AI TOOLS: టెక్నాలజీ ఎంత పెరిగిపోతోందో.. ముందు ముందు అంత అనర్థాలు తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఛాట్ జీపీటీ, AI టూల్స్‌తో చాలా మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఏ మనిషికి అయినా 3 లేదా నాలుగు భాషలు మాట్లాడటం వస్తుంది. మహా అయితే 10 భాషలు రావొచ్చు. కానీ AI టూల్ వచ్చాక.. ఒక లాంగ్వేజ్‌లో మీరు మాట్లాడింది.. ఎన్ని భాషల్లో అయినా ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఏఐ టూల్‌తో ఎంతమంది ట్రాన్స్‌లేటర్ల ఉద్యోగాలు ఊడిపోతాయో మరి.
H1B VISAS: యూఎస్ 20 వేల వీసాల జాతర.. భారతీయులకు ఇక పండగే
స్టువర్ట్ రిచీ అని యూకేకి చెందిన ఓ సైన్స్ ఫిక్షన్ రైటర్.. ట్విట్టర్‌లో వరుసగా ఏడు వీడియోలను పోస్ట్ చేశారు. అందులో ఏడు భాషల్లో రిచీ మాట్లాడినట్టుగా ఉంది. కానీ రిచీ ఇంగ్లీష్‌లో మాత్రమే మాట్లాడాడు. అదే వీడియోను హిందీతో పాటు జర్మన్, ఇటలియన్, ఫ్రెంచ్, పోలిష్, స్పానిష్, పోర్చుగీస్.. ఇలా అన్ని భాషల్లోకి మార్చేశాడు. ఆయనకు అవగాహన లేని భాషల్లో కూడా వీడియో ట్రాన్స్‌లేట్ చేయగలిగాడు. ఇదెలా సాధ్యం అంటే.. రిచీ 29 డాలర్లు పెట్టి కొత్తగా వచ్చిన ఇన్ స్టంట్ AI ట్రాన్స్‌లేషన్ టూల్ కొన్నాడు. దాంతోనే ఇది సాధ్యమైందని చెబుతున్నాడు. ఆయన మాట్లాడింది ఇంగ్లీష్ అయినా.. హిందీలో అనువాదం అయ్యాక.. కనీసం లిప్ సింక్ కూడా తేడా రాకుండా ఎంత పర్ఫెక్ట్‌గా ట్రాన్స్‌లేట్ అయిందో ఈ వీడియోలు చూస్తే మీకే అర్థమవుతుంది. సైంటిఫిక్ ఫిక్షన్ రైటర్ స్టువర్ట్.. ఇంగ్లీషులో మాట్లాడిన ఈ 35 సెకన్ల వీడియోని మిగతా భాషల్లోకి ఎలా మార్చానో చూడండి అంటూ X లో పోస్ట్ చేశాడు.
తనకు జర్మనీలో సింగిల్ పదం కూడా తెలీయదని, అయినా ఇన్ని భాషల్లోకి ఎలా మార్చానో చూడండి అంటున్నాడు. హేజెన్ ల్యాబ్స్ ఈ AI టూల్‌ని అందించింది. ఇలా ఎవరికి వారే అన్ని భాషల్లో అనువాదాలు చేసుకుంటూ పోతే.. ఇకముందు ట్రాన్స్‌లేటర్ల ఉద్యోగాలు, టీవీలు, సోషల్ మీడియాల్లో పనిచేసే యాంకర్ల ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంటుందేమో.