“యాంటీ క్లైబింగ్ పెయింట్” అనే ఈ స్పెషల్ పెయింట్‌ను క్యామ్రెక్స్ పెయింట్స్ అనే సంస్థ తయారు చేసింది. దీని స్పెషాలిటీ ఏంటి అంటే ఇది మూడేళ్లపాటు పచ్చిగానే ఉంటుంది. పట్టుకుంటే జిగురులా జారిపోతుంది. ఈ పెయింగ్ వేసిన గోడ కానీ, పైప్స్ కానీ ఎక్కడ ఇంపాజిబుల్. రిస్క్ చేసి ఎక్కినా సగం నుంచే జారిపోతారు. పెయింట్ చేతులకు అంటుకుంటుంది. ఆ పెయింట్ నార్మల్‌గా పోదు. ఆ కలర్ కోసం తయారు చేసిన స్పెషల్ కెమికల్‌తో కడిగితేనే పోతుంది. లేదంటే ఎన్నిరోజులైనా అలాగే ఉంటుంది. దీంతో దొంగతనానికి ట్రై చేసిన వ్యక్తిని పోలీసులు కనిపెట్టడం ఈజీ అవుతుంది.
ఇప్పటికే చాలా దేశాల్లో ఈ పెయింట్ వాడుతున్నారు. ప్రజెంట్ ఇండియాలో కూడా చాలా హార్డ్‌వేర్ షాపుల్లో ఈ పెయింట్ అందుబాటులో ఉంది. ఇంటి చుట్టూ ఉండే ప్రహారీ గోడకు ఈ పెయింట్ వేసుకుంటే బెటర్. ఇంట్లో చోరీ చేయాలంటే దొంగలు ఆ గోడ దూకే రావాలి. 3 మిల్లీ లీటర్స్ మందంతో ఈ పెయింట్ వేసుకుంటే మంచిదంఅంటున్నారు నిపుణులు. వెదర్ చేజెంస్ వల్ల ఈ పెయింట్‌లో ఎలాంటి మార్పు రాదు. పెయింట్ వేసిన మూడు సంవత్సరాల పాటు ఒకేలా పని చేస్తుంది.
అయితే చిన్న పిల్లల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. ఎందుకంటే ఈ కలర్ ఒక్కసారి అంటుకుంటే అంత ఈజీగా పోదు. దీన్ని క్లీన్ చేసేందుకు వాడే కెమికల్స్ చిన్న పిల్లల స్కిన్ మీద ఎఫెక్ట్ చూపే చాన్స్ ఉంది. ఈ మధ్య దొంగలు కూడా చాలా ముదిరిపోయారు. సీసీ కెమెరాలు, అలారం బజర్‌లను టాంపర్ చేస్తున్నారు. కానీ ఈ పెయింట్ గోడ మొత్తానికి ఉంటుంది కాబట్టి టాంపర్ చేసే చాన్స్ ఉండదు. కడిగి క్లీన్ చేయడం ఇంపాజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పెయింట్ గురించి అవగాహ లేని దొంగ అయితే సింపుల్‌గా ఈ ట్రాప్‌లో పడిపోతాడు. తానే దొంగ అని మార్క్ వేసుకుంటాడు. దీని గురించి తెలిసినవాడైతే అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందుకే ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు ఇలాంటి పెయింట్ మీ ఇంటికి వేసుకుంటే చాలా సేఫ్ అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. దొంగలకే రంగు పడేలా చేసే ఈ యాంటీ క్లైంబింగ్ పెయింట్‌ను మీరూ ఓసారి ట్రై చేయండి.