Ysrcp Manifesto: ‎వైసీపీ మేనిఫెస్టో ఆ రోజేనా.. వరాలు కురిపిస్తారా.?

ఈ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో సిద్దం చేశారు. గతంలో ప్రకటించిన నవరత్నాలు వంటివి ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన పథకాలకు మరింత మెరుగ్గా అమలు చేసేలా కొత్త మేనిఫెస్టో ఉండొచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి.

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 07:48 PM IST

Ysrcp Manifesto: రాబోయే ఎన్నికల కోసం ప్రణాళికతో ముందుకెళ్తున్న ఏపీ అధికార పార్టీ వైసీపీ.. త్వరలోనే మేనిఫెస్టో విడుదలకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మార్చి 10న బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద నిర్వహించనున్న సిద్ధం సభలో మేనిఫెస్టో విడుదల చేయాలని జగన్ భావిస్తున్నారు. ప్రస్తుతం వైసీపీ.. సిద్దం పేరుతో రాజకీయ సభలు నిర్వహిస్తూ వస్తోంది. సిద్ధం ముగింపు సభ ఈ నెల 10న బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరగనుంది. ఈ సిద్దం సభకు సంబంధించిన పోస్టర్‌ను, ప్రమోషనల్ సాంగ్‌ను శనివారం ఒంగోలులో విడుదల చేశారు.

CHANDRABABU NAIDU: ఏపీ సచివాలయం తాకట్టు.. జగన్‌పై చంద్రబాబు విమర్శలు

సభ ఏర్పాట్లను వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఈ బహిరంగ సభను భారీ ఎత్తున నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది. తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లోని 43 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి 15 లక్షల మంది ఈ సభకు హాజరవుతారని అంచనా. ఈ సభలోనే మేనిఫెస్టో విడుదల చేయబోతున్నారు. ఓటర్లను ఆకర్షించేలా మేనిఫెస్టో సిద్దం చేశారు. గతంలో ప్రకటించిన నవరత్నాలు వంటివి ఈ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉంది. గతంలో ప్రకటించిన పథకాలకు మరింత మెరుగ్గా అమలు చేసేలా కొత్త మేనిఫెస్టో ఉండొచ్చని వైసీపీ వర్గాలు అంటున్నాయి. ఈ సభలో.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల కోసం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం గత నాలుగేళ్ల 10 నెలల కాలంలో ఏం చేసిందో ప్రజలకు వివరించబోతున్నారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల గురించి చెబుతారు.

మార్చి 13 లేదా మార్చి 14న లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అన్ని సీట్లకు అభ్యర్థుల్ని జగన్ వెల్లడిస్తారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ఇక.. ఇప్పటికే ఏపీలో వైసీపీ వర్సెస్ టీడీపీ, జనసేన వార్ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇరు పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలతో రాజకీయాల్ని వేడెక్కించారు. మరోవైపు టిక్కెట్ల కోసం నేతల జంపింగ్‌లు కొనసాగుతున్నాయి. నామినేషన్ వేసేదాకా.. ఎవరు ఏ పార్టీలో ఉంటారో తెలియని స్థితి కొనసాగుతోంది.