ANDHRA PRADESH: ఏపీలో రియల్ బూమ్.. ఊపందుకుంటున్న రియల్ ఎస్టేట్..

వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి కచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మార్కెట్లో క్రమంగా బలపడడంతో ముందు జాగ్రత్తగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొదలయ్యాయి.

  • Written By:
  • Publish Date - December 19, 2023 / 12:10 PM IST

ANDHRA PRADESH: ఏపీలో ఎన్నికలు దగ్గరయ్యేకొద్దీ సమీకరణాలు మారిపోతున్నాయి. అమరావతి చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ఇప్పుడిప్పుడే మెల్లగా పుంజుకుంటుంది. బెజవాడతోపాటు, విశాఖ, రాజమండ్రి మిగిలిన ప్రాంతాల్లోనూ కొద్దికొద్దిగా రియల్ ఎస్టేట్ ఊపందుకుంటోంది. వచ్చే ఎన్నికల్లో అధికార మార్పిడి కచ్చితంగా జరుగుతుంది అనే నమ్మకం మార్కెట్లో క్రమంగా బలపడడంతో ముందు జాగ్రత్తగా భూముల అమ్మకాలు, కొనుగోళ్లు మొదలయ్యాయి.

PM MODI: సికింద్రాబాద్ నుంచి మోడీ.. మెదక్ నుంచి సోనియా.. అగ్రనేతలిద్దరూ తెలంగాణ నుంచే పోటీ?

2019లో అధికారంలోకి రాగానే.. ఏపీ రియల్ ఎస్టేట్‌తో జగన్ చెడుగుడు ఆడుకున్నాడు. ఏపీ రాజధాని అమరావతిలో ప్రభుత్వ నిర్మాణాలన్నీ ఒక్కసారిగా నిలిపేశాడు. ఇక నుంచి ఏపీ రాజధాని విశాఖ మాత్రమేనని.. మూడు రాజధానుల్లో భాగంగా వైజాగ్ పరిపాలన రాజధానిగా ఉంటుందని ప్రకటించడంతో అమరావతి, బెజవాడ రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. అంతేకాదు అమరావతి చుట్టుపక్కల నిర్మాణం నిలిచిపోయింది. టిడిపి హయాంలో జరిగిన నిర్మాణాలపై రకరకాల ఆంక్షలు విధించడంతో అన్నీ ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. జగన్ అంతటితో ఆగలేదు. రాజధాని కోసం సేకరించిన భూముల్లో కొన్ని దళితులకు పంచి ఇవ్వడంతోపాటు అక్కడ ఎటువంటి రాజధాని నిర్మాణం జరగదని స్పష్టంగా చెప్పడంతో రియల్ ఎస్టేట్ డమాల్ అంది. వందల కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళు నెత్తిన గుడ్డేసుకుని ఇప్పటికీ లబోదిబో అంటూనే ఉన్నారు.

కమ్మ సామాజిక వర్గాన్ని టార్గెట్‌గా పెట్టుకుని జగన్ ఆడిన ఆటతో ఏపీలో అన్నిచోట్ల రియల్ ఎస్టేట్ బాగా దెబ్బతింది. కొత్త పరిశ్రమలు లేకపోవడం, విద్యాలయాలు, ఉద్యోగాలు ఇవేమీ లేకపోవడంతో రియల్ ఎస్టేట్ మీద ఎవరూ ఆసక్తి కనబడలేదు. ఏపీ రియల్ ఎస్టేట్ కుదేలైపోవడంతో ఆటోమేటిగ్గా తెలంగాణ రియల్ ఎస్టేట్ విపరీతమైన అభివృద్ధి సాధించింది. పది రూపాయలు హైదరాబాదులో పెట్టుకుంటే అది 20 రూపాయలు అవుతాయ అవుతాయని ధైర్యంతో జనం ఏపీకి దండం పెట్టి డబ్బులు అన్ని హైదరాబాదులో పెట్టుకున్నారు. 2019 నాటికి అమరావతిలో మూడు కోట్ల పలికిన ఎకరం ఆ తర్వాత 50 లక్షలు ఇచ్చినా తీసుకునేవాడు కరువయ్యాడు. కొంతమంది మాత్రం ఓపిగ్గా ఏదో ఒక రోజు రేటు పెరగకపోతుందా అని ఆశతో ఉన్నారు. 2024 మార్చి, ఏప్రిల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతాడని, టిడిపి సర్కార్ వస్తుందని టాక్ బలంగా వినిపించడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో చిన్నగా కదలిక వచ్చింది.

Meteor Shower: ఆకాశంలో అద్భుతం.. రెండు రోజులే..

తక్కువ రేటు ఉన్నప్పుడే కొని పెట్టుకుంటే రేపు ప్రభుత్వం మారాక భూముల విలువ నాలుగు రెట్లు పెరగవచ్చని అంచనాతో చాలామంది ఇప్పుడే తక్కువ రేట్‌లో కొని పెట్టుకుంటున్నారు. ఒకప్పుడు మూడు కోట్లు ఉన్న ఎకరం ఆ తర్వాత 50 లక్షల పడిపోయింది. అదే రేటుకి ఇప్పుడు దొరుకుతుండడంతో భవిష్యత్తులో అది నాలుకోట్ల రూపాయలకు చేరుకోవచ్చని ఆశతో చక చకా కొని పెట్టుకుంటున్నారు జనం. చంద్రబాబు అధికారంలోకి వస్తే మార్కెట్ యాక్టివేట్ అవుతుందని, అపార్ట్‌మెంట్లకు అవసరం పెరుగుతుందని, రెంట్లు కూడా పెరుగుతాయని అంచనాతో జనం మళ్లీ ఇన్వెస్ట్ చేయడం మొదలుపెట్టారు. వీళ్లంతా అనుకున్నట్టు చంద్రబాబు వస్తే సరే సరి. ఒకవేళ చంద్రబాబు రాకుండా మళ్ళీ జగనే అధికారంలోకి వస్తే.. మరోసారి ఈ పెట్టుబడులు పెట్టిన వారంతా మునిగిపోయినట్లే.