్బతిన్న వైసీపీ అగ్ర నాయకత్వం.. రాజ్యసభ విషయంలో అలాంటి పొరపాటు జరక్కుండా జాగ్రత్తలు తీసుకుంటోందట. ఎంత జాగ్రత్త పడ్డా.. చివరికి పరిణామాలు ఎలా ఉంటాయోనన్న టెన్షన్‌ మాత్రం పార్టీ అధినాయకత్వానికి ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.