YV Subba Reddy: ఏపీ రాజధానిగా హైదరాబాద్.. ఏపీలో రాజధాని నిర్మించే పరిస్థితి లేదు: వైవీ సుబ్బారెడ్డి

విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. రాజ్యసభలోనూ ఉమ్మడి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని, విభజన హామీలపై అడుగుతామని సుబ్బారెడ్డి తెలిపారు.

  • Written By:
  • Updated On - February 13, 2024 / 05:19 PM IST

YV Subba Reddy: ఏపీ రాజధానిగా హైదరాబాద్‌ను కొనసాగించాలని వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) డిమాండ్‌ చేశారు. విశాఖపట్నంలో పాలనా రాజధాని ఏర్పాటయ్యే వరకు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కోరారు. రాజ్యసభలోనూ ఉమ్మడి రాజధాని అంశాన్ని ప్రస్తావిస్తామని, విభజన హామీలపై అడుగుతామని సుబ్బారెడ్డి తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాజధాని నిర్మించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.

Hari Rama Jogaiah: జనసేన లేకపోతే.. టీడీపీకి అంత సీన్ లేదు: హరిరామ జోగయ్య లెటర్

కేంద్రంలో ప్రభుత్వం బలంగా ఉన్నంత వరకూ ప్రత్యేక హోదా తేవడం కూడా కష్టమేనని చెప్పారు. 2014లో ఏపీ విభజన సమయంలో హైదరాబాద్‌ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ప్రకటించింది కేంద్రం. దీని ప్రకారం.. వచ్చే జూన్ వరకు హైదరాబాద్.. తెలంగాణతోపాటు, ఏపీకి ఉమ్మడి రాజధానిగా ఉండాలి. అయితే, ఈ గడువును పొడిగించాలని ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఇటీవల వైవీ సుబ్బారెడ్డి.. రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా రాజధాని గురించి వ్యాఖ్యలు చేశారు. అయితే, ఉమ్మడి రాజధాని విషయంలో ఇంతకాలం సైలెన్స్‌గా ఉన్న వైసీపీ.. ఇప్పుడు హైదరాబాద్ విషయంలో స్పందించడం ఆసక్తి కలిగిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి.. జగన్‌కు అత్యంత ఆప్తుడు. జగన్ అనుమతి లేకుండా వైవీ ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం లేదు.

ఇప్పుడు జగన్ సూచనతోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశాన్ని ఆయన తెరపైకి తెచ్చారని అర్థమవుతోంది. ఈ అంశాన్ని లేవనెత్తడం ద్వారా జగన్ అండ్ కో ఏం ఆశిస్తున్నారో తేలాలి. మరోవైపు వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై బీజేపీ, ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. జగన్ తన పాలనలో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి, దౌర్భాగ్య స్థితి కల్పించారని బీజేపీ విమర్శిస్తోంది. వైవీ సుబ్బారెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు.