Atal Seth : భారత దేశంలో సముద్రంపై నిర్మించి ఏకైక బ్రిడ్జి.. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జి “అటల్ సేత్”

భారత దేశంలో సముద్రంపై నిర్మించి ఏకైక బ్రిడ్జి.. దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జి "అటల్ సేత్"

1 / 25

దేశంనే అతి పొడ‌వైన సీ బ్రిడ్జి అట‌ల్ సేత్‌ను ప్ర‌ధామ‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ప్రారంభించిన విషయం తెలిసిందే.. దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబయి న‌గ‌రంలో రూపొందిన ఈ వంతెన గురించి తెలుసుకుందాం పదండి..

2 / 25

ఈ వంతెన ద్వారా ముంబ‌యి న‌గ‌ర ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయి.

3 / 25

ఈ బ్రిడ్జ్ పూర్తి పేరు అటల్ బిహారీ వాజ్‌పేయి శివది న్వశేవ అటల్ సేతు.

4 / 25

దివంగత ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయ్ స్మారకార్ధం ఈ బ్రిడ్జికి అటల్ సేతు పేరును పెట్ట‌డం జ‌రిగింది.

5 / 25

అటల్ సేతు బ్రిడ్జ్ ని ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (MTHL) అని కూడా పిలుస్తారు.

6 / 25

ఈ వంతెన ప్రధానంగా ముంబై నగరంలోని ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణించే సాధారణ ప్రయాణీకుల కష్టాలను తీర్చుస్తుంది.

7 / 25

ఈ బ్రిడ్జి సముద్రంలో 16.5 కిలోమీట‌ర్లు, భూమిపై 5.5 కిలోమీట‌ర్ల పొడవు ఉంటుంది. అటల్ సేతు వంతెన పొడవు 21.8 కిలోమీట‌ర్లు. ఈ బ్రిడ్జిని ఆరు లేన్లతో నిర్మించారు.

8 / 25

ఇండియాలో సముద్రంపై ఉన్న అత్యంత పొడవైన వంతెన ఇదే కావ‌డం విశేషం.

9 / 25

ముంబై నుండి నవీ ముంబై మధ్య ప్రయాణ సమయం.. రెండు గంటల పడుతుంది. అదే అటల్ సేతు వంతెన‌పై ప్రయాణం చేస్తే కేవలం 20 నిమిషాల్లో ప్ర‌యాణం పూర్త‌వుతుంది.

10 / 25

ఈ బ్రిడ్జ్‌ఫై 100 కిలోమీట‌ర్ల‌. వేగంతో దూసుకెళ్లొచ్చు. ఎంఎంఆర్‌డీఏ, జేఐసీఏ నిర్వహించిన అధ్యయనం మేరకు ఎంటీహెచ్ఎల్ సెర్వీ, చిర్లే మధ్య ప్రయాణం 61 నిమిషాల నుండి 16 నిమిషాలకు తగ్గనున్న‌ట్లు స‌మాచారం.

11 / 25

అటల్ సేతు వంతెనలో 8 అద్భుతమైన ఇంజనీరింగ్ సాంకేతికతలు ఉన్నట్లు వివరించారు.

12 / 25

ఈ బ్రిడ్జి నిర్మాణంలో అధికశాతం స్టీల్ డెక్ లను ఉపయోగించడం వల్ల బరువు తక్కువ ఉంటుంది. కాంక్రీట్ కంటే కూడా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. తక్కువ పిల్లర్లతో పొడవాటి రహదారులు ప్రత్యేకతగా నిలుస్తున్నాయి.

13 / 25

ప్రతి రోజూ కనీసం ఈ వంతెన‌పై సుమారు 40 వేల వాహనాలు ప్రయాణించనున్నాయని అధికారులు తెలుపుతున్నారు.

14 / 25

పుణె, అలిబాగ్, గోవా, పన్వేల్‌ల‌ను క‌లిపేందుకు కూడా ఈ బ్రిడ్జి ఎంత‌గానో దోహదం చేస్తుంది.

15 / 25

ఈ వంతెన నిర్మాణానికి రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు. ఈ వంతెన నవీ ముంబైలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం, ముంబై పుణె ఎక్స్‌ప్రెస్ వే, ముంబై గోవా హైవే ల మధ్య కనెక్టివిటిని మెరుగుపర్చేందుకు దోహ‌ద‌ప‌డుతుంది.

16 / 25

ప్రత్యేకమైన రిగ్గులను ఏర్పాటు చేయడం వల్ల ప్రయాణించేటపప్పుడు పెద్ద శబ్ధాలు రాకుండా నివారించవచ్చు. అలాగే వంతెన వైబ్రేషన్ కి గురికాకుండా ఉంటుంది.

17 / 25

సముద్రంలోని జీవులకు ఎలాంటి అసౌకర్యం కలగదు.ఎకో ఫ్రెండ్లీ లైటింగ్ ను ఏర్పాటు చేయడం వల్ల తక్కువ ఖర్చు..అతి తక్కువ కరెంట్ వినియోగంతో మంచి వెలుగువచ్చేలా రూపొందించారు.

18 / 25

భూకంపాలు సంభవిస్తే 6.5 తీవ్రత వరకూ ఇవి తట్టుకొని నిలబడతాయి.

19 / 25

ఎలక్ట్రానిక్ టోల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం వల్ల వాహనాలను నిలపాల్సిన పనిలేదు. ప్రయాణిస్తున్న క్రమంలోనే సెన్సార్లు ఆటోమేటిక్ గా టోల్ ఫీజులు కట్ చేసుకుంటాయి.

20 / 25

వంతెనపై ఉన్న ట్రాఫిక్ సమాచారాన్ని వాహన డ్రైవర్లు ఎప్పటికప్పుడు పరిశీలించేందుకు పెద్ద డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. రోడుపై జరిగిన ప్రమాదాలను కూడా ఇది సూచిస్తుంది.

21 / 25

2006లో ఈ వంతెన‌ నిర్మాణానికి టెండర్లు వేయ‌డం జ‌రిగింది. 2008 ఫిబ్రవరిలో అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ మోడల్ ద్వారా 11 నెలల్లో 6 వేల కోట్ల రూపాయ‌ల‌ను ఈ వంతెన నిర్మాణానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. కొన్ని నెలల అనంత‌రం ఈ ప్రాజెక్టు నుండి అంబానీకి చెందిన రిలయన్స్ కంపెనీ త‌ప్పుకుంది.

22 / 25

ఈ బ్రిడ్జి నిర్మాణంను నోడల్ ఏజెన్సీని మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ నుండి ముంబై మెట్రోపాలిటిన్ రీజియన్ డెవలప్ మెంట్ అథారిటీకి మార్చారు.

23 / 25

జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేటివ్ ఏజెన్సీతో ఎంఎంఆర్‌డీఏ అగ్రిమెంట్ కుదుర్చుకుంది.

24 / 25

దీంతో ప్రాజెక్టు వ్యయంలో 80 శాతం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భరిస్తాయి. 2017 డిసెంబర్‌లో ఈ వంతెన టెండరింగ్ పూర్తైంది. 2018లో ఈ వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి నిర్మాణానికి రూ. 21, 200 కోట్లు ఖర్చు చేశారు.

25 / 25

రాత్రి సమయంలో, ఈ వంతెన రంగురంగుల లైటింగ్‌తో ప్రయాణికులను ఆకర్షిస్తుంది.