YSRCP: ఇంఛార్జిల మార్పుతో వైసీపీ ఎమ్మెల్యేల్లో టెన్షన్.. మరిన్ని మార్పులకు రెడీ అవుతున్న జగన్

తమకు ఇంచార్జిగా అవకాశం వస్తుందా.. రాదా.. అనే టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కూడా జగన్ పక్కనబెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇస్తుండటం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 02:56 PM IST

YSRCP: ఏపీలోని వైసీపీ నేతలు, ఎమ్మెల్యేలు టెన్షన్‌లో ఉన్నారు. వివిధ నియోజకవర్గాలకు ఇంచార్జిలను మార్చుతూ సీఎం జగన్ తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈ విషయంలో ఆందోళనకు గురవుతున్నారు. నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరు ఉంటే.. రాబోయే ఎన్నికల్లో వారికే టిక్కెట్ అనేది అప్రకటిత నిర్ణయం.

Parliament winter session: పార్లమెంట్ నుంచి 142 మంది ఎంపీల సస్పెన్షన్..

అందువల్ల తమకు ఇంచార్జిగా అవకాశం వస్తుందా.. రాదా.. అనే టెన్షన్‌లో వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్ని కూడా జగన్ పక్కనబెట్టి వేరే వాళ్లకు అవకాశం ఇస్తుండటం ఆ పార్టీ ఎమ్మెల్యేలకు మింగుడుపడటం లేదు. ఇప్పటికే 15 నియోజకవర్గాలకు ఇంఛార్జిల్ని జగన్ మార్చిన సంగతి తెలిసిందే. ఇంకా మరికొందరిని కూడా మార్చబోతున్నారు. సమన్వకర్తల మార్పులు చేర్పులపై సీఎం జగన్ మంగళవారం కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణ, ఎమ్మెల్యే కిలారు రోశయ్య, ఉమ్మారెడ్డి, చీఫ్ విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే రాపాక తదితరులు ఇప్పటికే సీఎం క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు.

తాజాగా రాయలసీమ సీట్లపై వైసీపీ కసరత్తు మొదలు పెట్టింది. టిక్కెట్ ఇవ్వలేని వాళ్లకు జగన్ సహా అగ్రనేతలు క్లారిటీ ఇస్తున్నారు. మద్దాలి గిరి, టీజేఆర్ సుధాకర్ బాబు, తిప్పల నాగిరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ వచ్చే అవకాశం లేదు. ఉభయ గోదావరి, కృష్ణా, అనంత జిల్లాల్లో కూడా పలువురు వైసీపీ సిట్టింగులకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్లు కష్టమే అనే ప్రచారం జరుగుతోంది. పలువురు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా అవకాశం ఇవ్వనుండగా, మరికొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా అవకాశం ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు.
వైసీపీ మార్చబోయే స్థానాలు ఇవే..
ఉమ్మడి తూర్పు గోదావరి:
రాజమండ్రి రూరల్, పిఠాపురం, పత్తిపాడు, జగ్గం పేట, పి.గన్నవరం, రామచంద్రాపురం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా:
నరసాపురం, పోలవరం, ఉండి, ఉంగుటూరు.
ఉమ్మడి కృష్ణా:
విజయవాడ వెస్ట్, విజయవాడ సెంట్రల్ తిరువూరు, అవనిగడ్డ, పెడన.
ఉమ్మడి ప్రకాశం జిల్లా:
దర్శి
ఉమ్మడి గుంటూరు జిల్లా:
పొన్నూరు
ఉమ్మడి అనంతపురం జిల్లా:
పెనుగొండ, రాయదుర్గం, కళ్యాణదుర్గం.