Afghanistan: తాలిబన్ల శకం ఎలా ప్రారంభమైంది – ఆఫ్ఘనిస్తాన్ యుద్దం వెనుక కారణాలు – ప్రస్తుత పరిస్థితులు..!

తాలిబన్లు.. వీరి గురించి తెలుసుకోవాలంటే కాసేపు ఆఫ్ఘనిస్తాన్ చరిత్రను చూడాలి. ఈ దేశంలో ఎటు చేసినా ఎత్తైన పర్వతాలు దర్శనమిస్తాయి. సముద్రతీరానికి అస్సలు సంబంధంలేకుండా, కొన్ని లక్షల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను కలిగి ఉన్న ప్రాంతం. సుమారు 50వేల సంవత్సరాలకు పైబడిన చరిత్ర దీనికి ఉంది.

  • Written By:
  • Publish Date - February 15, 2023 / 05:41 PM IST

 

రవి అస్తమించని బ్రిటీష్ సామ్యాజ్యం అనే మాటను ఈ ప్రాంతానికి కూడా అన్వయించవల్సి ఉంటుంది. బ్రిటీష్ వారు ఈ భూభాగాన్ని కూడా పాలించి 1919లో ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లారు. దీంతో ఆఫ్ఘనిస్తాన్ కి స్వాతంత్య్రం వచ్చింది. కానీ పేరుకే ఈ స్వాతంత్య్రం పరిమితమైంది. ఎందుకంటే బ్రిటీష్ వారు వెళ్తూ రాచరిక వ్యవస్థను ఏర్పాటు చేసి బారక్షాయి వంశస్తులకు రాజ్యాన్ని అప్పగించి వెళ్లారు. ఈ పారంపర్య రాజుల పాలనా వ్యవస్థ 1978 వరకూ కొనసాగింది. ఆతరువాత ఆప్ఘాన్ కమ్యూనిష‌్టుల ఒళ్లో రాజ్యాధికారం వచ్చి పడింది. దీంతో ఈ దేశంలోకి ఇతర దేశీయ శక్తులు అడుగు పెట్టాయి. ఇక్కడే ఆఫ్గనిస్తాన్ కి కష్టకాలం ఎదురైందని చెప్పాలి. ఆఫ్ఘాన్ కమ్యూనిష్టులు మెరుగైన పాలన కొనసాగించడంలో విఫలమయ్యారు.

10 సంవత్సరాల తీవ్రయుద్దం:
సరిగ్గా ఈ పరిస్థితులను చూసి ముజాహిద్దీన్ దళాలు విజృంభించాయి. వీరిని ఆఫ్ఘాన్ సైన్యం ఎప్పటికప్పుడు తరిమికొడుతున్నా క్రమక్రమంగా చాపక్రింద నీరులాగా దేశం మొత్తంగా వ్యాపించాయి. దీనివెనుక పాకిస్తాన్ సహాయ సహకారాలు ఈ ముజాహిద్దీన్ బలగాలకు అందుతూ ఉండేది. ఇలా అందించేందుకు పాకిస్తాన్ వెనుక అగ్రరాజ్యం అమెరికా హస్తం ఉంది. అమెరికా వీరికి మద్దతు ఇచ్చేంత అవసరం ఏముంది అనుకుంటే పొరబడినట్లే. ఇక్కడే అసలైన మలుపు రాబోతుంది. ఇక్కడ విరివిగా లభించే పెట్రోల్, ముడిచమురు, ఖనిజ సంపదపై కన్నేసిన అమెరికా వ్యూహాన్ని త్వరగా అర్ధం చేసుకోలేక పోయింది ఆఫ్ఘనిస్తాన్. అలాగే ముజాహిద్దీన్ కి మద్దతుగా ఉన్నవిషయాన్ని కూడా త్వరగా పసిగట్టలేక పోయింది. దీనికి కారణం పటిష్టమైన నిఘా వర్గాన్ని ఏర్పాటు చేసుకోలేక పోవడమే అని చెప్పాలి. చాలా కాలం తరువాత తెలివిగా అమెరికాకు బద్ద శత్రువైన చైనా సహకారం కోరింది. వెంటనే లక్షమంది సోవియట్ యూనియన్ సైన్యాన్ని డిశంబర్4 1979 న రంగంలోకి దింపింది. ఆఫ్ఘనిస్తాన్, చైనా ఇరువురి బలగం రెండులక్షల మంది అయ్యారు. ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా రావచ్చని ముందుగానే వ్యూహాలను రచించిన అమెరికా ముజాహిద్దీన్ బలగాలకు కూడా సైన్యాన్ని అందించింది. దీంతో ఇరుదేశాలకు 10 సంవత్సరాలపాటూ తీవ్రయుద్దం జరిగింది. చాలా దేశాలు యుద్దాన్ని ఉపసంహరించుకోమని కోరగా అమెరికా ససేమేరా అని కూర్చుంది. దీంతో చైనా మాత్రం తన సైన్యాన్ని వెనక్కు పిలిపించుకొని శాంతిని కోరింది. ఇక 1992వరకూ సాగిన నజీముల్లా ప్రభుత్వ కూడా కూలిపోయింది.

దేవుడిగా పాలించి రాక్షసులుగా పీడించి:
ఇప్పుడు మరో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. ఒకప్పటి రాచరికాలు పతనమయ్యాయి. సోవెట్ యూనియన్ తమ సైన్యంతో వెనుదిరిగింది. ఇక అమెరికా విజయం తమదేననే వీర గర్వంలో ఉంది. ఆఫ్ఘనిస్తాన్లో ప్రజలు గతంలోని యుద్దందాటికి బ్రతకాలంటేనే బయపడేంతలా పరిస్థితులు మారిపోయాయి. తీవ్రమైన దారిద్ర్యంతో కొట్టుమిట్టాడారు. విద్యావంతులు ఉపాధి కోసం వలసలు వెళ్లిపోవాల్సి వచ్చింది. ఇదే సరైన సమయం అనుకొని భావించి తాలిబన్లు దూసుకొచ్చారు. తాలిబన్లు అంటే ఆఫ్ఘాన్ లోని గురుకులాల్లో ఉండి విద్యనభ్యసించేవారు. యుద్దంలో వీరికి సంబంధించిన చాలా మంది చనిపోయారు. దీంతో ఆ గురుకులల్లోని గురువులు, విద్యార్థలు కలిసి శాంతి సందేశంతో ఆదేశంలోని అన్ని తెగలవారిని ఏకం చేసి నాయకత్వం వహించారు. అక్కడి ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలు కల్పించారు. కావల్సిన వారికి ఉపాధిని అందించారు. అక్కడి ఖనిజాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఎండిపోయిన ఎడారివంటి దేశాన్ని చిగురించిన ఆకుల్లా మార్చారు. ఇలా చేసి ప్రజల్లో దేవుళ్లుగా కీర్తింపబడ్డారు. బహుషా ఆకీర్తిని ఎక్కువ కాలం నిలుపుకోవడం ఇష్టంలేదేమో. తమలోని రాక్షసత్వాన్ని విధివిధానాలపై పెట్టారు. కఠినమైన ఇస్లాం సాంప్రదాయంలోని ఆచారాలను పొందుపరిచారు. మహిళల సంగతైతే చెప్పనక్కర్లేదు. గడప దాటాలంటే కూడా కదలనిచ్చేవారు కాదు. ప్రజలపై పన్నులు విధించి దోచుకోవడం మొదలుపెట్టారు. అక్కడి యువతకు మాదకద్రవ్యాలను అలవాటు చేశారు. దేశాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి తీసుకెళ్లారు. దీంతో కథ యూ టర్న్ తీసుకొని మళ్లీ మొదటికి వచ్చింది.

ఆఫ్ఘనిస్తాన్లో బిన్ లాడెన్ ఆశ్రయం:
ఈ యూటర్నలో కీలకపరిణామాలు చోటు చేసుకున్నాయి. అప్పటికే అమెరికా ట్వన్ టవర్లను కూల్చేసిన బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో అడుగుపెట్టాడు. అమెరికా ఇతగాడికోసం గాలింపు చర్యలు చేపట్టింది. చివరకు ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాడన్న విషయాన్ని తెలుసుకొని ఇతనికి ఆశ్రయం కల్పించిన ఆల్ఖైదా స్థావరాలపై బాంబులు వేసింది. లాడెన్ కు చోటు కల్పించినందుకు తాలిబన్లని నిద్రలేకుండా చేసింది. అమెరికా శక్తి ముందు తాలిబన్లు తోక ముడచక తప్పలేదు. శాంతి పేరుతో అమెరికా తమ దేశ రక్షణాదళాలను ఏర్పాటు చేసి 2003లో నూతన రాజ్యాంగం లి‎ఖించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆతరువాత ప్రజలు తిరిగి ఆనందంగా జీవనం సాగించేవారు. 2004లో జరిగిన ఎన్నికల్లో హమీదు ఖజ్జాయీ ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడుగా తిరిగి ఎన్నికైయ్యారు. 2008లో ఎన్నికల ద్వారా నేషనల్ అసెంబ్లీ ఎర్పాటు చేయబడింది. దీంతో తాలిబన్లు దాదాపు 20సంవత్సరాలపాటూ అధికారానికి దూరమైయ్యారు. గడిచిన పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ది సాధించిన ఆఫ్ఘనిస్తాన్ రక్షణ రంగంలో మాత్రం వెనుకబడిపోయింది.

తాలిబన్ల చొరబాటు:
గతంలో తరిమికొట్టిన కక్ష్యతో ఉత్తర ఆఫ్ఘనిస్తాన్ లో స్థావరాలు ఏర్పరుచుకున్న తాలిబన్లు మాదకద్రవ్యాలు, గన్నులు వంటి వాటిని అమ్ముకొని చాలా బాగా బలం పుంజుకున్నారు. దాదాపు 15సంవత్సరాలు పెట్రోల్ ను వాడుకున్న అమెరికా అక్కడి ఇంధన నిలువలు అడుగంటిపోయాయని తెలుసుకొని తమ సైన్యాన్ని వెనక్కి పిలిపించింది. దీంతో రెచ్చిపోయిన తాలిబన్లు మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో దేశంలోకి చొరబడ్డారు. దేశ అధ్యక్షుడు అశ్రఫ్ ఘని భయంతో ఆదేశం విడిచిపెట్టి పారిపోయాడు. దీనికి కారణం గతంలో వీరి రూల్స్ కి ఎవరూ జీవించడం సులభం కాదు. అందుకే 2021లో చాలామంది దేశం విడిచిపెట్టి వెళ్లేందుకు పరుగులు తీశారు. దీంతో తాలిబన్లను ఎదిరించే వారే లేరు. వారు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగింది. దీంతో రాజ్యాధికారాన్ని తమ చేతిలోకి తీసుకొని పాలిస్తున్నారు.

అధికారం కోసమే అంతర్గత విభేదాలు:
వీరి పాలన మొదట్లో సామరస్యంగా సాగినప్పట్టికీ ప్రస్తుతం ఈ పరిస్థితి కొంత మార్పు వచ్చినట్లుగా కనిపిస్తుంది. దీనికి కారణం అంతర్గత విభేదాలే. ముఖ్యంగా హక్కానీ గ్రూప్‌ సీనియర్‌ నాయకుడు సిరాజుద్దీన్‌ హక్కానీ, సుప్రీం లీడర్‌ హైదాతుల్లా అఖుంద్‌జాదకు పడటంలేదు. వీరి ఇరువురి మధ్య అంతర్గత విభేదాలు ఇటీవల బయటపడ్డాయి. అఖుంద్‌జాద ఒక్కడే సుదీర్ఘ కాలంగా అధికారాన్ని అనుభవిస్తున్నాడని సిరాజుద్దీనే బహిరంగంగా విమర్శించారు. ఇటీవల జరిగిన మతపెద్దల సమావేశంలో అఖుంద్‌జాద పేరు చెప్పకుండా ‘‘అధికార కేంద్రీకరణ పాలన వ్యవస్థ పరువు తీస్తోందని సిరాజుద్దీన్‌ అన్నారు. ఇన్నాళ్లుగా చూస్తూ వస్తున్నాం. ఇక అసలు సహించేదిలేదంటూ పాలన వ్యవస్థకు ప్రజలకు మధ్య చీలికలు తెచ్చే విధానాలు అవలంభించడం మానుకోవాలని ఆరోపించారు. లేకపోతే ఇది ఇస్లాంను నిందించడానికి ఇతరులకు అవకాశం ఇస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. దీనిపై జుబైహుల్లా ముజాహిద్‌ మాట్లాడుతూ హక్కానీ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘మన ఇస్లాం సంప్రదాయం ప్రకారం.. బహిరంగంగా మంత్రులను, ప్రభుత్వ అధికారులను విమర్శించకూడదు. మీరు నేరుగా ఆయన్ను సంప్రదించి వ్యక్తిగతంగా మీ విమర్శలను తెలియజేయండి. అప్పుడు అవి ఎవరూ వినరు’’ అని అన్నారు. ఇక అఫ్గాన్‌ న్యాయశాఖ మంత్రి అబ్దుల్‌ ఘనీ ఫయిక్‌ కూడా తనదైన శైలిలో స్పందించారు. ‘‘అతడు ఇస్లామిక్‌ ఎమిరేట్‌లో మంత్రి పదవిలో ఉండి.. అదే ఎమిరేట్‌కు వ్యతిరేకంగా వ్యవహరిస్తాడా. ఇది ఏమాత్రం సహించరానిది’’ అని మీడియా ఎదుట హెచ్చరించాడు.

ప్రతిఒక్కరికీ ప్రైవేటు సైన్యం:
తాలిబల్ల వ్యవహారం ఇలాగే ముదిరితే వారికి వారికి మధ్యే అంత:ర్యుద్దం తలెత్తవచ్చని కొందరు నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం చాలా మంది తాలిబన్లు తమ తమ వ్యక్తిగతంగా ప్రైవేట్ సైన్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో సిరాజుద్దీన్ కూడా బలమైన బలమైన హక్కానీ బలగాలను చేతిలో పెట్టుకున్నాడు. వీరితో పాటూ ముల్లా యాకూబ్‌, ముల్లా ఒమర్‌ ఇద్దరి వద్ద అమెరికా వదిలి పెట్టి వెళ్లిన మారణాయుధాలు అధికంగా వీరి ఆధీనంలోనే ఉండటం గమనించదగ్గ అంశం. ఇక ప్రస్తుత మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సుప్రీం లీడర్‌ అఖుంద్‌జాద వద్ద స్థానిక మిలిటెంట్లు, రెచ్చిపోయే దళాలు ఉన్నాయి. ఈ దళాలు ఇతని మాటే వింటాయి. ఇలా గనుక జరిగితే ఆఫ్ఘనిస్తాన్ అధికార కుమ్ములాటలతో అస్తవ్యస్తంగా మారడం ఖాయం.

 

 

T.V.SRIKAR