Air India: దేశీయ విమానయాన సంస్థ, టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా సంస్థ సిబ్బందికి కొత్త యూనిఫాం అందుబాటులోకి రానుంది. ఈ ఏడాది చివరి నుంచి పైలట్లు, ఎయిర్ హోస్టెస్ సహా ఎయిర్ ఇండియా క్రూ మొత్తానికి కొత్త యూనిఫాం అందించబోతుంది సంస్థ. కొత్త యూనిఫాం కోడ్ ద్వారా ఎయిర్ ఇండియా గొప్ప చరిత్ర, ఉజ్వల భవిష్యత్తుకు హామీ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఈ కొత్త యూనిఫాంను ప్రఖ్యాత డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేయడం విశేషం.
BANDI SANJAY: తెలంగాణ బీజేపీ పగ్గాలు మళ్లీ బండికే !
ఇండియాలోని టాప్ సెలబ్రిటీలకు మాత్రమే డ్రెస్సులు డిజైన్ చేసే మనీష్ మల్హోత్రా.. విమానయాన సంస్థ సిబ్బందికి కూడా డ్రెస్ డిజైన్ చేయడం విశేషం. ఎయిర్ ఇండియా సంస్థను టాటా గ్రూప్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. యాజమాన్యం మారినప్పటి నుంచి సంస్థలో అనేక మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే భారీ సంఖ్యలో కొత్త విమానాలకు సంస్థ ఆర్డర్ ఇచ్చింది. ఎయిర్ బస్, బోయింగ్ సంస్థల నుంచి దాదాపు 470 విమానాల్ని ఆర్డర్ చేసింది. ఇప్పుడు సిబ్బందికి కొత్త డ్రెస్ కోడ్ అమల్లోకి తేనుంది. 1932లో ఎయిర్ ఇండియా సంస్థ ప్రారంభమైంది. అప్పటి నుంచి యూనిఫాం మారడం ఇదే తొలిసారి. ప్రస్తుతం సంస్థలో 10,000 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. పైలట్లు, భద్రతా సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్, క్యాబిన్ క్రూ.. ఇలా అనేక విభాగాల్లో సిబ్బంది పని చేస్తున్నారు.
ఈ సిబ్బంది కోసం రెడ్, పర్పుల్, బ్లాక్, గోల్డ్ కలర్ డ్రెస్సుల్ని రూపొందించారు మనీష్ మల్హోత్రా. కొత్త యూనిఫాంపై ఎయిర్ ఇండియా సీఈవో, ఎండీ క్యాంప్‌బెల్ విల్సన్ మాట్లాడారు. తమ సంస్థ తీసుకొస్తున్న యూనిఫాం.. విమానయాన చరిత్రలో ఉన్నతంగా ఉంటుందని భావిస్తున్నట్లు చెప్పారు. మనీష్ మల్హోత్రా మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక సంస్థ కోసం యూనిఫాం రూపొందించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.