YSRCP: ఏపీలో 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులు మార్పు..

11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులను మారుస్తూ కీలక నిర్ణ‍యం తీసుకుంది. ఈ విషయాన్ని వైసీపీనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఈ వివరాల్ని మీడియాకు తెలిపారు.

  • Written By:
  • Publish Date - December 11, 2023 / 08:28 PM IST

YSRCP: వైనాట్ వై నాట్ 175 లక్ష్యంగా వైసీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. 11 నియోజకవర్గాల్లో వైసీపీ ఇంఛార్జులను మారుస్తూ కీలక నిర్ణ‍యం తీసుకుంది. ఈ విషయాన్ని వైసీపీనేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. సోమవారం సాయంత్రం ఈ వివరాల్ని మీడియాకు తెలిపారు.

YS JAGAN: వైసీపీకి 50మంది ఎమ్మెల్యేలు షాక్ ! ఇప్పుడు ఆళ్ల.. నెక్ట్స్ ఎవరు ?

దీని ప్రకారం.. మంగళగిరికి గంజి చిరంజీవి, పత్తిపాడుకు బాలసాని కిషోర్ కుమార్, కొండేపికి ఆదిమూలపు సురేష్, వేమూరుకు వరికూటి అశోక్ బాబు, అద్దంకి నియోజకవర్గానికి పాణెం హనిమి రెడ్డి, గాజువాకకు వరికూటి రామచంద్రరావు, తాడికొండకు మేకతోటి సుచరిత, సంతనూతలపాడుకు మేరుగు నాగార్జున, చిలకలూరి పేటకు మల్లెల రాజేష్ నాయుడు, గుంటూరు వెస్ట్‌కు విడదల రజినీ, రేపల్లెకు ఈవూరు గణేష్‌ను ఇంఛార్జిలుగా నియమించారు. ఈ సందర్భంగా సజ్జల మీడియాతో మాట్లాడారు. గెలుపు అవకాశాల్ని బట్టి ఇంఛార్జిలను మార్చినట్లు చెప్పారు.

తొలి దశగా 11 మందిని మార్చినట్లు చెప్పారు. 2024 ఎన్నికలకు సమాయత్తం అవుతున్నట్లు, అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సజ్జల చెప్పారు. భవిష్యత్తులో మరికొందరు ఇంఛార్జులను కూడా మార్చబోతున్నారు. తెలంగాణ ఫలితాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సిట్టింగులకు టిక్కెట్లు ఇవ్వడం వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. అందువల్ల వ్యతిరేకత ఉన్న సిట్టింగుల్ని మార్చాలని వైసీపీ నిర్ణయించింది. దీని ప్రకారం కొత్త ఇంఛార్జుల్ని నియమించింది. ఈ ఇంఛార్జులే రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు.