AP CAPITAL: వైసీపీ నేతల కొత్త కామెడీ.. ఏపీకి మూడు కాదు.. నాలుగు రాజధానులు కావాలట..

పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు కాల పరిమితిని మరికొన్నేళ్లు పెంచాలని డిమాండ్ మొదలు పెట్టారు వైసిపి నేతలు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన బిల్లులో పెట్టారు. ఇప్పుడు పదేళ్లు పూర్తి కావస్తోంది.

  • Written By:
  • Publish Date - February 13, 2024 / 06:06 PM IST

AP CAPITAL: ఇప్పటికే రాజధాని ఏదో తెలియక జుట్టు పీక్కుంటున్న ఏపీ జనానికి వైసిపి నేతలు కొత్త ట్విస్ట్ ఇచ్చారు. జనం మర్చిపోయిన గొడవలన్నీ మళ్లీ మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారు. పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదు కాల పరిమితిని మరికొన్నేళ్లు పెంచాలని డిమాండ్ మొదలు పెట్టారు వైసిపి నేతలు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాదు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుందని విభజన బిల్లులో పెట్టారు. ఇప్పుడు పదేళ్లు పూర్తి కావస్తోంది.

YS SHARMILA: అన్నా.. దమ్ముంటే వీటికి ఆన్సర్‌ చెప్పు.. జగన్‌కు షర్మిల 9 ప్రశ్నలు..

అయితే హైదరాబాద్‌ను రాజధానిగా ఎప్పుడో వదిలేసారు. చంద్రబాబు నాయుడు హయాంలోనే రాజధాని హైదరాబాదు నుంచి అమరావతికి షిఫ్ట్ అయిపోయింది. హైదరాబాద్ నుంచి బదిలీ అయిన ఉద్యోగులకు ఐదు రోజులు పని దినాలు, రకరకాల అలవెన్స్ వంటివి ఇచ్చారు కూడా. దాదాపుగా 95 శాతం కార్యకలాపాలన్నీ అమరావతికి పూర్తిగా బదిలీ అయిపోయాయి. హైదరాబాద్ అనే ఉమ్మడి రాజధాని ఒకటి ఉందని జనం కూడా దాదాపుగా మర్చిపోయారు. జగన్ అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు ఫార్ములా తీసుకొచ్చాడు. వైజాగ్‌ను పాలన రాజధానిగా ప్రకటించారు. కర్నూలు న్యాయ రాజధాని అన్నారు. అమరావతిని చట్టసభల రాజధానిగా చెప్పుకొచ్చారు. ఇదిగో రేపు వైజాగ్ వెళ్ళిపోతున్నా.. ఎల్లుండి వెళ్లిపోతున్నా.. ఇకనుంచి అదే మన రాజధాని అంటూ జగన్ ఎప్పటికప్పుడు ప్రకటన చేస్తూ వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటికీ కేంద్రం అమరావతిని అధికారిక రాజధానిగానే గుర్తించింది. అయినా విశాఖను రాజధాని చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు జగన్. విశాఖ ఋషికొండలో సీఎం కార్యాలయం క్యాంప్ ఆఫీస్ కూడా రూ.250 కోట్ల రూపాయలతో నిర్మించేసాడు కూడా.

Paragliding: ప్రాణం తీసిన పారాగ్లైడింగ్.. కులూలో తెలంగాణ మహిళ మృతి

కానీ విశాఖ వెళ్లడానికి జగన్‌కు ధైర్యం చాలలేదు. అసలు రాజధాని ఏదో.. ఎక్కడో అర్థం కాక నిత్యం జుట్టు పీక్కుంటూ ఉంటారు జనాలు, నేతలు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీ అగ్రనేత సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి సహా మరికొందరు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కాల పరిమితిని పెంచాలని కొత్త డిమాండ్ పెట్టారు. ఎన్నికలు వస్తున్నాయి. ప్రధాన అంశాలు ఏమీ లేవు. ఇలాంటి పనికిమాలిన విషయాన్ని చర్చకు పెడితే సమస్యలు పక్కకెళ్ళిపోతాయని, హైదరాబాదులో ఉన్న సీమాంధ్ర ఓటర్లు ఆకర్షితులవుతారని.. ఇలాంటి పిచ్చి ఐడియాలతో మళ్లీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని కావాలని, ఇంకా కొన్ని ఏళ్లు ఉండాలని సుబ్బారెడ్డి లాంటివాళ్ళు కొత్త డిమాండ్ లేవనెత్తారు. ఏపీ జనం దృష్టిలో ఎప్పుడో హైదరాబాద్ రాజధానిగా కనుమరుగైపోయింది. అది ఎవరికీ గుర్తు లేదు కూడా. ఏదో కొందరు అధికారులు వచ్చిపోతూ ఉంటారు తప్ప హైదరాబాద్‌ను ఏపీకి రాజధానిగా జనం చూడటం లేదు. హైదరాబాదులో లక్షల మంది సీమాంధ్రులు ఉన్నారు. ఇదంతా సరేగానీ హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా చూడడం మానేశారు జనం. కెసిఆర్ హయాంలోనే వ్యూహాత్మకంగా ఏపీతో ఆయన బంధాలు తెంపేశాడు.

ఇప్పుడు కొత్తగా వైసీపీ నేతలు ఉమ్మడి రాజధాని కాలపరిమితి పెంపు డిమాండ్ పైకి తీసుకొచ్చి, చర్చకు పెట్టి, లబ్ధి పొందాలని చూస్తున్నారు. కానీ జనం దీన్ని ఏ మాత్రం పట్టించుకోరు. ఎన్నికల ముందు ఇలాంటి చౌకబారు టెక్నిక్‌లు వేయకుండా ఉంటే వైసీపీకి ఎంతో కొంత మేలు జరుగుతుంది.