AYODHYA RAM MANDIR: అయోధ్య రామ మందిర నిర్మాణం.. సినీ సెలబ్రిటీల విరాళం ఎంతో తెలుసా..

రాజకీయం, వ్యాపారం, సినిమా, క్రీడలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేత్తలు ఎందరో తమ వంతు భక్తిగా విరాళాలు అందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఒక ప్రచారం ప్రకారం.. ఎవరెవరు.. ఎంతెంత విరాళాలు ఇచ్చారో తెలుసుకుందాం.

  • Written By:
  • Updated On - January 21, 2024 / 12:03 PM IST

AYODHYA RAM MANDIR: అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టకు మరో రోజు మాత్రమే ఉంది. ఎందరో భక్తుల విరాళాలతో ఈ ఆలయ నిర్మాణం జరిగింది. రామ మందిర ఏర్పాటులో సామాన్యులతోపాటు వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు కూడా పాలుపంచుకున్నారు. రాజకీయం, వ్యాపారం, సినిమా, క్రీడలు, సాంస్కృతిక, ఆధ్యాత్మిక వేత్తలు ఎందరో తమ వంతు భక్తిగా విరాళాలు అందించారు. ప్రస్తుతం జరుగుతున్న ఒక ప్రచారం ప్రకారం సినీ పరిశ్రమకు సంబంధించి.. ఎవరెవరు.. ఎంతెంత విరాళాలు ఇచ్చారో తెలుసుకుందాం.

AYODHYA RAM MANDIR: అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కోసం మోదీ కఠినమైన దీక్ష..
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్‌కు భక్తి ఎక్కువే. ఆయన చాతుర్మాస దీక్ష చేస్తుంటారు. అందుకే ఆయన రామాలయ నిర్మాణానికి విరాళం అందించినట్లు తెలుస్తోంది. ఆయన రూ.30 లక్షలకుపైగా విరాళం అందించారని సమాచారం. ఇక ఆలయ ప్రారంభోత్సవానికి పవన్‌కు కూడా ఆహ్వానం అందింది. అలాగే బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ రామమందిర నిర్మాణం కోసం జనవరి 17న కొంత విరాళంగా ఇచ్చానని చెప్పారు. అయితే, ఆయన ఎంత విరాళంగా ప్రకటించారో వెల్లడించలేదు. బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ రామమందిర నిర్మాణానికి తన వంతుగా ఇటుకలను విరాళంగా ఇచ్చారు. బాలీవుడ్ డ్రీమ్ గర్ల్, ప్రముఖ నటి హేమ మాలిని కూడా కొంత మొత్తాన్ని విరాళంగా అందించారు. అంతే కాకుండా అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చురుకుగా ప్రచారం చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు, ప్రముఖ హాస్య చిత్రాల్లాలో నటించి మెప్పించిన మనోజ్ జోషి, టీవీ నటుడు గుర్మీత్ చౌదరి కూడా తమ వంతుగా రామమందిర నిర్మాణానికి విరాళం అందించారు. గుర్మీత్ చౌదరి ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు.

తెలుగులో అత్తారింటికి దారేది వంటి చిత్రాల్లో నటించిన హీరోయిన్ ప్రణిత సుభాష్ కూడా తన వంతు విరాళం అందించారు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం చేపట్టిన దేశవ్యాప్త ప్రచారానికి ప్రణీథ రూ.1 లక్ష విరాళంగా అందించారు. మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ రామ మందిరానికి కోటి రూపాయల విరాళం ఇచ్చారు. శక్తిమాన్ ఫేమ్ ముఖేష్ ఖన్నా రామ మందిర నిర్మాణం కోసం 1.11 లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. ఆంఖోన్ దేఖి, మసాన్, కద్వి హవా వంటి అనేక బాలీవుడ్ చిత్రాలను అందించిన నిర్మాత మనీష్ ముంద్రా.. రామ మందిర నిర్మాణానికి రూ.1 కోటి విరాళంగా ఇచ్చారు. గతంలో కూడా ఆయన పలు సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. కరోనా మహమ్మారి సమయంలోనూ వెంటిలేటర్ల కోసం రూ.3 కోట్లు విరాళంగా అందించి తన దాతృత్వాన్ని చాటుకున్నారు.