Tsunami 2004: సునామీ ప్రళయానికి 19 ఏళ్లు.. వేల మందిని పొట్టనపెట్టుకున్న మహా ప్రళయం

ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. గంటల వ్యవధిలోనే రాకాసి అలలు తీరానికి దూసుకువచ్చాయి.

  • Written By:
  • Publish Date - December 26, 2023 / 05:31 PM IST

Tsunami 2004: అది 2004 డిసెంబర్‌ 26. అంతా క్రిస్మస్‌ వేడుకల్లో మునిగిపోయారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఎంజాయ్‌ చేస్తున్నారు. చాలా మంది కుటుంబం కోసం సొంతూర్లకు వెళ్లారు. కానీ ఆ రాత్రి తెల్లారేసరికి ప్రకృతి ప్రకోపానికి మానవాళి బలయ్యింది. ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో 9.1 మాగ్నిట్యూడ్‌తో భూకంపం వచ్చింది. దాని ప్రభావానికి హిందూ మహాసముద్రం ఒక్కసారిగా ఉప్పొంగింది. గంటల వ్యవధిలోనే రాకాసి అలలు తీరానికి దూసుకువచ్చాయి.

Ex Girl Friend: మాజీ ప్రియురాలితో జాగ్రత్త.. ప్రియుడిని గంజాయి కేసులో ఇరికించిన మాజీ లవర్

తీర ప్రాంతాలను తమలో కలిపేసుకున్నాయి. 17.4 మీటర్ల ఎత్తు మేర ఎగసిపడ్డ రాకాసి అలలు.. హిందూమహాసముద్రాన్ని ఆనుకుని ఉన్న 14 దేశాల తీర ప్రాంతాలను కకావికలం చేశాయి. 5 వేల కిలోమీటర్లు ప్రయాణించిన సునామీ అలలు ఆఫ్రికా తీరానికి కూడా తీవ్ర నష్టాన్ని కలిగించాయి. భారత్‌, ఇండోనేషియా, శ్రీలంక, థాయ్‌లాండ్‌ సహా తొమ్మిది దేశాల్లో.. ఈ సునామీ 2 లక్షల 30 వేలకు పైగా ప్రజలను పొట్టన పెట్టుకుంది. 18 లక్షల మంది నిరాశ్రయులు కాగా.. 50వేల మంది గల్లంతయ్యారు. భారత్‌‌లో సుమారు 10 వేల మందికి పైగా చనిపోయారు. అందులో అండమాన్ నికోబార్ దీవుల్లో 4 వేల మంది, తమిళనాడులో 4,500 మంది చొప్పున చనిపోయారు. ఇది మానవ చరిత్రలోనే అతిపెద్ద ప్రకృతి విలయాల్లో ఒకటిగా నిలిచిపోయింది. హిరోషిమాపై అమెరికా ప్రయోగించిన అణు బాంబు కంటే 23 వేల రెట్లు అధికమైన శక్తి ఈ సునామీ వల్ల విడుదలైంది.

ఈ విషయాన్ని అమెరికన్‌ జియోలాజికల్‌ సర్వే అప్పట్లో అధికారికంగా ప్రకటించింది. మొదట్లో భూకంప తీవ్రతను 8.8గా లెక్కించినప్పటికీ 2005లో 9.0కి సవరించారు. కానీ యూఎస్‌జీఎస్‌ మాత్రం 9.1గా అంచనా వేసింది. కానీ, 2006లో జరిపిన పరిశోధనల ప్రకారం.. ఈ భూకంప పరిమాణం 9.1 నుంచి 9.3 ఉంటుందని తేల్చారు. మాగ్నిట్యూడ్‌ ఎంత ఉన్నప్పటికీ.. మానవ చరిత్రలో మాత్రం ఇది చెరిగిపోని గాయపు మరకగా మిగిలిపోయింది.