CHANDRABABU NAIDU: వైనాట్ 175 అంటూ ఎన్నికలకు వెళ్తున్న వైసీపీ.. కుప్పం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాగా వేయడంతో.. అదే సీన్ అసెంబ్లీ ఎన్నికల్లో రిపీట్ చేయాలని.. చంద్రబాబుకు దిమ్మతిరిగే షాక్ ఇవ్వాలని.. వైసీపీ వేస్తున్న ప్లాన్‌లు అన్నీ ఇన్నీ కావు. కుప్పంలో చంద్రబాబును ఓడించడం సాధ్యం అయ్యే పనేనా అనే చర్చ జరుగుతున్నా.. అసలు కుప్పంలో గ్రౌండ్‌లెవల్ రియాలిటీ ఏంటి అనే దానిపై.. తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరుగుతోంది.
March 1st new rules: మార్చి 1 నుంచి కొత్త రూల్స్.. ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు అలర్ట్..
కుప్పం నుంచి భరత్‌ను అభ్యర్థిగా ప్రకటించిన జగన్.. గెలిపిస్తే మంత్రివర్గంలో చోటిస్తానని హామీ ఇచ్చారు. ఇక అటు నియోజకవర్గ బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డికి అప్పగించారు. కుప్పం నియోజకవర్గంలో కుప్పం, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం మండలాలు ఉన్నాయ్. జనాభాపరంగా వన్యకుల క్షత్రియులు ఎక్కువగా ఉన్నారు. ఆ తర్వాత మాల, కురువ, గాండ్ల కులస్తులు ఎక్కువ. తెలుగుదేశం పెట్టినప్పటి నుంచి.. పసుపు పార్టీ హవా కొనసాగుతూనే ఉంది. చంద్రబాబును ఏడుసార్లు గెలిపించిన కుప్పంలో.. ఈసారి రికార్డును బ్రేక్ చేసేందుకు వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం, కేజే భరత్‌ను అభ్యర్ధిగా ప్రకటించి.. గెలిస్తే మంత్రి పదవి ఇస్తామన్న హామీ, స్ధానిక ఎన్నికల్లో గెలుపు వైసీపీని ఇక్కడ ఊరిస్తున్నాయి. అయితే కర్నాటక, తమిళనాడు సరిహద్దుల్లో భిన్న పరిస్ధితులు ఉన్న ఈ అసెంబ్లీ సీటులో.. చంద్రబాబును ఢీకొట్టి గెలవడం అంత సులువు కాదనేది ఇక్కడ వినిపిస్తున్న మాట.
ఐతే వైసీపీ మాత్రం ప్రయత్నాలు ఆపడం లేదు. సొంత నియోజకవర్గానికి చంద్రబాబు చేసేందేమీ లేదు అని పదేపదే చెప్తూనే.. హంద్రీనీవా నీళ్లు కూడా.. ఇక్కడికి తీసుకురాలేకపోయాని ఆరోపిస్తోంది. దీనికితోడు.. ఏ చిన్న సమావేశం అయినా భారీగా జనసమీకరణ చేస్తోంది. జనాల అటెన్షన్ అందుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఏమైనా ఈసారి కుప్పం పోటీ మాత్రం మరింత ఆసక్తికరంగా కనిపించే చాన్స్ ఉంది.