AYODHYA RAM TEMPLE: భక్తకోటి ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అయోధ్యలో రామ మందిరం మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి రాములవారి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఇది చాలా ఏళ్ల కల. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరుగుతుందా.. లేదా.. అని ఎప్పటినుంచో సందేహాలుండేవి. కానీ, ఒక బాబా మాత్రం అయోధ్యలో రామ మందిర నిర్మాణం గురించి దాదాపు 33 ఏళ్ల ముందే చెప్పారు. ఆయనే దేవ్రహా బాబా అనే సాధువు.
GUNTUR KAARAM: గుంటూరు కారం.. 5 మిలియన్లే టార్గెట్
ఉత్తర ప్రదేశ్‌లోని డియోరియో జిల్లాకు చెంది ఈ బాబాకు స్థానికంగా ఎందరో భక్తులున్నారు. ఆయన అయోధ్యలో రామ మందిర ఆలయం గురించి ఎప్పుడో చెప్పారు. 1990లో కన్నుమూసిన ఆయన.. అదే సమయంలో రామాలయంపై వ్యాఖ్యలు చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అన్ని మతాలు కలిసి అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో పాలు పంచుకుంటాయని దేవ్రహా బాబా చెప్పారు. ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ నేతలకు బాబా.. ఈ విషయం ఎప్పుడో చెప్పారని బాబా ఆశ్రమానికి చెందిన మహంత్ శ్యామ్ సుందర్ దాస్ చెప్పారు. త్వరలో జరగనున్న ఆలయ ప్రారంభోత్సవానికి ఈ ఆశ్రమానికి ఆహ్వానం కూడా అందింది. దేవ్రహా బాబాకు ఎందరో భక్తులు ఉన్నారు.
ఆయన 250 ఏళ్లు జీవించారని కొందరు, 500 ఏళ్లు జీవించారని ఇంకొందరు చెబుతుంటారు. ఆయనకు ఎన్నో మహిమలు ఉండేవని, భవిష్యత్తును ముందే ఊహించగలిగే వారని అంటున్నారు. మాజీ ప్రధానులు.. జవహరల్ లాల్ నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీతోపాటు మాజీ రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్, మదన్ మోహన్ మాలవీయ వంటి ప్రముఖులు కూడా దేవ్రహా భక్తులని స్థానికులు చెబుతుంటారు. ఈ నెల 22న అయోధ్యలో రామ మందిరం ఘనంగా ప్రారంభం కానుంది. దీనికోసం దేశవ్యాప్తంగా ప్రముఖులకు ఇప్పటికే ఆహ్వానాలు అందాయి.