ANDHRA PRADESH: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయం రోజురోజుకూ వేడెక్కుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేన, వైసీపీ.. ఒకరిపై ఒకరు ఎన్నికల సంఘానికి (ఈసీకి) పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నాయి. మంగళవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తోపాటు వైసీపీ నేతలు, ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సహా పలువురు ఈసీని కలిశారు. ఈ సందర్భంగా తమకున్న అభ్యంతరాల్ని తెలిపారు. ముఖ్యంగా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి పార్టీలు.
REVANTH REDDY: ఇదీ రేవంత్ అంటే.. కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం.. ఇది కదా ప్రజా పాలన అంటే..
ఆరు అంశాలతో వైసీపీ.. ఎనిమిది అంశాలతో టీడీపీ – జనసేన పరస్పరం ఫిర్యాదులు చేశాయి. నిబంధనల ప్రకారం వచ్చే ఎన్నికల్లో జనసేనకు గాజు గుర్తు కేటాయించకూదనే కీలకాంశాన్ని వైసీపీ తెరపైకి తీసుకొచ్చింది. జనసేనకు గాజు గ్లాస్ కామన్ సింబల్ కేటాయించకూడదని వైసీపీ.. ఈసీని కోరింది. అలాగే లేటెస్ట్ టెక్నాలజీతో ఓటర్ల యాప్ రూపొందించి అవకతవకలకు పాల్పడుతోందంటూ టీడీపీపై ఫిర్యాదు చేసింది వైసీపీ. టీడీపీ ఎలక్ట్రోరల్ కమిటీలోని కోనేరు సురేష్ సహా ఇతర సభ్యులపై ఫిర్యాదు చేసింది. హైదరాబాదులో నివాసం ఉండే వారి ఓట్లను ఏపీలో నమోదు చేయించడంపై కూడా వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోవైపు.. 10.32 లక్షల అప్లికేషన్లు పరిశీలించకుండానే డ్రాఫ్ట్ ఎలక్షన్ రోల్స్ ప్రకటించడంపై టీడీపీ, జనసేన అభ్యంతరం వ్యక్తం చేశాయి. కొందరి వ్యక్తుల పేర్లతో భారీ ఎత్తున ఫాం-7 దరఖాస్తులు దాఖలు కావడాన్ని కూడా టీడీపీ.. సీఈసీ దృష్టికి తీసుకెళ్లింది. నిబంధనలకు విరుద్దంగా ఫాం-7 దరఖాస్తులు చేసిన వారిని గుర్తించినా చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ ఆరోపించింది. ఇంటింటి సర్వేను గ్రామ సచివాలయ సిబ్బంది చేపట్టడాన్ని తప్పు పట్టింది.
వైసీపీకి అనుకూలంగా గ్రామ సచివాలయ సిబ్బంది పని చేస్తున్నారని ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. రూల్స్‌కు విరుద్దంగా వలంటీర్ల జోక్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ-జనసేన సీఈసీ కోరాయి. గతంలో తామిచ్చిన రిప్రజెంటేషన్లకు చర్యలు తీసుకోకుండా సీఈఓ మొక్కుబడి వివరణలు ఇస్తున్నారని సీఈసీకి టీడీపీ ఫిర్యాదు చేసింది. ఇలా ప్రధాన పార్టీలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం సంచలనంగా మారింది.