Special Kachidi Fish: అరుదైన కచిడి చేప విలువ.. అక్షరాలా నాలుగు లక్షలు

గోదావరి అంటేనే పంటల కళకళలు, మనుషుల మర్యాదలు, రుచికరమైన వంటకాలు, చేపల వ్యాపారం. వీటిలో ఏదో ఒక అంశంలో నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంది ఈ ప్రాంతం. తాజాగా కచిడి అనే రకం చేప మత్యకారుల వలలో చిక్కి వారిని లక్షాధికారులను చేసింది. ఈ అరుదైన రకపు విలువైన చేప గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - July 22, 2023 / 02:56 PM IST

సాధారణంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రదాన ప్రాంతాలైన తొండంగి, అద్దరిపేట, సఖినేటి పల్లి, పాల్లిపాలెం, పేరుపాలెం, నరసాపురం తదితర ప్రాంతాల్లో మత్స్యకారులు వేటకు వెళ్తూ ఉంటారు. ఈప్రాతంలో అరుదుగా కచిడి అనే చేప జాలర్ల వలకు చిక్కుతూ ఉంటుంది. దీనిని బ్లాక్ స్పాటెడ్ లేదా సీగోల్డ్, గోల్ ఫిష్ అని పిలుస్తారు. దీనికి శాస్త్రీయంగా ప్రోటోనిబియా డియాకాన్తస్ అని కూడా అంటారు. ఇది ఫసిఫిక్, బంగాళాఖాతంలోని అత్యంత లోతు ప్రాంతాల్లో లభిస్తుంది. ఈ చేపకు ఒక ప్రత్యేకత ఉంటుంది. సహజసిద్దగానే వాయుకోశం ఉండటంతో సముద్రాలను అతి తెలివిగా ఊదుతూ జీవిస్తాయి.

వైద్య, ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు:

జాలర్ల వలకు చిక్కిన ఈరకం చేపలను కొనుగోలు చేసేందుకు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్టణం, నెల్లూరు జిల్లాల నుంచి క్యూలు కడుతున్నారు. సాధారణంగా దీని బరువును బట్టి ధరను లెక్కగడతారు. ఈ కచిడి బరువు కనిష్టంగా 10 కిలోల నుంచి గరిష్టంగా 40 కిలోల వరకూ ఉంటుంది. 10 కిలోలు దాటితే దీని ధర రూ. లక్ష నుంచి రూ. 2 లక్షల వరకూ ఉంటుంది. తాజాగా 25 కిలోల బరువు కలిగిన చేప రూ. 4 లక్షలకు పైగా అమ్ముడు పోయింది. ఈ కచిడీ చేపలో కొలాజిన్ అనే పదార్థం అధికంగా ఉంటుంది. ఇది రుచి, వాసన ఉండదు. అయితే ఇందులో నుంచి వచ్చే జలాటిన్ అనే పదార్థాన్ని ఆహార పదార్థాల తయారు చేసేందుకు, శాస్త్రపరంగా కొన్ని మందుల్లో,  వైద్యపరంగా పొట్ట భాగంలో ఆపరేషన్ చేసినపుడు కుట్లు వేసే దారాన్ని తయారు చేసేందుకు ఉపయోగిస్తారు. అలాగే కొన్ని చర్మసంబంధమైన కాస్మెటిక్స్, క్యాప్సూల్స్ లో ఉండే పై ప్లాస్టిక్ గొట్టాలను తయారు చేసేందుకు కూడా వినియోగిస్తారు.

అంతర్జాతీయ మార్కెట్లో గ్రేడ్ బట్టీ ధర:

కచిడీ రకం చేపలను మన రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలైన చెన్నై, కోల్ కత్తా సముద్రతీరాలకు తరలిస్తారు. అక్కడ వీటిని ప్రాసెసింగ్ చేస్తారు. ఆతరువాత వాటిని మగ, ఆడ చేపలుగా వర్గీకరిస్తారు. ఇలా చేసిన వాటిని గ్రేడింగ్ నిర్వహించి ఐస్ బాక్సుల్లో ప్యాక్ చేసి యూరప్, సింగపూర్, హాంకాంగ్, మలేషియా, జపాన్, చైనా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు. ఈ కిచిడీ చేపకు మన దేశంలో తినేందుకు, రుచికి మాత్రమే ఉపయోగిస్తారు. అదే విదేశాల్లో వీటిని ఔషదాలు తయారీకి ఉపయోగిస్తారు. ఇందులో సహజమైన వాయుకోశాలు ఉండటం కారణంగా వీటికి విదేశాల్లో డిమాండ్ ఎక్కువ.

ధనవంతులు సైతం జంకుతున్నారు:

మామూలుగా గోదావరిలో చేపల పులుసుతో పాటూ పులస పొట్టు కూర చాలా ప్రసిద్ధి. ఇవి సీజనల్ గా లభించే చేపల రకాలు. అయితే  రుచిలో కచిడి చేపకు ఉన్న పేరు ఏ ఇతర చేపలకు లభించడం లేదు. ధనవంతులు కూడా దీనిని రుచి చూసేందుకు ముందుకు రావడం లేదు. దీనికి గల ప్రదాన కారణం అధిక ధర అంటున్నారు కొనుగోలుదారులు.

T.V.SRIKAR